E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన కాళీ – అమర్‌, మనోహరిని చంపేస్తాడన్న మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today February 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన కాళీ – అమర్‌, మనోహరిని చంపేస్తాడన్న మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : ఇంటికి వచ్చిన మనోహరిని చూసి మిస్సమ్మ  వెటకారంగా మాట్లాడుతుంది. దొరికినట్టే దొరికి తప్పించుకున్నావా..? మనోహరి అంటూ నిలదీస్తుంది. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. కోపంగా రాథోడ్‌ను చూస్తూ.. నువ్వేంటి నా వెనకాల ఫాలో అవుతూ వచ్చావు.. అమర్‌కు ఆ సలహా ఇచ్చింది నువ్వేనా అంటూ తిడుతుంది. దీంతో మిస్సమ్మ నువ్వేంటి మనోహరి అంతలా ఫీలవుతున్నావు. నువ్వేదో రణవీర్‌ను కలవడానికి వెళ్లినట్టు రాథోడ్‌ వాళ్లు వచ్చి నిన్ను డిస్టర్బ్‌ చేసినట్టు ఫీలవుతున్నావేంటి..? అని అడుగుతుంది. మనోహరి షాకింగ్‌గా ఏయ్‌ ఏమన్నావు.. అంటుంది. అదే మాకెవరికీ తెలియకుండా ఆ ఇంటికి రణవీర్‌ను కలవడానికి వెళ్లావా..? మా ఆయన వచ్చినందుకు ఫీలవ్‌ అవుతున్నావా..? అంటున్నాను అని చెప్పగానే.. నేను ఎందుకు అతన్ని కలవడానికి వెళ్తాను. అయినా ఆయన ఎప్పుడో కోల్‌కతా వెళ్లిపోయారు కదా అంటూ లోపలికి వెళ్తుంది మనోహరి.

యమలోకం వెళ్లిన చిత్రగుప్తుడు.. అనామికలోకి వెళ్లిన ఆరుకు గతం ఎందుకు గుర్తు లేదోనని పుస్తకాలలో వెతుకుతుంటాడు. ఒక బుక్కులో సమాధానం దొరుకుతుంది. ఆత్మ, శరీరంలోకి ప్రవేశించే సమయంలో శరీరం నిర్జీవంగా ఉండాలని ఉంటుంది. దీంతో చిత్రగుప్తుడు షాక్ అవుతాడు. ఎలాగైనా ఆ బాలికకు గతం గుర్తు చేసి యమలోకం తీసుకురావాలిన వెళ్తాడు. కింద అనామిక లేచి తన జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువులు తగులబెడుతుంది. చిత్రగుప్తుడు వెళ్లి ఎంత చెప్పినా.. వినబడు. కనబడడు. ఇంతలో అనామిక తన ఫ్రెండ్‌ సారాకు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌ వెళ్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలకు చిత్రగుప్తుడు షాక్‌ అవుతాడు.

Advertisement

మిస్సమ్మ రొమాంటిక్‌గా అమర్‌ను చూస్తూ.. అబ్బా ఈరోజు మా ఆయన ఎంత అందంగా కనబడుతున్నాడో అని మనసులో అనుకుంటుంది. వెంటనే నిద్ర లేచి ఇది కలా అనుకుంటుంది. మరోవైపు కాళీ బైక్‌ తీసుకుని వెళ్లిపోతుంటే.. ఓరేయ్‌ తమ్ముడు ఎక్కడకు వెళ్తున్నావు అని అడుగుతుంది మంగళ. భాగీని కలవడానిక వాళ్ల ఇంటికి వెళ్తున్నా అని చెప్తాడు. దీంతో మంగళ కోపంగా దాని దగ్గరకు ఎందుకురా..? ఇవాళ మనం ఇలా దిక్కుమొక్కు లేకుండా ఉన్నామంటే.. కారణం ఆ భాగీ దాని రోగిష్టి నాయనే కదరా..? అంటుంది. దీంతో కాళీ నీకు ఇంత జరిగినా ఇంకా బుద్ది రాలేదు కదా అక్కా.. మనం ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణమైన మనోహరితో దోస్తీ చేస్తున్నాం.

అడిగినప్పుడల్లా పైసలిచ్చి ఇంట్లో పెట్టుకున్న భాగీని తిడుతున్నావు అంటాడు. దీంతో మంగళ ఏందిరోయ్‌ మేనకోడలి మీద మస్తు ప్రేమ ఉన్నట్టు ఉంది అంటుంది. దీంతో కాళీ ఎందుకుండదే..  ఈ చేతులతో ఎత్తుకుని పెంచిన.. అట్లనే నా లవర్‌ ఉంది కదా కలిసి ఒక్క జలక్‌ ఇచ్చి వస్తాను.. అంటాడు. దీంతో ఓరేయ్‌ నిప్పుతో దీపం వెలిగించుకోవాలి కానీ ఇల్లు అంటించుకోకూడదు. ఆ మనోహరిని మరీ తక్కువ చేస్తే.. ఇద్దరిని చంపేస్తుంది అంటూ ఇంతకీ వంట ఏం చేయమంటావు అని అడుగుతుంది. నేను భాగీ చేతి వంట తినొస్తాను అని వెళ్తాడు కాళీ.

Advertisement

ఇంట్లో భోజనానికి అంతా రెడీ చేసిన మిస్సమ్మ అందరినీ భోజనానికి పిలుస్తుంది. అప్పుడే కాళీ వస్తాడు. రాథోడ్‌ వెళ్లి అడ్డుకుంటాడు. అయినా వినకుండా లోపలికి వెళ్తాడు కాళీ. కాళీని చూసి మిస్సమ్మ మామయ్య నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. ఇవాళ పొద్దుగాల వచ్చిన అని చెప్తాడు. ఇంతలో లోపలి నుంచి మనోహరి వచ్చి షాక్ అవుతుంది. వీడొచ్చాడేంటి..? కొంపదీసి అమర్‌కు నిజం చెప్పేస్తాడా..? అయినా వాడు అడిగినట్ట వాణ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను కదా..? నా ప్లాన్‌ కానీ తెలిసిపోయిందా..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శివరాం కోపంగా ఏమయ్యా నిన్ను చూస్తేనే అందరూ భయపడుతున్నారు ముందు బయటకు వెళ్లు రాథోడ్‌ తీసుకెళ్లు.. అని చెప్తుండగానే అమర్‌ వస్తాడు.

సార్‌ మీతో కొంచెం మాట్లాడాలి సార్‌ అంటాడు కాళీ. దీంతో అమర్‌ కోపంగా మా ఇంటికి మాకు చాలా కావాల్సిన మనిషి ప్రాణాలు తీసిన నీకు ఈ ఇంట్లోకి అనుమతి లేదు. ఎవ్వరితో మాట్లాడటానికి అర్హత లేదు. రాథోడ్‌ పంపించేయ్‌.. అని చెప్పగానే మనోహరి కోపంగా కరెక్టుగా చెప్పావు అమర్‌.. ఏయ్‌ నీకు ఇక్కడేం పని బయటకుపో.. ఇంకా  చూస్తున్నావేంటి రాథోడ్‌ బయటకు గెంటివేయ్‌.. అంటుంది. దీంతో కాళీ… సార్‌ సరస్వతి మేడం యాక్సిడెంట్‌ గురించిన నిజం మీకు చెప్పడానికి వచ్చాను సార్‌ అంటాడు. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది.

దయచేసి నా మాట ఒక్కసారి వినండి సార్‌.. నిజం చెప్పి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను సార్‌ అంటుంటే.. మనోహరి కోపంగా ఇక్కడ నీ మాటలు నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు లేరు ముందు బయటకు వెళ్లు అంటుంది. అమర్‌ వెంటనే నువ్వాగు మనోహరి.. నువ్వు చెప్పు కాళీ ఎవరు చెప్తే ఈ పని చేశావు అని అడుగుతాడు. దీంతో బండి బ్రేక్‌ ఫెయిల్‌ అయింది అని చెప్తాడు. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. రిలాక్స్‌ అవుతుంది. నా తప్పుకు ప్రాయశ్చితంగా జైలు నుంచి వచ్చినప్పటి నుంచి భోజనం కూడా చేయలేదు సార్‌ కొంచెం అన్నం పెట్టించండి అని భోజనం చేస్తాడు కాళీ. భోజనం చేస్తూ.. ఆ మనోహరిని ఈ ఇంటి నుంచి.. నీ జీవితంలోంచి వెళ్లగొట్టే ప్లాన్‌ చేస్తున్నాను. అని చెప్తాడు. భాగీ షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×