E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుడిలో మిస్సమ్మను చూసిన అమర్

Nindu Noorella Saavasam Serial Today February 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గుడిలో మిస్సమ్మను చూసిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

అమర్‌, మిస్సమ్మ ఒకే గుడికి వెళ్లారని తెలుసుకున్న మనోహరి ఇరిటేటింగ్‌ గా కారేసుకుని గుడికి బయలుదేరుతుంది. మధ్యలోకి వెళ్లగానే కారు టైర్‌ ఫంక్చర్‌ అవుతుంది. కారు బాలెన్స్‌ అవుటవడంతో చంభా భయపడుతుంది. మనోహరి కారును పక్కకు ఆపేస్తుంది. కారు దిగిన చంభా భయంగా ఏమైంది మనోహరి అని అడగ్గానే.. మనోహరి ఇరిటేటింగ్‌గా చ ఇప్పుడే కారు టైర్‌ పంక్చర్‌ అవ్వాలా అనుకుంటుండగా.. కారులో స్టెపినీ ఉంది కదా మార్చేద్దాం అంటుంది. లేదు చంభా మనం మార్చలేము అంటుంది మనోహరి.

పోనీ క్యాబ్‌ బుక్‌ చేయ్‌ మనోహరి అని చెప్పగానే.. అదెప్పుడు రావాలి… అంటుంది మనోహరి. మరి ఇప్పుడు ఎవరినైనా లిఫ్ట్‌ అడుగుదామా..? అని చెప్పగానే.. నాకు అంత ఓపిక లేదు చంభా అని చెప్తుంది మనోహరి. మరి ఇప్పుడు ఏం చేస్తావు అని చంభా అడగ్గానే.. రన్నింగ్‌ చేద్దాం పద అంటూనే మనోహరి పరుగెడుతుంది. వెనకాలే చంభా కూడా మనోహరి మనోహరి.. ఆగు మనోహరి నా వల్ల కావడం లేదు అంటూ పరుగెడుతుంది.

Advertisement

గుడికి వెళ్లిన అమర్‌తో పిల్లలు మేము ప్రదక్షిణ చేసి వస్తామ్‌ డాడీ అంటూ వెళ్లి ప్రదక్షిణ చేస్తుంటారు. పక్కనే మిస్సమ్మ కూడా ప్రదక్షిణ చేస్తుంటుంది. మరోవైపు మనోహరి వెనకాలే పరుగెడుతున్న చంభా.. ఆగు మనోహరి.. ఫ్లీజ్‌ ఆగు.. నేను వస్తాను అంటుంది. మనోహరి ఇరిటేటింగ్‌ గా అబ్బా రా చంభా నువ్వు స్పీడుగా రా..? అంటుంది. చంభా మాత్రం ఆయాసంగా  ఈ మనోహరి ప్రేమ ఏమో కానీ నా ప్రాణాల మీదకు వచ్చినట్టు ఉంది. పరుగెత్తి పరుగెత్తి చచ్చిపోయేలా ఉన్నాను. అనుకుంటూ పరుగెడుతుంది. ముందు వెళ్తున్న మనోహరి తొందరగా రా చంభా స్పీడుగా పరుగెత్తు.. అనగానే.. చంభా నావల్ల కాదమ్మా నువ్వు వెళ్తూ ఉండు.. నేను చిన్నగా వస్తానులే.. అంటుంది.

దీంతో మనోహరి మనం త్వరగా వెళ్లకపోతే అక్కడ కొంపలు అంటుకుంటాయి అని చెప్పగానే.. అంటుకుంటే అంటుకోనిలే.. అంటుకునేది నీ కొంపలేగా నా కొంప కాదు అంటుంది. మనోహరి కోపంగా ఏంటి..? అనగానే.. ఆ ఏం లేదు.. ఏం లేదు అంటుంది చంభా.. ఇంతలో మనోహరి చెప్పు తెగిపోతుంది. మనోహరి కోపంగా చీ ఇప్పుడే ఈ చెప్పు కూడా తెగిపోయింది అనుకుంటుంది. దీంతో చంభా కూడా ఉన్న దరిద్రానికి తోడు ఈ దరిద్రం కూడానా..? అంటుంది. సరే వదిలేయ్‌ నువ్వైతే రా చంభా అంటూ మనోహరి పరుగెడుతుంది.  నువ్వు పరుగెత్తు నేను నీ వెనకాలే వస్తాను.. చెప్పులు తెగిపోయినా ఆగలేదా..? నువ్వు వెళ్లు మనోహరి నేను వస్తున్నాను అంటుంది చంభా.

Advertisement

మరోవైపు గుడిలో ప్రదక్షిణ చేస్తున్న అంజు పక్కనే రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేస్తున్న మిస్సమ్మను చూస్తుంది. వెంటనే షాక్‌ అవుతుంది. ప్రదక్షిణ చేయకుండా అలాగే నిలబడిపోతుంది. దీంతో అమ్ము ఏయ్‌ అంజు ఏంటి ప్రదక్షిణ చేయకుండా అలాగే నిలబడిపోయావు.. ఎందుకు అటు చూస్తున్నావు అని అడుగుతుంది. దీంతో అంజు మిస్సమ్మ.. అంటుంది. ఆనంద్‌ ఏంటి..? అని అడగ్గానే.. అంజు మిస్సమ్మ అనగానే.. ఆకాష్‌ ఎక్కడుంది..? అని అడుగుతాడు. అంజు అదిగో అక్కడుంది మిస్సమ్మ అని చూపిస్తుంది. దీంతో పిల్లలు ముగ్గురు మిస్సమ్మను చూసి షాక్‌ అవుతారు. మిస్సమ్మ ప్రదక్షిణ పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటే.. అంజు గట్టిగా మిస్సమ్మ అని పిలుస్తుంది. పిల్లలను చూసిన మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది.

పిల్లలు మిస్సమ్మ అనుకుంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి హగ్‌ చేసుకుంటారు. ఏడుస్తూ.. ఎమోషనల్ అవుతుంటారు. పక్కనే ఉన్న కరుణ హ్యాపీగా చూస్తుంటుంది.  పిల్లలకు జరిగిన విషయం చెప్తుంది మిస్సమ్మ. తనను చూడనట్టే ఉండాలని సూచిస్తుంది. పిల్లలు కూడా సరేనని అమర్‌ దగ్గరకు వెళ్తారు. ఇంతలో గుడిలో ప్రవచనం చెప్తున్న పంతులు ఇప్పుడు గంగా మాత, పరమశివుడికి ఎదురుపడే సమయం ఆసన్నమైంది అని చెప్తుండగానే అమర్‌ పిల్లలతో దేవుడిని మొక్కుతుంటే వెనక నుంచి వచ్చిన మిస్సమ్మ గంట కొట్టబోతుంది. అప్పుడే అమర్‌ కూడా గంట కొట్టబోతాడు. వెంటనే మిస్సమ్మను చూసి షాక్‌ అవుతాడు. అప్పుడే పరుగెత్తుకుంటూ గుడిలోకి వస్తుంది మనోహరి. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×