E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 3rdd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:    మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మకు దూరమైన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today December 3rdd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:    మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మకు దూరమైన పిల్లలు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  మనోహరి ఫ్రెండ్స్‌ తో వెళ్లడం వేరు మనతో వెళ్లడం వేరు అంటుంది. దీంతో అంజు డాడీ ఓకే అంటే ఇంకెవరితో మనకు అవసరం లేదు అంటుంది. అవును అంజు నేను అమర్ తో మాట్లాడి ఒప్పిస్తాను అంటుంది మనోహరి. పిల్లలు అందరూ వెళ్లిపోతారు. తర్వాత నిర్మల కోపంగా ఈ మనోహరి కావాలనే పిల్లలను మిస్సమ్మ మీదకు రెచ్చగొడుతుంది అంటుంది. అవునని ఈ అమ్మాయిని చూసి పాపం అనుకునే లోపే ఇలా చేస్తుందంటాడు శివరాం.

తీవ్రవాదులను  పట్టకున్న ఆర్మీ వాళ్లు అమర్ కు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వగానే వెళ్తాడు. ఎక్కడ పట్టుకున్నారని అమర్‌ అడుగుతాడు. అరవింద్‌ ఎక్కడ అంటే.. అన్న దేశం దాటి ఎప్పుడో వెళ్లిపోయాడని తీవ్రవాది చెప్తాడు. నువ్వు వాడే టెక్నాలజీనే మేము వాడి నీ ఇంటి మీద దాడి చేశాం అంటాడు. ఎందుకు చేశారు ఇదంతా..? అని అమర్‌ అడిగితే మా అన్న పగ మేము తీర్చుకోవాలనుకున్నాం. అందుకే ఇలా చేశాం అంటాడు. ఇంతలో అమర్‌, మిస్సమ్మకు వీడియో కాల్ చేసి తీవ్రవాదులను చూపించి.. రాత్రి అటాక్‌ చేసింది వీళ్లేనా అని అడిగితే వాళ్లేనని మిస్సమ్మ చెప్తుంది.

Advertisement

తర్వాత మిస్సమ్మ ఆలోచిస్తుంది. ఆరు వస్తుంది. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. నిన్న అటాక్‌ చేసిన వాళ్ల గురించి అక్కా రాత్రి అటాక్‌ చేశారు. పొద్దునే దొరికిపోయారు అని చెప్తుంది. దీంతో ఇంకెందుకు ఆలోచన వాళ్లు దొరికేశారు అంటే ప్రమాదం లేనట్టే కదా..? అంటుంది ఆరు. లేదక్క ఇందాక వాళ్లను చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో దొరికిపోయామనే భయం కానీ శిక్ష పడుతుందన్న భయం కానీ లేదక్కా.. చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. అయ్యో మిస్సమ్మ నిన్న జరిగిన దానికి నువ్వు బాగా భయపడ్డట్టు ఉన్నావు. పిల్లలకు ఏమైనా అవుతుందేమోనన్న భయంతో ఇలా అవుతున్నావు. లేదంటే ఆర్మీ వాళ్ల అదుపులో ఉన్న ఆ రౌడీలు ఎక్స్‌కర్షన్‌ లో ఉన్న పిల్లలను ఏం చేస్తారు చెప్పు అని ఆరు వెళ్లిపోతుంది.

తర్వాత పిల్లలు అలిగి ఉండటంత వాళ్ల దగ్గరకు వెళ్లి మిస్సమ్మ పొద్దటి నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు కూడా ఏమీ తినకపోతే నీరసం వస్తుంది అని పిలుస్తుంది. దీంతో శివరాం అమ్ము నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా..? అంటాడు. మేము ఎక్స్‌కర్షన్‌కు వెళ్లాలి తాతయ్య పంపిస్తామనేవరకు ఏమీ తినము. మిస్సమ్మ నువ్వు డాడీతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పు ఇప్పుడే వచ్చి తింటాము అంటుంది అమ్ము. ఇక్కడ సమస్య నేను ఒప్పుకోవడమో మీ నాన్న ఒప్పుకోవడమో కాదు. మీ సేఫ్టీ.. ప్లీజ్‌ సిచ్యుయేషన్‌ అర్థం చేసుకోండి అని బతిమాలుతుంది మిస్సమ్మ. ఇప్పటిదాకా మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాము.

Advertisement

ఇప్పుడు మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అంటుంది అంజు. ఇంతలో శివరాం వీళ్లకు మనం చెప్తే వినరు వాళ్ల డాడీ వస్తారు అప్పుడు వింటారు అంటాడు శివరాం.  చెప్తే వింటారు మామయ్య.. చెప్పి ఒప్పిస్తాను అంటుంది మిస్సమ్మ. ఇంతలో అమర్‌ వచ్చిన కారు సౌండ్‌ విని అమర్‌ వచ్చాడు ఇక మనం వెళ్దాం పద అని మిస్సమ్మ, నిర్మల, శివరాం కిందకు వెళ్తారు. పిల్లలు మనోహరిని ఆంటీ తాతయ్య, నాన్నమ్మల దగ్గర మేనేజ్‌ చేశాము డాడీతో కష్టం అనుకుంటా అంటారు. ఏం లేదు మీరు ఇలాగే డ్రామా కంటిన్యూ చేయండి అని చెప్తుంది. అమర్‌ పైకి రాగానే అమర్‌ను చూడనట్టు  పిల్లల్ని తినమని బతిమాలినట్టు మనోహరి నాటకం ఆడుతుంది.

అమర్‌ పిల్లల్ని ఎందుకు ఉదయం నుంచి తినలేదని అడుగుతాడు. ఆ రౌడీలు దొరికారు కదా..? ఇక మేము ఎక్స్ కర్షన్‌కు వెళ్తాం డాడీ అని అడుగుతారు. ప్రమాదం ఇంకా పూర్తిగా పోలేదని అంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు అమర్‌. ఇది జాగ్రత్తలా లేదు డాడ్‌ భయపడుతున్నట్టు ఉంది అంటుంది అంజు. రాథోడ్‌ పిల్లలు రేపు ఎక్స్‌ కర్షన్‌కు వెళ్తున్నారు. కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయ్‌ అని అమర్‌ చెప్పి వెళ్లిపోతాడు. పిల్లలు, మనోహరి హ్యాపీగా ఫీలవుతారు. మిస్సమ్మ ఆలోచిస్తుంది.

అమర్‌ రూంలో వర్క్‌ చేసుకుంటుంటే.. మిస్సమ్మ వచ్చి నాకెందుకో ఇది కరెక్టు కాదనిపిస్తుంది. వాళ్లు నిన్న అటాక్‌ చేయడం. పొద్దునే దొరికిపోవడం మీరు పిల్లలను ఎక్స్‌ కర్షన్‌కు పంపిస్తాననడం నాకెందుకో భయంగా ఉందండి. పొద్దున వాళ్లను చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో బాధ కానీ పశ్చాతాపం కానీ ఏవీ లేవండి. పైగా వాళ్లు నలుగురే ఉన్నారని అనుకోలేం కదా..? బయట ఇంకా ఉండొచ్చు కదా..? అంటుంది మిస్సమ్మ.  అయినా ఎక్స్‌ కర్షన్‌కు ఆ రౌడీలకు సంబంధం ఏం ఉంటుంది. అయినా పిల్లల ఆనందం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు మిస్సమ్మ. అయినా పిల్లలకు టైట్‌ సెక్యూరిటీ ఉంటుంది కదా..? అంటాడు అమర్‌. పంజరంలోంచి ఎంత అందమైన ప్రపంచాన్ని చూపించినా అది బంధించడమే అవుతుంది అని మిస్సమ్మ చెప్పి వెళ్లిపోతుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×