E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఇంటికి బయలుదేరిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today February 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఇంటికి బయలుదేరిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

అమర్‌ ఇంటికి వెళ్లడానికి మిస్సమ్మ రెడీ అవుతుంది. బుజ్జమ్మ కూడా తాను రెడీ అయి మిస్సమ్మ దగ్గరకు వచ్చి అమ్మా నా లగేజీ రెడీ అని చెప్తుంది. మిస్సమ్మ కూడా నా లగేజ్‌ కూడా రెడీ అని చెప్పగానే.. బుజ్జమ్మ ఇంక వెళ్దామా అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ సరే ముందు నేను వెళ్తాను తర్వాత తాతయ్యతో నువ్వు రావాలి అని చెప్తుంది. అర్థం కాక బుజ్జమ్మ అదేంటమ్మా ఇద్దరం కలిసి వెళ్లకూడదా..? అని అడగ్గానే.. కరుణ లేదు బుజ్జమ్మా ఆడ నువ్వెవరో అమ్మ ఎవరో ఒకరికి ఒకరు తెలియనట్టే ఉండాలి అని చెప్తుంది. దీంతో బుజ్జమ్మ ఇంకెన్నాళ్లు అమ్మ అని అడుగుతుంది. దీంతో ఇంకొద్ది రోజులే బుజ్జమ్మ అని మిస్సమ్మ చెప్పగానే.. నాన్న వచ్చి మనల్ని తీసుకెళ్లేంత వరకా..? అని బుజ్జమ్మ అడగ్గానే..

మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతూ.. మీ నాన్నకు నా మీద కోపం పోయేంత వరకు  అని మనసులో అనుకుని అవును బుజ్జమ్మ అని చెప్తుంది. ఇంతలో రాజు ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు బుజ్జమ్మ అతి త్వరలోనే నాన్న మిమ్మల్ని కలుస్తారు అని చెప్పగానే.. మిస్సమ్మ.. బుజ్జమ్మ బ్యాగులో బట్టలు సర్దుకున్నావు కదా బుక్స్‌ కూడా సర్దుకో.. అటు నుంచి అటే నువ్వు స్కూల్‌కు కూడా వెళ్లాలి అని చెప్పగానే.. ఓకే అంటూ బుజ్జమ్మ లోపలికి వెళ్తుంది. ఇక కరుణ కోపంగా చూస్తూ.. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా ఆ సైతాన్‌ మనోహరికి చుక్కలు చూపించాలి అంటుంది. రాజు కూడా అవునమ్మా ఇన్నాళ్ళు ఆ రాక్షసి మిమ్మల్ని పెట్టిన కష్టానికి రెట్టింపు కష్టం ఇవ్వాలి అని చెప్తుండగానే.. రాథోడ్‌ వస్తూ.. అందుకేగా మిస్సమ్మ అక్కడికి వస్తుంది అంటాడు. రాథోడ్‌ను చూసి కరుణ ఇదేంది నువ్వు వచ్చిన వేంది.. మా భాగీని తీసుకెళ్లడానికి ఆ మనోహరి వస్తుంది అనుకున్నానే.. అంటుంది.

Advertisement

దీంతో రాథోడ్‌ నవ్వుతూ ఆ బకరా అక్కడ వెయిట్‌ చేస్తుంది. మిస్సమ్మను తీసుకుని వస్తానని నేను వచ్చాను అంటాడు. మిస్సమ్మ అనుమానంగా వాళ్లు ఎవ్వరికీ  డౌటు రాలేదు కదా రాథోడ్‌ అని అడగ్గానే.. ఆ చాన్స్‌ నువ్వు ఇవ్వలేదు కదా మిస్సమ్మ.. నీ వలలో ఆ వెర్రి చాప అడ్డంగా పడింది అని చెప్తాడు. దీంతో కరుణ అది మామూలు చేప కాదు రాథోడ్‌ సొర చేప దాన్ని అడ్డంగా కోసి కారం పెట్టాలి అంటుంది. ముందు ముందు జరగబోయిది అదే.. ఆ చేపను  మిస్సమ్మ కండకండాలుగా కోసేసి కారం పెట్టేస్తుంది అని చెప్తాడు. ఇంతలో మిస్సమ్మ బాబాబ్‌ గారు ఇన్నాళ్లు నాకు నాన్నలా అండగా ఉన్నారు అని చెప్పగానే.. అయ్యో మీ రుణం మేము తీర్చుకుంటున్నాము భయపడుతూ ఇక్కడికి వచ్చారు.  కానీ ఆ దేవుడు మీకు అంతా మంచే చేశారు అమ్మా.. సరస్వతి మేడం అన్ని ఆలోచించే మిమ్మల్ని ఇక్కడికి పంపించారు అమ్మ.. అనగానే.. అవును బాబాయ్‌ మేడంకు థాంక్స్‌ చెప్పాలి అంటుంది. దీంతో మేడంకు ఇక్కడ జరిగేవి అన్ని తెలుసు అమ్మ.. నేను చెప్తూనే ఉన్నాను కదా..? వీలు చూసుకుని త్వరలోనే వస్తాను అన్నారు అమ్మ అనగానే..

ఇంతలో రాథోడ్‌ మిస్సమ్మ టైం అవుతుంది. నీకోసం అక్కడ బకరా వెయిటింగ్‌ పద బయలుదేరుదాం అంటాడు. ఇంతలో కరుణ రాథోడ్ అక్కడ భాగీ జర జాగ్రత్త జర నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పగానే.. ఆ విషయం నువ్వు నాకు మళ్లీ చెప్పాలా ఏంటి..? అది నా బాధ్యత అంటాడు. మిస్సమ్మ అందరికీ బై చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×