E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు మనోహరి కొత్త ప్లాన్

Nindu Noorella Saavasam Serial Today December 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు మనోహరి కొత్త ప్లాన్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

గుప్త ఇచ్చిన వరంతో ఆరు తాంబూలం తీసుకుని ఊరిలో వారిని మిస్సమ్మ సీమంతానికి ఆహ్వానించడానికి వెళ్లుంది. ఒక ఇంటి ముందుకు వెళ్లి పిన్ని గారు అని పిలుస్తుంది. దీంతో ఇంట్లోంచి వచ్చిన ఒకావిడ ఎవరమ్మా నీవు అని అడుగుతుంది. నా పేరు అరుంధతి రేపు నా చెల్లి భాగమతి సీమంతం మీరు తప్పకుండా రావాలి అంటూ బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది ఆరు. భాగుమతి అంటే రామ్మూర్తి గారి చిన్న అమ్మాయి కదూ ఇంతకీ నువ్వు ఎవరమ్మా ఎప్పుడూ చూడలేదు అని అడగ్గానే.. నేను రామ్మూర్తి గారి కూతురు లాంటిదాన్నే అని చెప్తుంది ఆరు. ఓ అవునా రామ్మూర్తి గారికి పెద్ద కూతురు ఉండేది పాప చనిపోయిందట.. బతికుంటే నీలాగే ఉండేది.

తన పేరు కూడా అరుంధతే అని చెప్పగానే.. సీమంతానికి తప్పకుండా రావాలి మా చెల్లిని మంచిగా ఆశీర్వదించాలి వస్తాను అని వెళ్లిపోతుంది. మరో ఇంటి దగ్గరకు వెళ్లి నా పేరు అరుంధతి రామ్మూర్తి గారు ఉన్నారు కదా ఆయన కూతురుకు రేపు సీమంతం ఉంది మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్లిపోతుంది. అలాగే ఊరంతా తిరుగుతూ అందరినీ ఆహ్వానిస్తుంది ఆరు. ఇంతలో మనోహరి, చంభా కూడా తాబూలాలు తీసుకుని ఊరి ప్రజలను సీమంతానికి ఆహ్వానించడానికి ఊరిలోకి వెళ్తారు. ఇంతలో చంభా అనుమానంగా ఆగు మనోహరి మనం భాగీని చంపడానికి వచ్చినట్టు లేదు. దగ్గరుండి తన సీమంతం జరిపించడానికి వచ్చినట్టు ఉంది అనగానే.. కంగారు పడకు చంభా నీకు ముందే చెప్పాను కదా ఇది భాగీ సీమంతం పిలుపు కాదు ఇది దాని చావుకు ఊరిని పిలిచినట్టు అని మనోహరి చెప్పగానే.. భాగీ చస్తుందో..  మనం దొరికిపోతామో అని ఆ టెన్షన్‌తో చచ్చిపోతున్నాను అంటుంది చంభా.

Advertisement

కంగారు పడకు చచ్చిపోయేది భాగీనే.. నువ్వేం టెన్షన్ పడుకు పద అంటూ ఇంటి దగ్గరకు వెళ్తారు. ఇంట్లో వాళ్లను పిలవమని చంభాకు చెప్తుంది. చంభా అమ్మా అని పిలవగానే.. చెయ్యి కాలి లేదు వెళ్లు అని లోపలి నుంచి చెప్తారు. దీంతో మనోహరి ఇలాగా పిలిచేది అంటూ ఏవండి ఇంట్లో ఎవరున్నారు..? కాస్త బయటకు వస్తారా..? అని అడగ్గానే.. అంతకు ముందే ఆరుతో మట్లాడిన ఆవిడ బయటకు వస్తుంది. ఎవరు మీరు చందాల కోసం వచ్చారా..? అని అడుగుతుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌గా మేము చందాల కోసం రాలేదు. రేపు రామ్మూర్తి కూతురు  సీమంతం రేపు మీరు రావాలి. చంభా అదేదో బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వు అని చెప్పగానే.  ఈ పిలుపు చూస్తుంటే. సీమంతానికి రమ్మన్నట్టు లేదు.. రావొద్దు అన్నట్టు ఉంది. ఇలా పిలిస్తే ఎవరైనా వస్తారా..? ఇంకెలా పిలవాలి అని మను అడగ్గానే.. అయినా ఇందాక ఒకరు వచ్చి పిలిచారు కదా..? అని ఆవిడ  చెప్పగానే.. మను షాక్‌ అవుతుంది. ఎవరొచ్చారు ఎప్పుడొచ్చారు..? అని మనోహరి అడగ్గానే.. మీరు ఇంతకీ ఆ ఇంటి నుంచే వస్తున్నారా..? పేరంటానికి పిలవడానికి ఎవరొచ్చారో తెలియకుండా మళ్లీ వచ్చారా అంటూ ప్రతి ఇంట్లో అదే చెప్తారు.  ఎంత మంది ఎన్ని సార్లు వస్తారమ్మా  అని అందరూ మనోహరిని తిడతారు.

దీంతో చంభా, మనోహరి షాక్‌ అవుతారు. చంభా ఎవరై ఉంటారు అని మనోహరి అగ్గానే.. అది మంగళ అయి ఉండొచ్చు కదా అంటుంది చంభా.. ఏయ్‌ అది మనతో రమ్మంటేనే రాలేదు.. విడిగా ఎలా వస్తుంది. అని మనోహరి అనగానే.. మరి ఎవరై ఉంటారు కొంపదీసి అరుంధతి కాదు కదా..? అని చంభా అనుమానంగా చెప్పగానే.. అది ఎందుకు వస్తుంది. లేదు వచ్చినా వచ్చి ఉంటుంది. దానికి భాగీ అంటే పీకల దాకా ప్రేమ చంభా పద వెళ్లి కనుక్కుందాం.. అంటూ ఒకావిడ దగ్గరకు వెళ్లి మా కంటే ముందు వచ్చి మిమ్మల్ని సీమంతానికి పలిచింది తనేనా చూడండి అని తన ఫోన్‌ ఉన్న ఆరు ఫోటో చూపిస్తుంది మనోహరి. ఆరు ఫోటో చూసి ఆవిడ అవును ఈమె పిలిచింది అని చెప్తుంది. దీంతో మనోహరి, చంభా భయంతో వణికిపోతారు. రామ్మూర్తి గారికి పెద్ద కూతురు లాంటిదాన్ని అని సీమంతం చేసుకునే అమ్మాయికి అక్క లాంటి దాన్ని అని చెప్పింది. అంటూ ఆవిడ చెప్పగానే మనోహరి, చంభా బయగా అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Advertisement

తర్వాతి రోజు సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఎవరి హడావిడిలో వాళ్లు ఉంటారు. ఇంతలో మిస్సమ్మ రెడీ అయి అమర్‌ తో కలిసి వస్తుంది. మిస్సమ్మను చూసిన రామ్మూర్తి హ్యాపీగా ఫీలవుతుంటాడు. అందరూ సంతోషంగా ఉంటారు. మనోహరి మాత్రం మిస్సమ్మ కూర్చున్న కుర్చీ కింద బాంబు పెట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది. బాంబు ఏ క్షణంలోనైనా పేలొచ్చని చూస్తూ ఉంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×