E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ప్లాన్ సక్సెస్

Nindu Noorella Saavasam Serial Today February 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ప్లాన్ సక్సెస్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

ఒకవైపు అమర్‌ ఇంట్లో అందరూ హాల్లో నిలబడి మాట్లాడుతుంటారు. మరోవైపు ఆశ్రమంలో మిస్సమ్మ, కరుణ, రాజు ఆలోచిస్తుంటారు. ఏదో ఆలోచిస్తూ అటూ తిరుగుతున్న అమర్‌ వెంటనే మనోహరిని చూస్తూ తనకు ఫోన్‌ చేయ్‌ మనోహరి. పాప గురించి అడుగు అని చెప్తాడు. మనోహరి అయోమయంగా చూస్తుంటుంది. రాథోడ్‌ మాత్రం మనసులో ఫోన్‌ చేయమన్నది  అక్కడ మిస్సమ్మ ఆల్‌రెడీ వెయిటింగ్‌ అనుకుంటాడు. అటువైపు వెయిట్‌ చేస్తున్న కరుణ అవునే నీకు ఈ పాటికి ఫోన్‌ రావాలి కదా ఇంకా రాలేదేంటి..? అంటుంది. అప్పుడే ఫోన్‌ రింగ్‌ అవుతుంది. ఫోన్‌ చూసి రాజు అదిగో నువ్వు అన్నవో లేదో ఫోన్‌ వచ్చేసిందమ్మా..? అంటాడు.

మిస్సమ్మ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంటే.. కరుణ దగ్గర కూర్చుని భాగీ ఇక నీ యాక్టింగ్‌ క షురూ చేయ్‌.. ఆ తాటకికి చుక్కలు చూపించు.. అని చెప్పగానే.. మిస్సమ్మ ఫోన్‌ లిఫ్ట్ చేసి డల్లుగా హలో అని పిలుస్తుంది. మనోహరి హలో భాగీ అనగానే.. చెప్పు మనోహరి అంటుంది. మనోహరి ఎలా ఉన్నావు అని అడగ్గానే.. మిస్సమ్మ ఏడుస్తున్నట్టు నటిస్తూ.. రాముడు లేని సీత ఎలా ఉంటుంది. పువ్వులు లేని మొగ్గ ఎలా ఉంటుంది. ఆకులు లేని చెట్టు ఎలా ఉంటుంది. నేను అలాగే మోడుబారిపోయాను మనోహరి. ఏడారిలో ఒయాసిస్‌ కోసం ఎండమావుల వెంట వెతుకుతూ ఉన్నట్టు ఉంది నా పరిస్తితి ఏం చెప్పమంటావు అని చెప్తుంది. అటువైపు లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మాట్లాడుతున్న  మనోహరి షాక్‌ అవుతుంది. అంతా వింటున్న అమర్‌ ఫీలవుతుంటాడు. చంభా మాత్రం మనసులో భాగీ నటన మొదలు పెట్టింది. ఇక ఈ మనోహరికి పులిహోరే అనుకుంటుంది.

Advertisement

మనోహరి మాత్రం మిస్సమ్మ మాటలకు అయ్యో నువ్వు అంత బాధలో ఉన్నవా..? భాగీ.. అనగానే.. అవును ఎంత బాధలో ఉన్నానో ఎలా చెప్పను మనోహరి. నా బాధ చెప్తే కథ అవుతుంది. రాస్తే కవిత అవుతుంది. తీస్తే పెద్ద సినిమా అవుతుంది. తీస్తూనే ఉంటే సీరియల్‌ కూడా అవుతుంది. అని చెప్తుంటే.. అమర్‌ ఇరిటేటింగ్‌గా తను తన ఓవరాక్షన్.. పాయింట్ కు రా మనోహరి అని చెప్పగానే.. మిస్సమ్మ ఏంటి మనోహరి ఆయన గొంతు పెద్దగా వినిపిస్తుంది. ఓ ఫోన్‌ స్పీకర్‌ లో పెట్టావా ఏంటి..? అని అడగ్గానే.. అంటే ఇక్కడ నేను అమర్‌, రాథోడ్‌, పిల్లలు, యాదమ్మ అందరం ఉన్నాం భాగీ అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ బాధగా అక్కడ అందరూ ఉన్నారు.. కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను.. మీ అందరినీ మిస్‌ అవుతున్నాను మనోహరి.. అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది. అమర్‌ కోపంగా కావాలని వెళ్లిపోయి మళ్లీ ఒంటరిగా ఉన్నానని మిస్‌ అవుతున్నానని చెప్తున్నావా..? అన్ని అబద్దాలే.. అనగానే..

నేను చెప్తున్నవన్నీ నిజాలండీ.. అంటుంది మిస్సమ్మ. దీంతో అమర్‌ నేను మాట్లాడుతుంది నీతో కాదు అనగానే.. కానీ వినిపిస్తుంది కదండి అంటుంది మిస్సమ్మ దీంతో అమర్‌ కోపంగా మనోహరి పాప గురించి అడుగు అని చెప్పగానే.. మనోహరి కూల్గా భాగీ పాప ఎక్కడ అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఏ పాప అని అడుగుతుంది. అదే నీకు అమర్ కు పుట్టిన పాప అని మనోహరి  చెప్పగానే మిస్సమ్మ తను కేవలం నా పాప కాదు మనోహరి.. తను నా కంటి పాప, నా ఇంటి వెలుగు, నా ఒంట్లో ప్రాణం.. మళ్లీ పుట్టిన నా అక్క అని చెప్పగానే.. ఆ పాప కావాలని అమర్‌ అడుగుతున్నాడు. అని చెప్పగానే.. నా పాప ఆయనకెందుకు అంటూ మిస్సమ్మ చెప్పగానే.. అమర్‌ కోపంగా ఎందుకు అంటుందేంటి..? ఆ పాప తనకు మాత్రమే కాదు నాకూ కూతురే.. నా కూతురు నా దగ్గరే ఉండాలి అని అమర్‌ చెప్పగానే.. మీకు నలుగురు పిల్లలు ఉన్నారు కదా… మళ్లీ ఐదో పాప అవసరమా..? అని మిస్సమ్మ అడగ్గానే..

Advertisement

నా కూతురు నాకు అవసరం మర్యాదగా నా కూతురును నాకు ఇవ్వు అని అమర్‌ చెప్పగానే.. నీకు నేను అక్కరలేదు కానీ నా కూతురు కావాలా..? అంటుంది మిస్సమ్మ దీంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది నువ్వు.. నాకు నా పాప కావాలి అంటూ అమర్‌ చెప్పగానే.. పాప లేకపోతే నేను బతకలేను అంటుంది మిస్సమ్మ.. దీంతో అమర్‌ కోపంగా చూస్తుంటే.. అమర్‌ నువ్వు ఉండు.. అంటూ మనోహరి భాగీ నువ్వు పాపను తీసుకుని రేపు ఇంటకి రా అని చెప్తుంది. దీంతో పిల్లుల అందరూ నవ్వుకుంటారు..   చంభా మాత్రం మనోహరిని మనసులోనే తిట్టుకుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×