E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు పుట్టిన పాపలోకి ప్రవేశించిన ఆరు ఆత్మ

Nindu Noorella Saavasam Serial Today December 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు పుట్టిన పాపలోకి ప్రవేశించిన ఆరు ఆత్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

గుప్త ఎంత చెప్పినా ఆరు వినకుండా మిస్సమ్మకు డెలివరీ అయ్యే వరకు భూమి మీదే ఉంటానని మెండి పట్టు పడుతుంది. తన ఈ ఒక్క కోరిక నెరవేర్చమని గుప్తను వేడుకుంటుంది. అయితే మరే కోరిక కోరనని మాట ఇవ్వమని గుప్త అడగ్గానే.. గుప్త చేతిలో చేయి వేసి ఇంక వేరే ఏదీ కోరుకోనని మాటిస్తుంది. దీంతో గుప్త సరే బాలిక ఆ శిశువు మరణం అనివార్యం అని మేము చెప్పినను నీవు ఇచ్చటనే ఉండి వీక్షించిదలిచితివి ఆ విపత్తు చూసి నువ్వు రోదించుటకు సిద్ద పడినప్పుడు మేము మాత్రం ఏమీ చేయగలం.. మా యమధర్మరాజు వారు మాకు ఎటువంటి శిక్షనైనను విధింపనివ్వుము.. నీతో పాటు మేమును ఇచ్చటనే వేచి ఉందుము.. నీ శోకము తీరిన పిదపనే మా లోకమునకు వెళ్లెదము అని చెప్పగానే.. ఆరు థాంక్స్‌ గుప్త గారు అంటూ చెప్తుంది.

మరోవైపు వర్షంలో అడవిలో వెళ్తున్న అమర్ వాళ్ల కార్లు బురదలో చిక్కకుపోతాయి. దీంతో అమర్‌ కారు ఆపేస్తాడు. నేను దిగి చూస్తాను మీరెవరూ కారు దిగకండి అని చెప్పి అమర్‌ కారు దిగి చూస్తాడు. మిస్సమ్మ ఏమైందండి కారు కదలడం లేదు అని అడగ్గానే. టైరు బురదలోనే ఇరుక్కుపోయింది. మీరు కారులోనే కూర్చోండి నేను ట్రై చేస్తాను అంటాడు. ఇంతలో వెనక కారులోంచి రాథోడ్‌ వస్తాడు. ఏమైంది సార్‌ అంటూ అడుగుతాడు. చూడు అని అమర్‌ చెప్పగానే.. రాథోడ్‌ చూసి సార్‌ బాగా ఇరుక్కుపోయినట్టు ఉంది సార్‌ ఇప్పుడెలా.. మీరు స్టార్ట్‌ చేయండి సార్‌ నేను నెడతాను ఎక్కండి సార్‌ అని చెప్పగానే.. అమర్‌ కారు స్టార్ట్ చేస్తాడు. ఇంతలో రామ్మూర్తి వచ్చి ఏమైంది రాథోడ్‌ అంటూ చూసి కారును తోస్తుంటాడు. ఇంతలో అమర్‌ బయటకు రాగానే.. బాబు ఊరు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నేను వెళ్లి ట్రాక్టర్‌ తీసుకొస్తాను అంటూ రామ్మూర్తి వెళ్లిపోతుంటే..

Advertisement

వెంటనే మిస్సమ్మకు డెలివరీ ఫెయిన్స్‌ మొదలవుతాయి. అందరూ కంగారు పడుతుంటారు. ఇంతలో రామ్మూర్తి అమర్‌ను పిలిచి బాబు ఆ పక్కన ఏదో గుడి ఉన్నట్టు ఉంది. అక్కడికి తీసుకెళ్దాం అని చెప్పగానే.. అమర్‌, మిస్సమ్మను ఎత్తుకుని గుడి దగ్గరకు వెళ్తుంటే అందరూ వెనకాల ఫాలో అవుతుంటారు. అందరూ గుడి దగ్గరకు వెళ్తారు. మిస్సమ్మకు నొప్పి భరించలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది. ఇంతలో గుడిలోనే మిస్సమ్మకు డెలివరీ అవుతుంది.  మిస్సమ్మకు పుట్టిన పాప కదలదు, ఏడ్వదు.. చంభా చూసి బిడ్డ కదలడం లేదు.. అంటే ప్రాణాలతో లేదు.. చనిపోయింది. అని చెప్పగానే.. అందరూ బాధపడుతుంటారు.

అమర్ బిడ్డ పక్కన కూర్చుని ఏడుస్తుంటాడు. రామ్మూర్తి గుడిలో గంటను గట్టిగా కొడుతుంటాడు. మనోహరి, చంభా మాత్రం హ్యాపీగా ఫీలవుతుంటారు. అక్కడే ఉండి అంతా చూస్తున్న ఆరు మాత్రం ఎమెషనల్‌ అవుతుంది. గుప్త ఇచ్చిన ఉంగరం పట్టుకుని మంత్రం చదువుతుంది. వెంటనే ఆరు పాపలోకి వెళ్లిపోతుంది. గుప్త షాక్‌ అవుతాడు. పాప ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి అందరూ హ్యపీగా ఫీలవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×