E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పెళ్లి కోసం మంగళసూత్రం కొన్న మనోహరి 

Nindu Noorella Saavasam Serial Today February 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పెళ్లి కోసం మంగళసూత్రం కొన్న మనోహరి 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

రాథోడ్‌తో కలిసి కారులో మార్కెట్‌కు వెళ్లున్న మనోహరి.. జ్యువెల్లరీ షాపు కోసం వెతుకుతుంది. షాపు ఎక్కడా కనిపింకపోయేసరికి జ్యువెల్లరీ షాపేంటి ఎక్కడా కనిపించడం లేదు.. షాపు దొరికితే తాళి కొనేసుకోవచ్చు అని మనసులో అనుకుంటూ అటూ ఇటూ చూస్తూ ఉంటుంది. ఇంతలో రోడ్డు పక్కన ఒక షాపు కనిపించగానే.. రాథోడ్‌ ఇక్కడ కారు ఆపు అని చెప్తుంది. రాథోడ్‌ కారు ఆపేసి హోమానికి కావాల్సిన సరుకులు అన్ని కొన్నాం కదండి ఇంకా ఏం కొనాలి అని అడుగుతున్నా..? ఏమీ మాట్లాడకుండా మనోహరి నగల షాపులోకి వెళ్తుంది. అది చూసిన రాథోడ్‌ నగల షాపులోకి వెళ్తుందేంటి..? ఏం కొంటుంది. అనుకుంటూ షాపులోకి చూస్తుంటాడు.

లోపలికి వెళ్లిన మనోహరిని అక్కడి సేల్స్‌ బాయ్‌ చెప్పండి మేండం ఏం కావాలి అని అడుగుతాడు. నాకు తాళిబొట్టు కావాలి. డిజైన్స్‌ చూపించండి అని చెప్తుంది. సేల్స్ బాయ్‌ డిజైన్స్‌ చూపిస్తుంటే.. ఒక మంగళసూత్రం తీసుకుని చూస్తూ.. ఎస్‌ ఇలాంటి మంగళసూత్రమే అరుంధతి వేసుకునేది. నా మెడలో పడాల్సింది తన మెడలో పడేలా చేసుకుంది. ఇప్పుడు ఇలాంటి తాళే అమర్‌తో నేను కట్టించుకోవాలి అని మనసులో అనుకుంటుంది. బయట కారులో కూర్చున్న రాథోడ్‌ మాత్రం హోమానికి నగలు కొంటుందేంటి..? ఇంట్లో పెళ్లికి వీధిలో కుక్కల హడావిడి అన్నట్టు హోమం చేసేది సారు అయితే ఈవిడకు నగలు ఎందుకో.. అనుకుంటాడు.  లోపల మనోహరి సరే ఇది ప్యాక్‌ చేయండి.. ఈ చైన్‌ కూడా ఇవ్వండి అని చెప్పగానే.. సేల్స్‌ మాన్‌ ఓకే మేడం.. అంటూ ప్యాక్‌ చేస్తుంటాడు. బయట రాథోడ్‌ ఇరిటేటింగ్‌ గా ఏంటో ఇంకెంత సేపు కొంటుందో ఏంటో..? అనుకుంటాడు.

Advertisement

లోపల మనోహరి ఎంతైంది అండి అని అడుగుతుంది.. సేల్స్‌ మెన్‌ బిల్‌ చెప్పగానే.. కట్టేసి మంగళసూత్రం తీసుకుని బయటకు వెళ్తుంది. కారులో బ్యాగ్‌ పెడుతుంటే.. రాథోడ్‌ మేడం నగల షాపులో అంతగా ఏం కొన్నారేంటి..? అని అడగ్గానే.. మనోహరి కోపంగా అది నీకు అనవసరం ఫోన్‌ మాట్లాడి వస్తాను అంటూ పక్కకు పోతుంది. రాథోడ్‌ సరే లేండి.. అంటూ నాకు తెలియకుండా అంత సీక్రెట్‌ ఏం మాట్లాడుతుందో ఏంటో..? అనుకుంటుండగా షాపు లోపలి  నుంచి సేల్స్‌ బాయ్‌ వచ్చి సార్‌  ఆ మేడం బిల్లు మర్చిపోయారు.. అని బిల్లు ఇవ్వగానే.. తీసుకుని నేను ఇస్తానులే అంటాడు. బిల్లు తీసుకుని ఓపెన్‌ చేస్తూ.. ఎంత బిల్లు చేసిందో ఏంటో.. అని చూసి షాకింగ్‌ గా ఇదేంటి మంగళసూత్రం కొందేంటి..? అని మనోహరి కారులో పెట్టిన బ్యాగ్‌ను ఓపెన్‌ చేసి అందులోని మంగళసూత్రం చూస్తాడు. మృత్యుంజయహోమానికి మంగళసూత్రం కొందేంటి..? హోమానికి ఈ మంగళసూత్రానికి ఏంటి సంబంధం అనుకుంటూ మళ్లీ యధావిధిగా తీసిపెడతాడు.

ఇంతలో మనోహరి కాల్‌ మాట్లాడి కారు దగ్గరకు రాగానే.. రాథోడ్‌ మేడం మీరు బిల్లు తీసుకోవడం మర్చిపోయారట.. షాపు అతను తీసుకొచ్చి ఇచ్చారు. అంటూ బిల్లు మనోహరికి ఇస్తాడు. బిల్లు తీసుకున్న మనోహరి బిల్లేంటో చూశావా..? అని అడుగుతుంది. రాథోడ్‌ చూడమంటారా..? అనగానే.. మనోహరి కోపంగా నీకు సంబంధం లేని విషయాల్లో తల దూర్చకు అంటుంది. సరేలేండి ఇక వెళ్లమంటారా..? అనగానే.. సరే వెళ్లు అంటుంది మనోహరి. కారు నడుపుతూనే.. రాథోడ్‌ మనసులో ఈ తాళఙతో ఈవిడ ఏం చేయబోతుంది. ఏదో జరగబోతుంది అనుకుంటాడు.

Advertisement

మరోవైపు ఇంటి దగ్గర పిల్లలు క్రికెట్‌ ఆడుతూ.. చంభాను ఫీల్డింగ్ చేయమంటారు. చంభా ఫీల్డింగ్‌ చేస్తుంటూ.. కావాలనే చంభా వైపే బాల్‌ కొడుతుంటారు. దీంతో చంభా బాల్‌ పట్టుకోలేక అలిసిపోయి ఇక నేను ఆడలేని బాబు మీరే ఆడుకోండి అని చెప్తుంది. దీనికి ఆనంద్‌ ఒప్పుకోడు నువ్వు ఆడాల్సిందే అంటూ బలవంతం చేస్తుంటాడు. చంభాకు కోపం వస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×