E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆస్తికలు ఇంటికి తీసుకొచ్చిన అమర్‌ – తన ఫోటో మిస్సమ్మ చూస్తుందని భయపడ్డ ఆరు

Nindu Noorella Saavasam Serial Today December 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   ఆస్తికలు ఇంటికి తీసుకొచ్చిన అమర్‌ – తన ఫోటో మిస్సమ్మ చూస్తుందని భయపడ్డ ఆరు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఆరు ఆస్తికల కోసం వచ్చిన మనోహరిని స్మశానంలో చూసిన అమర్‌ షాక్‌ అవుతాడు. అమర్‌ను చూసిన మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతలో సెక్యూరిటీ వచ్చి అమర్‌కు తాను ఆరు ఆస్థికలు తీసుకెళ్లడానికి వచ్చిందని చెప్పడంతో అమర్‌ కోపంగా చూస్తుంటాడు. మీరు చెప్పినట్టే ఎవ్వరికీ ఇవ్వనని చెప్పాను. కానీ మళ్లీ దొంగలాగా లోపలికి వెళ్లింది అని సెక్యూరిటీ చెప్తాడు. ఏంటి మనోహరి అతను చెప్తుంది నిజమేనా..? నువ్వు దొంగలాగా లోపలికి వెళ్లావా..? అని అడగ్గానే అవును అమర్‌ నేను ఆరు అస్థికలను దొంగతనం చేయాలనుకున్నాను.

అని మనోహరి చెప్పగానే ఎందుకు చేశావు ఈ పని అని కోపంగా అడుగుతాడు అమర్‌. ఆ ఘోర నుంచి ఆరును కాపాడుకోవడానికి అమర్‌. పొద్దున స్వామిజీ మాటలు విన్నాక ఆ విషయం ఘోరకు తెలిస్తే.. ఆరు అస్థికలు తీసుకోవడానికి వస్తాడని వాడి కన్నా ముందు నేనే తీసుకోవాలని వచ్చాను అని చెప్తుంది. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అమర్‌ అడగ్గానే నీకున్న టెన్షన్స్‌ నీకున్నాయి. అందుకే నీకు చెప్పలేదు అంటుంది. దీంతో అమర్‌ వెళ్లి ఆస్థికలు తీసుకుంటాడు.

Advertisement

గుప్త ఆకాశంలోకి చూస్తూ బాధపడుతూ ప్రభూ గతంలో నేను ఏవో చిన్న చిన్న తప్పిదాలు చేసినందుకు నన్ను ఈ నరకానికి పంపారా..? అని బాధపడుతుంటాడు. నాకెందుకు ఈ శిక్ష వేశారు. నేను వద్దంటున్నా నన్ను ఆ బాలిక వెంట పంపిచారు అంటూ ఎమోషనల్ అవుతుంటే వెనక నుంచి ఆరు వచ్చి గుప్తగారు అంటూ అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా..? ఎందుకు రాజు గారికి చాడీలు  చెప్తున్నారు అని అడుగుతుంది. నేను  చెప్తున్నది జరిగిన దాని గురించి కాదు.

జరగబోయే దాని గురించి అంటాడు గుప్త అవునా ఏం జరగబోతున్నది అని ఆరు అడుగుతుంది. నీ పతి దేవుడు నీ ఆస్తికలు తీసుకుని వస్తున్నాడు. అవి తీసుకొచ్చి నీ ఫోటో ముందు పెడతారు అని గుప్త చెప్పగానే అయితే మిస్సమ్మ నా ఫోటో చూస్తుంది. మిస్సమ్మకు నిజం తెలుస్తుంది అని ఆరు బాధపడుతుంది. అదే జరిగితే మిస్సమ్మ అందరికీ నిజం చెప్పేస్తుంది. వాల్లు కాని మిస్సమ్మ మాటలు నమ్మలేదనుకో ఆ మనోహరి మిస్సమ్మకు పిచ్చి పట్టిందని నమ్మించి మిస్సమ్మను ఆయనకు దూరం చేస్తుంది అని బాధపడుతుంది. ఇంతలో అమర్‌ ఆస్తికలు తీసుకుని వస్తాడు. దీంతో ఇక అంతా అయిపోయింది. మనం ఇన్నాళ్లు కష్టపడి దాచిపెట్టిన రహస్యం బయటపడుతుంది అంటాడు. వెంటనే ఆరు కిటికీ దగ్గరకు వెళ్తుంది.

Advertisement

లోపల మిస్సమ్మ అందరినీ భోజనానికి పిలుస్తుంది. ఇంతలో అమర్‌ ఆస్తికలతో ఇంట్లోకి వస్తాడు. ఆస్తికలు నదిలో కలుపుతున్నాం కదా..? అప్పటిదాకా ఇంట్లో పెడితే మంచిదని తీసుకొచ్చాను అని చెప్తాడు అమర్‌. చాలా మంచి పని చేశావు నాన్నా తీసుకెళ్లి నీ గదిలో పెట్టు అని నిర్మల చెప్తుంది. ఇంతలో అంజు వెళ్లి డాడ్‌ ఒక్కసారి ముట్టుకోవచ్చా..? అని ఆస్తికలు తీసుకుని హాయ్‌ అమ్మా నన్ను చూస్తుంటావు అని స్వామిజీ చెప్పాడు. ఇప్పుడు కూడా చూస్తుంటావా..? అంటూ ఎమోషనల్‌ అవుతుంది.

పిల్లలు అందరూ కలిసి ఆస్థికలు పట్టుకుని బాధపడుతుంటారు. కిటికీలోంచి చూస్తున్న ఆరు ఏడుస్తుంది. నువ్వు పోగోట్టుకున్న మీ అక్కను నేను మళ్లీ తీసుకురాలేను మిస్సమ్మ. కానీ ఆఖరి సారిగా మీ అక్క అస్థికలను నువ్వు ముట్టుకునేలా చేయడం అని మనసులో అనుకుని ఆస్థికలు మిస్సమ్మకు ఇస్తాడు అమర్‌. అస్తికలు తీసుకున్న మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతుంది. నా మనసు ఎందుకండి ఇంతలా ఆరాటపడుతుంది అని అమర్‌ను అడుగుతుంది. ఎందుకంటే ఆవిడ నీ తొడబుట్టినది కనుక అని రాథోడ్‌, గుప్త మనసులో అనుకుంటారు. ఆరుకు నీకు మధ్య ఏజన్మలోనో రక్తసంబంధం ఉన్నట్టు ఉంది.

అందుకే అమర్‌కు తను దూరం అవుతూ.. నిన్ను దగ్గర చేస్తుంది అని నిర్మల చెప్పగానే.. మిస్సమ్మ ఆస్తికలు అమర్‌ రూంలో పెట్టు అని శివరాం చెప్పగానే స్వామిజీ ఆస్తికలు ఆరు ఫోటో ముందు పెట్టి దీపం పెట్టమన్నారు అని చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. అమర్‌ ఫోటో తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. రాథోడ్‌ మిస్సమ్మను నీతో ఒక విషయం మాట్లాడాలి అని పైకి తీసుకెళ్తాడు. అమర్‌ స్టోర్ రూంలోకి వెళ్లి ఆరు ఫోటో తీసుకుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×