E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ  ట్రాప్ లో పడిపోయిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today February 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ  ట్రాప్ లో పడిపోయిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ ఏడుస్తూ.. మనోహరిని హగ్‌ చేసుకుంటుంది. అది చూసిన చంభా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి భాగీ, మనోహరి చెంప చెల్లుమనిపిస్తుంది అనుకుంటే ఇలా చేస్తుందేంటి అని మనసులో అనుకుంటుంది. అప్పుడే మనోహరి బాధపడుతున్నట్టు భాగీ ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లిపోయావు భాగీ  అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ  కనీసం నువ్వైనాఅడిగావు చాలా థాంక్స్‌ మనోహరి. నేను చెప్తున్నా ఆయన వినకుండా వెళ్లిపోయారు అంటుంది. దీంతో మనోహరి అమాయకంగా నువ్వు అలా వెళ్లిపోయినందుకు అమర్‌కు కోపం వచ్చింది. అసలు ఏం జరిగింది భాగీ అని అడగ్గానే.. మిస్సమ్మ భయపడుతున్నట్టు నటిస్తూ.. నా కూతురు వల్ల అమ్ముకు ప్రాణగండం ఉందని పంతులు గారు చెప్పారు. అందుకే అమ్ము కోసం బుజ్జమ్మను తీసుకుని దూరంగా వెళ్లిపోయాను అని చెప్పగానే..

మనోహరి ఏమీ తెలియనట్టు ఓహో నువ్వు వెళ్లక ముందే అమ్ముపై రెండు మూడు సార్లు దాడి జరిగింది అందుకేనా..? అని అడగ్గానే.. మేము దగ్గర ఉంటే అమ్ముకు అపాయం అని దూరంగా వెళ్లిపోయాము అని చెప్పి ఏడుస్తుంటే.. మరి ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు.. అని మనోహరి అడగ్గానే.. ఆయన్ని పిల్లలను చూద్దామని వచ్చాను. పైగా ఆ జాతకం ప్రభావం తగ్గిపోయి ఉంటుంది అనుకున్నాను.  కానీ ఆ జాతక ప్రభావం అమ్ము నుంచి బుజ్జమ్మకు షిప్ట్‌ అయింది అంటూ ఏడుస్తున్న నటిస్తుంది. మనోహరి మాత్రం మొన్న స్కూల్‌ లో బుజ్జమ్మ మీద అటాక్‌ జరిగింది అందుకేనా..? అని అడగ్గానే.. అవును బుజ్జమ్మ నీకు తెలుసా..? అంటూ మిస్సమ్మ అడగ్గానే.. మనోహరి షాక్‌ అవుతుంది. కంగారుగా అది కరుణ చెప్పింది. నేను కూడా నిన్ను చూడాలని చాలా ట్రై చేశాను. ఈరోజుకు ఇలా కుదిరి ఇక్కడ కలిశాము. నీ పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు భాగీ అనగానే..

Advertisement

మిస్సమ్మ ఏడుస్తూ.. సాటి ఆడదానికిగా నా పరిస్థితి చాలా బాగా అర్థం చేసుకున్నావు మనోహరి అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తూనే.. మనోహరిని హగ్‌ చేసుకుంటుంది. మనోహరి నవ్వుకుంటుంది. చంబా మాత్రం అనుమానంగా చూస్తూ.. ఎక్కడో తేడా కొడుతుందే.. భాగీ క్యారెక్టర్‌ ఇది కాదే..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ ఎలా ఉన్నావు యాదమ్మ అని పలకరించగానే.. చంభా సారీ మేడం.. మనోహరి మేడం మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు అని నేను మాట్లాడలేదు. మీరు ఎలా ఉన్నారు మేడం.. పాప ఎలా ఉంది..? అని అడగ్గానే.. మిస్సమ్మ ఏదో ఉన్నాం యాదమ్మ ఇన్నాళ్లు మా అక్క పిల్లలను చూసుకున్నందుకు చాలా థాంక్స్‌ అని చెప్పగానే..

చంభా పిల్లలను చూసుకుంది నేను కాదు మేడం మనోహరి మేడం గారు అని చెప్పగానే.. మిస్సమ్మ అవునా మనోహరి.. నా స్థానంలో ఉండి పిల్లలన్ని నువ్వు చూసుకున్నావా..? అసలు నా స్థానంలో ఉండాల్సింది నువ్వే తెలుసా.? మా అక్క చనిపోయాక ఆయనకు నువ్వు భార్యవి కావాల్సింది. అనవసరంగా నేను అడ్డు అయ్యాను. ఆ పాపమే నాకు నా కూతురుకు తగిలినట్టు ఉంది. అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంటే.. మనోహరి మాత్రం నవ్వువకుంటూ భాగీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుననావు.. అని అడగ్గానే.. చెయ్యడానికి ఏముంది. ఆయనకు పిల్లలకు నేను నా కూతురు దూరంగా ఉండటం తప్పా వేరే దారే లేదు.. అని చెప్పగానే..

Advertisement

మనోహరి అనుమానంగా అంటే మళ్లీ నీ కూతురును తీసుకుని దూరంగా వెళ్లిపోతావా..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ వెళ్లాలి కదా మనోహరి. లేదంటే అమ్ముకు నా కూతురుకు ప్రమాదం కదా..? కాకపోతే ఒక్కటే బాధ అనగానే.. ఏంటా బాధ అని మనోహరి అడుగుతుంది.   దీంతో మిస్సమ్మ ఏడుస్తున్నట్టు నటిస్తూ.. ఆయనకు ఇక తోడు కావాలి.. ఆ తోడు నువ్వే కావాలి అని చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×