E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మిస్సమ్మకు పిల్లలను దూరం చేయాలనుకున్న మనోహరి – తనకు ఎదురు రమ్మని మిస్సమ్మను అడిగిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today December 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మిస్సమ్మకు పిల్లలను దూరం చేయాలనుకున్న మనోహరి – తనకు ఎదురు రమ్మని మిస్సమ్మను అడిగిన అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఆరు అక్క అప్పగించిన పిల్లల బాధ్యతను ఆయన నాకు ఇచ్చారు. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకున్నాను.. అందుకోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ నేర్చుకున్నాను అని మిస్సమ్మ చెప్పగానే నీ లాంటి కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టం. నీ ప్లేస్‌లో ఎవరున్నా ఇంత ధైర్యం చేయలేరు అంటుంది. ఊరుకోండి అక్కా నా పిల్లలను నేను కాపాడుకున్నాను అంటుంది. సరే మిస్సమ్మ నేను వెళ్తాను అని వెళ్లిపోతుంది.

అమర్‌ ఆఫీసుకు వెళ్తూ.. ఏదో చెప్పాలనుకుని వెళ్లబోతుంటే.. మిస్సమ్మ ఏదైనా చెప్పాలా అండి అని అడుగుతుంది. థాంక్స్‌ మిస్సమ్మ.. నువ్వు చేసిన పనికి థాంక్స్‌ చెప్పి సరిపెట్టలేను. ఇంకేం చేయాలో తెలియదు అంటాడు అమర్‌. ఏంటండీ ఈ మాటలు నా పిల్లలను నేను కాపాడుకోవడం నా బాధ్యత. నేను నిలబెట్టుకోవాల్సిన నమ్మకం. ఆరు అక్క నా మీద పెట్టుకున్న నమ్మకం. నేను ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టినప్పుడే అక్క నాకు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత అప్పగించింది అండి. పిల్లల గురించి అత్తయ్య, మామయ్యల గురించి మీరేం టెన్షన్‌ పెట్టుకోకండి. నేనున్నాను. వాళ్లకేం కానివ్వను  అంటుంది మిస్సమ్మ.  దీంతో అమర్‌ వెళ్లబోతూ మిస్సమ్మ నాకు ఎదురు వస్తావా..? అని అడుగుతాడు. చాటు నుంచి వింటున్న ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. వెనకే వచ్చి అంతా గమనిస్తున్న మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.  మిస్సమ్మ ఎదురు రాగానే అమర్‌ వెళ్లిపోతాడు.

Advertisement

అరవింద్‌ తన అనుచరులను కొడుతుంటాడు. ఒక ఆడపిల్ల చేతిలో దెబ్బలు తిని పారిపోయి వస్తారా..? మీరు అంటూ తిడతాడు. దీంతో వినోద్‌ అన్న అమరేంద్ర తన పెళ్లాన్ని షేర్‌ లా తయారు చేశాడు. ఆ ముసలోడేమో గన్‌ పట్టుకుని వచ్చాడు. ఇక అమరేంద్రను గెలవాలంటే అతనొక్కడే కాదు అతని పెళ్లాం కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్తాడు. దీంతో అరవింద్‌ పిల్లల్ని కిడ్నాప్‌ చేయాలంటే కొత్తగా ప్లాన్‌ చేయాలి అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి స్కూల్‌ లో ఎంక్వైరీ చేసి వచ్చాను. రేపు పిల్లలను ఎక్స్‌కర్షన్‌ కు తీసుకెళ్తున్నారట అని చెప్తాడు. అయితే నాటకం ఆడి పిల్లలను కిడ్నాప్‌ చేయాలని అనుకుంటారు. అందుకోసం వినోద్‌ వాళ్లను పోలీసులకు లొంగి పొమ్మని చెప్తాడు.

పిల్లలు ఆలోచిస్తుంటారు. డాడీ ఇంకా ఆ రౌడీలను పట్టుకోలేదేమో అక్కా అంటాడు ఆనంద్. మేడంకు కాల్ చేసి మీరు కూడా రావడం లేదని చెప్పు అమ్ము అంటుంది అంజు. మరోవైపు ప్రిన్సిపాల్‌ అమ్మును సైడ్‌ చేసి ఎక్స్‌కర్షన్‌కు బంటిని అటెండ్‌ చేస్తే మనకు హెడ్‌ ఫోన్స్‌ వస్తాయి అది ఎలా అని ఆలోచిస్తుంది. ఇంతలో అమ్ము ఫోన్‌ చేసి రేపు మేము ఎక్స్‌ కర్షన్‌కు రాలేకపోతున్నామని చెప్తుంది. దీంతో ప్రిన్సిపాల్‌ హ్యాపీగా ఫీలవుతుంది. అదే విషయం బంటికి చెప్తే వాడు హ్యాపీగా ఫీలవుతాడు.

Advertisement

పిల్లల మాట్లాడుకుంటుంటే.. అక్కడకు మనోహరి వస్తుంది. అంజు డాన్స్‌ చేస్తుంది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా..? ఏంటమ్మా ఏంటి నన్ను వదిలేసి ఎక్స్‌ కర్షన్‌కు వెళ్తారా..? ఇప్పుడు వెళ్లండి.. బట్టలు సర్దుకోండి ప్లానింగ్‌ వేసుకోండి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అంజు. దీంతో అమ్ము కోపంగా మేము వెళ్లంది దేవుడి వల్ల కాదు. ఆ రౌడీల వల్ల. వాళ్లు నిన్ను కిడ్నాప్‌ అటెంప్ట్‌ చేయకపోయినా.. నిన్న అటాక్‌ చేయకపోయినా మేం కచ్చితంగా వెళ్లి ఉండేవాళ్లం అంటుంది అమ్ము.

చూడండి అమ్ము ఏం జరిగిన నా మంచి కొసమే జరగుతుంది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఇంట్లోనే ఉండండి అని అంజు చెప్తుంది. డోర్‌ దగ్గర వింటున్న మనోహరి.. వీళ్లను ఎక్స్‌కర్షన్‌కు పంపించేలా చేయాలని దీంతో పిల్లలకు దగ్గరై ఆ మిస్సమ్మ మీద యుద్దం మొదలు పెట్టొచ్చు అనుకుని పిల్లల దగ్గరకు వెళ్లి మీ డాడీతో మాట్లాడి మిమ్మల్ని ఎక్స్‌ కర్షన్‌కు తీసుకెళ్లేలా చేస్తానంటుంది. దీంతో పిల్లలు అయితే  ఈ విషయం వెంటనే మిస్సమ్మకు చెప్తాము అని వెళ్లిపోతారు. మనోహరి షాక్‌ అవుతుంది.

నిర్మల, శివరాంలకు కాఫీ ఇస్తున్న మిస్సమ్మ దగ్గరకు పిల్లలు వెళ్లి నిన్న మన ఇంట్లో అటాక్‌ చేసిన వాళ్లు దొరికారంట కదా..? ఇక మేము ఎక్స్‌ కర్షన్‌ కు వెళ్లొచ్చా అని అడుగుతారు.  మిస్సమ్మ ఆలోచిస్తుంటే.. మనోహరి  అటాక్‌ చేసిన వాళ్లు దొరికేశాకా..? ఇంకా పిల్లల ఆనందానికి అడ్డుపడుతున్నావు మిస్సమ్మ అంటూ పిల్లల దగ్గర మార్కులు కొట్టేయాలని ఈ నాటకాలు ఆడుతున్నావా..? అంటుంది. దీంతో శివరాం కోపంగా మనోహరిని తిడుతాడు.

మిస్సమ్మ పిల్లలకు తల్లి. తల్లి బిడ్డల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న అవసరం లేదు అని బుద్ది చెప్తాడు. పరిస్థితులు సర్దుమణిగాక అందరం కలిసి బయటకు వెళ్దామని మిస్సమ్మ చెప్తుంది. దీంతో మనోహరి ఫ్రెండ్స్‌ తో వెళ్లడం వేరు మనతో వెళ్లడం వేరు అంటుంది. దీంతో అంజు డాడీ ఓకే అంటే ఇంకెవరితో మనకు అవసరం లేదు అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×