E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: స్కూల్ కు వెళ్లనన్న అంజు – కోపంతో ఊగిపోయిన అమ్ము

Nindu Noorella Saavasam Serial Today December 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: స్కూల్ కు వెళ్లనన్న అంజు – కోపంతో ఊగిపోయిన అమ్ము
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

గుప్త ఇచ్చిన ఉంగరం ఉపయోగించుకుని మిస్సమ్మ బిడ్డలోకి ఆరు ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో గుప్త షాక్‌ అవుతాడు. ఏం జరుగుతుందో అని భయపడుతాడు. ఇంతలో యముడు వచ్చి గుప్తను తిడతాడు. ఎంత పని చేశావు విచిత్ర గుప్త. నీ అలసత్వంతో జరగరానిది జరిగిపోయింది. నువ్వే దగ్గరుండు ఆ బాలికను ఆ బిడ్డలోకి పంపినట్టు ఉన్నది. అంటూ తిట్టగానే.. గుప్త భయంతో వణికిపోతుంటాడు. యముడిని క్షమించమని అడుగుతాడు. అయితే యముడు మాత్రం గుప్తను తిట్టి వెంటనే యమలోకానికి రమ్మని చెప్తాడు. సరే అంటాడు గుప్త. యముడు వెళ్లిపోయాక గుప్త మాత్రం హ్యాపీగా ఫీలవుతాడు.

బాలిక నీ జన్మ ధన్యం గత జన్మలో ఎచ్చట జన్మించితివో మరలా అచ్చటనో ప్రాణం పోసుకున్నావు.. ఆ జన్మలో నిన్ను అర్ధ ఆయుష్షు రాలిగా చేసి మా ప్రభువుల వారు మేము నీకు తీరని అన్యాయం చేసితిమి. మేము చేసిన తప్పిదమునకు ప్రాయశ్చితం ఎటుల చేసుకోవలెనో తెలియక సతమతం అయ్యాము. అందులకే ఆత్మగా నువ్వు భూలోకమును వచ్చుటకు అనుమతించితిమి.. నువ్వు చేయవలసిన కొన్ని పనుల కోసం నీకు కొన్ని శక్తులు ధారపోసితిమి. మేము ఎన్ని చేసినను నీవు కోల్పోయిన జీవితము నీకు ఇవ్వలేకపోతుమి.. నీ గురించి మా ప్రభువుల వారు చింతించని క్షణము లేదు. ఆ జగన్నాథుడి లీలతో ఇప్పుడు మా మనసు సంతషముగా ఉన్నది. నీకు మేము ఎవ్వరము చేయలేని న్యాయము.. నీకు నువ్వుగా చేసుకుంటువి. నీకు దూరం అయిన నీ కుటుంబమును మరలా నువ్వు చేరుకున్నావు.. ఇన్నాళ్లు నువ్వు ఏ కుటుంబం కోసం పరితపించితివో కష్టాలు పడితివో ఇప్పటి నుంచి ఆ కుటుంబమే నిన్ను కంటికి రెప్పలా కాపాడును ఇక నువ్వు సుఖః సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుము.. అమ్మా జగన్మాత శక్తి స్వరూపిని.. నీ సమక్షమున ప్రాణం పోసుకున్న ఈ బాలికకు నువ్వే రక్ష తల్లి. ఇన్నాళ్లు నీకు తోడుగా ఉన్నాము.. ఇక మేము మా లోకమునకు వెళ్లి మా కర్తవ్యమును నిర్వర్తించెదము.. సంతోషంగా జీవించుము.. శుభం భుయాత్‌  అంటూ గుప్త యమలోకానికి వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు ఇంటికి వచ్చిన మిస్సమ్మను పిల్లలు వదలిపెట్టరు.. అంజలి అయితే అసలు స్కూల్‌కు కూడా డుమ్మా కొట్టాలని డిసైడ్‌ అవుతుంది. దీంతో అమ్ము స్కూల్‌కు ఎందుకు రావడం లేదని అడిగితే ఇక నుంచి కొద్ది రోజులు నేను చెల్లితోనే ఆడుకుంటాను.. అప్పటి వరకు స్కూల్‌కు రాను అంటుంది. దీంతో అమ్ము కోపంగా చెల్లి అంటే నీకే కాదు మాకు కూడా ప్రేమ ఉంది కానీ స్కూల్‌కు రాకుండా ఇంటి దగ్గరే ఉంటానంటే డాడ్‌ కోప్పడతారు అని చెప్పగానే.. ఏం లేదు.. కొద్ది రోజులు నేను చెల్లితోనే ఉంటాను.. డాడ్‌ కొప్పడినా సరే నేను చెల్లితో ఆడుకోవాలి అంటుంది అంజు. చెల్లి అంటే నీకే కాదు మాకు ప్రేమ ఉంది అంజు కానీ స్కూల్‌ ముఖ్యం కదా కావాలంటే ఈవెనింగ్‌ వచ్చాక రాత్రి నిద్రపోయే వరకు చెల్లితోనే ఆడుకోవచ్చు అని చెప్తాడు ఆనంద్‌. దీంతో అంజు కోపంగా ఓరేయ్‌ అన్నయ్య.. మీరు వెళ్లండి అంతే కానీ నన్ను బలవంతం చేయకండి.. నేను రానంటే రాను స్కూల్‌కు అంతే అంటూ కరాకండిగా చెప్పేస్తుంది అంజు. స్కూల్‌కు రెడీ కాకుండా మిస్సమ్మ రూంలోకి వెళ్తుంది. పిల్లలు ముగ్గురు కూడా వెనకాలే వెళ్తారు. అంజు స్కూల్‌ రావడం లేదని చెల్లి దగ్గరే ఉంటానని చెప్తుంది అంటాడు ఆకాష్‌. దీంతో మిస్సమ్మ కూడా అంజను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. కానీ అంజు అసలు వినదు. ఇంతలో అక్కడికి అమర్‌ వస్తాడు. అమర్‌ను చూసి పిల్లలు నవ్వుతుంటే.. అంజు భయపడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×