E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తన ఉంగరంతో బిడ్డను బతికించొచ్చన్న గుప్త 

Nindu Noorella Saavasam Serial Today December 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తన ఉంగరంతో బిడ్డను బతికించొచ్చన్న గుప్త 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

ఆరు ఊరంతా ఇంటింటికి తిరిగి తాంబూలం ఇస్తూ మిస్సమ్మ సీమంతానికి ఆహ్వానిస్తుంది. ఆరు వెనకాలే గుప్త వెళ్తుంటాడు. ఆరు అందరినీ ఆహ్వానించి రాగానే గుప్త ఎదురుగా వెళ్లి ఆరును చూసి నవ్వుతాడు. ఏమిటి బాలిక గ్రామస్థులందరినీ నీ సహోదరి సీమంతానికి ఆహ్వానించితివా..? అని గుప్త అడగ్గానే.. మీ దయ వల్ల అందరినీ ఆహ్వానించాను గుప్త గారు థాంక్యూ సో మచ్‌.. నేను చనిపోయినా కూడా నా ఆత్మ పైకి వెళ్లకపోవడం.. నాక ఇలాంటి అదృష్టం దక్కడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని ఆరు అనగానే.. ఏ జన్మలోనో కాదు ఈ జన్మలోనే నువ్వు  ఎన్నో పుణ్యకార్యములు చేసితివి అందులకే నీకీ వరము దక్కినది అని గుప్త చెప్తాడు.

దీంతో ఆరు నేను ఏం మంచి చేశానో నాకు గుర్తు లేదు గుప్త గారు. కానీ నాకు దక్కిన ఈ వరము మరెవ్వరికీ దక్కలేదేమో అంటుంది ఆరు. దీంతో గుప్త సత్యము పలికితివి బాలిక ఈ రోజు నువ్వు చేసినది నభూతో న భవిష్యత్‌.. మునుపెన్నడు జరగనిది.. ఇకపై జరగనిది.. అంటాడు గుప్త. దీంతో ఆరు ఎమోషనల్‌ అవుతూ ఇంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన మీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను తీసుకోండి.. అంటూ ఉంగరం ఇస్తుంది ఆరు. దీంతో గుప్త అదేమిటి బాలిక గ్రామస్థులందరినీ ఆహ్వానించుటలోనే నువ్వు సంతృప్తి చెందితివా..? రేపటి నీ సహోదరి సీమంతం నీ చేతుల మీదుగా జరిపించవా..? నీ సహోదరికి నీ హస్తములతో గంధము పూయవా..? నీ సహోదరి చేతులకు గాజులు తొడగవా.? నీ చేతితో బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించవా..? తొలి ముత్తైదువుగా నీవు తాంబూలం స్వీకరించవా అని గుప్త అడగ్గానే.. నాకు అంత అదృష్టము ఉందా గుప్త గారు అని ఆరు చెప్పగానే..

Advertisement

ఆ అదృష్టము నీకు కలిగించుటకే కదా మా అంగుళీకము నీకు ఇచ్చినది. మా అంగుళీకముతో నువ్వు ఏమైనా చేయవచ్చును.. అని గుప్త చెప్పగానే.. ఆరు నవ్వుతూ చాలా థాంక్స్‌ గుప్త గారు.. కానీ ఊరి వాళ్లు అంటే నన్ను ఎవ్వరూ చూడలేదు. కానీ మా వాళ్లు నన్ను చూస్తారు కదా..? గుర్తు పడతారు కదా..? మా నాన్న మా ఆయన చెల్లి పిల్లలు అందరూ నన్ను చూస్తారు కదా..? వాళ్ల ముందు నేను ఎలా సీమంతం జరిపించగలను.. అని అనుమానం వ్యక్తం చేస్తుంది ఆరు. దీంతో గుప్త నవ్వుతూ మరి నీ తెలివి తేటలు ఎటుల పోయినట్టు అది నీ ఉపాయంతో యోచన చేయవలెను నీకు అపాయం రాకుండా నువ్వే చూసుకోవలెను అని గుప్త చెప్పగానే.. మీరే ఏదైనా మార్గం చెప్పండి అని ఆరు అడగ్గానే.. అన్నియు నేనే చెప్పినచో నీ తెలివి బుద్ది కుశలత ఏమి చేయును అంటాడు గుప్త. దీంతో ఆరు ఆలా అంటారేంటి గుప్త గారు..  సరే నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మీరు ఇచ్చిన వరాన్ని సద్వినియోగ పరుచుకుంటాను.. కానీ మా చెల్లికి పుట్టబోయే బిడ్డ పుట్టగానే చనిపోతుంది అని రాజు గారు అన్నారు..? అంటూ ఆరు అడగబోతుంటే..

అది విధి అందులకే నీకు మరు జన్మ లేదని మా ప్రభువుల వారు చెప్పితిరి అనగానే.. పుట్టగానే చావడం ఏంటి గుప్త గారు అది ఒక జన్మేనా..? ఆ బిడ్డ మీద మా ఆయన, చెల్లి , మా నాన్న , పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల ఆశలు నిరాశ కావాల్సిందేనా..? వాళ్లు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాల్సిందేనా..? అంటూ ఆరు ఏడుస్తుంటే.. గుప్త కంగారు పడుతూ..  బాలిక ఒకవేళ నీ వేలికున్న ఆ అంగుళీకముతో ఆ బిడ్డను బతికించే ప్రయత్నం చేయుదువా..? అలా చేసినచో మాకు ప్రమాదం సుమా..? నీ మస్తిష్కమున అటువంటి యోచన ఉన్నచో తక్షణమే మా అంగుళీకము మాకు ఇవ్వుము అని గుప్త అడగ్గానే.. ఆరు అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు ప్రమాదంలో పడేస్తాను.. నా వల్ల మీకు ఏ హాని కలగదు..  నా గురించి మీకు తెలుసు కదా..? అని ఆరు చెప్పగానే.. ఆ శాంతము తమ గురించి మాకు తెలియును కాబట్టే ముందు జాగ్రత్తగా చెప్పు చుంటిమి అనగానే.. మీ చెల్లిపై ఏ మాత్రం నమ్మకం లేదా గుప్తగారు అంటుంది ఆరు.

Advertisement

నమ్మకం ఎందుకు లేదు.. చాలా నమ్మకం ఉన్నది అదే స్థాయిలో అపనమ్మకం కూడా ఉన్నది అంటాడు గుప్త.  అలాంటిదేం లేదు మీరు ప్రశాంతంగా ఉండండి.. మీరు ఇచ్చిన ఈ ఉంగరానికి హడ్రెండ్‌ పర్సెంట్‌ న్యాయం చేస్తాను అని చెప్పి ఆరు వెళ్లిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×