E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను కలిసేందుకు వెళ్లిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today February 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ను కలిసేందుకు వెళ్లిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ, కరుణ గుడికి వెళ్తారు అక్కడ పంతులు శివపార్వతుల గురించి గంగమ్మ గురించి చెప్తుంటాడు అది విన్న కరుణ   వావ్‌ ఏం టైమింగే.. పంతులు గారు మీ గురించే చెప్తున్నారు అంటుంది. దీంతో ఆశ్చర్యంగా మిస్సమ్మ మా గురించా..? అని అడుగుతుంది. కరుణ అవునే మీ ఆయన పరమశివుడు. మీ అక్క అరుంధతి పార్వతిదేవి, నువ్వేమో గంగా మాత అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ అంతలేదే ఆయనేం నన్ను తల మీద పెట్టుకోలేదు అనగానే.. నువ్వు కూడా తల మీద ఎక్కేదానివి కాదులే అందుకే మీ ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అవునే ఈ రోజు శివరాత్రి కదా..? శివపార్వతుల కళ్యాణం కదా ఇంత పవిత్రమైన రోజు కూడా ఆ శివుణ్ని చూడకుండా ఆయన కంఠంలో విషాన్ని, మెడలో ఉన్న పామును చూడ్డానికి గుడికి తీసుకొచ్చినవా ఏంటే..? అదేనే విషం అంటే ఆ మనోహరి. ఆ విషసర్పాన్ని చూడ్డానికే కదా నువ్వు గుడికి వచ్చింది అనగానే..

మిస్సమ్మ కాదు శివుడిని చూడ్డానికి వచ్చాను. శివుడు అంటే మా ఆయన అని చెప్పగానే.. కరుణ ఆశ్చర్యంగా ఏంటే ఇట్లా షాకుల మీద షాకులు ఇస్తున్నావు.. మనోహరి అంతు చూస్తానని రాత్రే చెప్పినవ్‌ కదా..? ఇవాళ తనను కలవాలని పొద్దున్నే నాతో ఫోన్‌ చేయించావు.. అనగానే.. ఆ పని చేయడానికి మా ఆయన బ్లెస్సింగ్స్‌ తీసుకోవాలి అని మిస్సమ్మ చెప్పగానే.. కరుణ షాకింగ్‌ గా ఎట్లా తీసుకుంటావు.. మీ ఆయనకు కొన్నాళ్లు ఎదురుపడను.. కనబడను అని చెప్పావు కదా అనగానే.. మిస్సమ్మ ఈరోజు ఆయనకు ఎదురుపడబోతున్నాను అని చెప్తుంది. దీంతో కరుణ నిజంగా ఎట్లనే ఎట్లా ఎదురుపడతావు అంటుంది. నేను చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావుగా అంటుంది మిస్సమ్మ. దీంతో కరుణ ఇగో నాకు ఈ సస్పెన్స్‌ అవసరమా..? అని  అడగ్గానే.. మిస్సమ్మ నీకు సస్పెన్స్ నాకైతే ఎగ్జైట్‌మెంట్‌ వెయిట్‌ అండ్‌ సీ అని చెప్తూ ఇద్దరూ గుడిలోకి వెళ్తారు.

Advertisement

మరోవైపు అమర్‌ ఇంట్లో పూజ చేస్తుంటాడు. పిల్లలు, మనోహరి, రాథోడ్‌, చంభా నిలబడి  చూస్తుంటారు. ఇంతలో చంభా ఏంటి మనోహరి ఎన్నడూ లేనిది అమరేంద్ర ఇవాళ ఇంత హడావిడి చేస్తున్నారు. తనే పూజ చేసి హారతి ఇస్తున్నాడు అనగానే.. మనోహరి ఇరిటేటింగ్‌ గా అరుంధతికి శివరాత్రి అంటే ఇష్టం. అప్పట్లో పొద్దున్నే పూజలు చేసేది. అమరేంద్ర అది గుర్తు పెట్టుకుని ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్తుంది. ఇంతలో అమర్‌ పూజ పూర్తి చేసి హారతి ఇస్తుంటాడు. చంభా మాత్రం వెటకారంగా చచ్చిపోయిన పెద్ద పెళ్లాం మీద అమరేంద్రకు ఎంత శ్రద్దో.. పారిపోయిన చిన్న పెళ్లాం మీద అమరేంద్రకు అంత శ్రద్ద ఉందో లేదో అంటుంది.

మనోహరి కోపంగా ఇప్పుడు పెద్ద పెళ్లాం చిన్న పెళ్లాం అంటూ ఎవరూ లేరు అమర్‌కు ఉన్నది నేను మాత్రమే పద హారతి తీసుకుందాం అంటూ ఇద్దరూ దగ్గరకు వెళ్లి హారతి తీసుకుంటారు. రాథోడ్‌ నవ్వుతూ పూజ చాలా బాగా చేశారు సార్‌ అచ్చం అరుంధతి మేడం గారు చేసినట్టే చేశారు అనగానే.. అమ్ము కూడా అవును డాడ్‌ మీరు పూజ చేస్తుంటే అమ్మే గుర్తుకు వచ్చింది అని చెప్తుంది. ఆనంద్‌ కూడా అమ్మ ప్రతి శివరాత్రి ఇలాగే చేసేది.. అని చెప్పగానే.. ఆకాష్‌ కూడా అమ్మ తర్వాత మిస్సమ్మ ఈ పూజను కంటిన్యూ చేసింది అంటాడు. దీంతో అంజు కూడా మిస్సమ్మ అయితే ఇంకా బాగా పూజ చేసేది అంటుంది. రాథోడ్‌ కూడా నిజమే మిస్సమ్మ పూజ చేస్తే సాక్ష్యాత్తు ఆ కైలాసం నుంచి ఆ శివుడే మన ఇంటికి వచ్చినట్టు ఉండేది సార్‌ అంటాడు.  దీంతో మనోహరి, చంభా రాథోడ్‌ను తిట్టుకుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×