E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రూంలోంచి తరిమేసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today February 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని రూంలోంచి తరిమేసిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మను బలవంతంగా మనోహరి తన రూంలోకి తీసుకెళ్తుంది. ఎందుకు మనోహరి నన్ను నీ రూంకి తీసుకొచ్చావు అంటుంది మిస్సమ్మ. ఇక నుంచి ఇది నా రూం కాదు భాగీ నీ రూమే అనుకో.. నీ రూమే అని వాడుకో  అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ   మరి నువ్వెక్కడుంటావు మనోహరి అని అడగ్గానే.. మనోహరి నేను కూడా ఇక్కడే ఉంటాను అంటుంది. దీంతో మిస్సమ్మ షాకింగ్‌ గా అంటే నేను నీతో రూం షేర్‌ చేసుకోవాలా..? అని అడగ్గానే.. అవును అంటుంది మనోహరి.. దీంతో మిస్సమ్మ నో నేను నీతో రూం షేర్‌ చేసుకోలేను మనోహరి. బెడ్‌ కూడా షేర్‌ చేసుకోలేను. అని చెప్తుంది. దీంతో ఏమైంది భాగీ ఎందుకు అని అడుగుతుంది.

దీంతో మిస్సమ్మ ఇప్పటికే నీ నుంచి నేను చాలా తీసుకున్నాను మనోహరి. ఆయన్ని తీసుకున్నాను.. పిల్లలను తీసుకున్నాను.. ఈ ఆస్థిని తీసుకున్నాను.. ఇప్పుడు ఈ రూం కూడా తీసుకోవాలా..? అంటుంది. అంతా గమనిస్తున్న చంభా మనసులో అందుకేగా నువ్వు తిరిగి వచ్చావు అనుకుంటుంది. నో మనోహరి నో నా వల్ల కాదు.. అనగానే.. మనోహరి ఇట్స్‌ ఓకే భాగీ ఇట్స్‌ ఓకే నువ్వు తీసుకున్నవన్నీ నాకు తిరిగి ఇవ్వడానికే కదా వచ్చావు అంటుంది. మిస్సమ్మ కూడా అందుకే వచ్చాను. నీ రూం వాడుకోవాలి అంటే నాకెందుకో గిల్టీగా ఉంది మనోహరి అంటుంది. దీంతో మనోహరి నవ్వుతూ భాగీ నేనేం ఫీల్‌ అవ్వడం లేదులే ఈ రూం కాదు ఈ ఇల్లే నీది అనుకో అనగానే.. మిస్సమ్మ ఇది నా ఇల్లే కదా అనగానే.. మనోహరి షాకింగ్‌ గా ఏంటి అంటుంది.

Advertisement

దీంతో మిస్సమ్మ అంటే ఒకప్పుడు ఇది నా ఇల్లే కదా అంటున్నాను.. కానీ ఇప్పుడు నీ ఇల్లు కాబోతుంది. ఈ ఇల్లు ఆయన పిల్లలు నీ సొంతం కాబోతున్నారు అని చెప్తుంటే చంభా మాత్రం మనసులో ఈ మనోహరి తను అంత డైరెక్టుగా చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటో ఈ మనోహరి అనుకుంటుంది. మనోహరి మాత్రం ఏనీవే.. థాంక్యూ భాగీ.. నాకు అమర్‌కు పెళ్లి చేసే వరకు నువ్వు అమర్‌తో గొడవ పడకుండా ఉండవా ఫ్లీజ్‌.. అని రిక్వెస్ట్‌ చేయగానే.. మిస్సమ్మ కూడా ఆయనతో గొడవ పడాలని నాకు మాత్రం ఉంటుందా..? చెప్పు ఏం చేస్తాం.. అంటూ అమ్మాయకంగా చూస్తుంది. చంభా మాత్రం మనసులో అవును అవును మీ ఆయనతో మళ్లీ కలిసిపోవాలని వచ్చావు అంతే కదా..? అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ కాకపోతే నువ్వు ఫీల్‌ అవ్వకపోతే నీ ఫ్రెండ్‌ గా నీ రూం వాడుకోవాలంటే నాకేదో గిల్టీగా ఉంది అని చెప్పగానే.. పోనీ నేను యాదమ్మ రూంకు వెళ్తానులే నువ్వు ఒక్కదానివే ఈ రూంలో ఉండొచ్చులే అని మనోహరి చెప్పగానే.. చంభా మాత్రం బాధగా మనోహరి మేడం అది సర్వెంట్‌ రూం చాలా చిన్నది అని చెప్పగానే..

మనోహరి మాత్రం పర్వాలేదులే యాదమ్మ భాగీ కోసం నేను అర్జెస్ట్‌ అవుతానులే.. అని చెప్పగానే.. అంటే నేను బెడ్‌ మీద మీరు కింద పడుకోవడం బాగోదు కదా మేడం అనగానే.. మనోహరి కోపంగా చూస్తుంది. ఓకే మేడం మీరే బెడ్డు మీద పడుకోండి నేనే కింద పడుకుంటాను.. అని చెప్పగానే.. భాగీ ప్రాబ్లమ్‌ సాల్వ్‌ నువ్వు ఈ రూంలోనే ఉండు.. నేను యాదమ్మ ఆ రూంలో ఉంటాము అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ థాంక్యూ మనోహర నీది ఎంత పెద్ద మనసో అంటుంది. దీంతో మనోహరి పర్వాలేదు భాగీ సరే కాసేపు రెస్ట్‌ తీసుకుని నువ్వు వచ్చిన పని మీద దృష్టి పెట్టు.. అని చెప్పగానే.. అలాగే మనోహరి అంటుంది మిస్సమ్మ.. మనోహరి చంభాను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  మనోహరి వెలిపోయాక మిస్సమ్మ కోపంగా చూస్తూ.. పిచ్చి పుల్లమ్మ నిన్ను నీ రూం నుంచి సర్వెంట్‌ రూంకు తరిమేశాను.. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో పిల్లలు, రాథోడ్‌ వస్తారు. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×