E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తన శక్తులను త్యాగం చేసి అమర్‌ను బతికించుకున్న ఆరు – మనోహరికి షాక్‌ ఇచ్చిన నిర్మల, శివరాం  

Nindu Noorella Saavasam Serial Today December 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తన శక్తులను త్యాగం చేసి అమర్‌ను బతికించుకున్న ఆరు – మనోహరికి షాక్‌ ఇచ్చిన నిర్మల, శివరాం  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఆయన లేకపోతే పిల్లలు బతకలేరు. మిస్సమ్మ బతకదు. ఆయన బతకాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది ఆరు. ఇప్పుడు నేను ఏమీ చేయలేనని గుప్త అంటాడు. దీంతో ఆరు మోకాళ్ల మీద కూర్చుని గుప్తను ప్రాధేయపడుతూ నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. దీంతో గుప్త ఒక్క అవకాశం ఉందని చెప్పగానే ఏంటని ఆరు అడుగుతుంది. నువ్వు నీ స్పర్శ శక్తిని త్యజించి జగన్నాథున్ని ప్రార్థిస్తే బాగవుతుందని చెప్తాడు. వెంటనే ఆరు అక్కడే ఉన్న గణపతి విగ్రహం దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తుంది.

దీంతో దేవుడు ఆరు స్పర్వ శక్తిని తీసుకుంటాడు. ఇంతలో ఆపరేషన్‌ అయిపోతుంది డాక్టర్‌ బయటకు రాగానే మిస్సమ్మ, అమర్‌కు ఎలా ఉందని అడుగుతుంది. ఇప్పుడే బాడీలోంచి బుల్లెట్‌ తీశాం. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆరు దేవుడికి దండం పెట్టుకుని సంతోషంగా అక్కడే కూలబడిపోతుంది. సంతోషంతో ఏడుస్తూ.. గుప్తను చూసి నమస్కారం చేస్తుంది.

Advertisement

లోపలికి వెళ్లగానే ముసలి సంఘం మొత్తం నా మీదకు దాడికి వస్తారు. అదే జరిగితే అమర్‌ దృష్టిలో నేను బాడ్‌ అయిపోతాను. వాళ్ళు స్టార్ట ‌చేసినట్టు అమర్‌ ముందు నేనే బాధపడినట్టు నటిస్తే.. అని మనసులో అనుకుంటుంది. ఇంతో డాక్టర్‌ బయటకు రాగానే డాక్టర్ గారు మేము వెళ్లి మా అబ్బాయిని చూడొచ్చా అని శివరాం అడుగుతాడు. చూడొచ్చు పది నిమిషాల్లో రూంకు సిఫ్ట్‌ చేస్తున్నాము ఇంకో విషయం ఆయనుక రెస్ట్‌ కావాలి. మీరు చూసి వచ్చేయండి. పేషెంట్‌ ను డిస్టర్బ్‌ చేయోద్దు అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

డాక్టర్‌ మాటలు విన్న ఆరు సంతోషంగా అమర్‌ను చూడటానికి వెళ్తుంటే గుప్త ఆపేస్తాడు. ఎందుకు గుప్త గారు నన్ను పదే పదే ఆపుతున్నారు అని ఆరు అడుగుతుంది. ఎందుకంటే నేను నిన్ను ఆపకపోతే నువ్వు తప్పు మీద తప్పు చేసేదవు. వాటిని కప్పు పుచ్చలేక నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది అని గుప్త చెప్తాడు. దీంతో ఆయన అంత పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారు. నాకు చూడాలని ఉండదా..? అని అడుగుతుంది. ఉండును కానీ ఆ బాలిక పక్కన ఉండగా నువ్వు వెళ్లరాదు అంటాడు గుప్త. సరే మిస్సమ్మకు కనిపించకుండా నేను చూడోచ్చా అని అడుగుతాడు. సరే అంటాడు గుప్త.

Advertisement

అందరూ రూంలోకి వెళ్లి అమర్‌ను చూస్తుంటారు. ఇంతలో మెలకువ వచ్చిన అమర్‌ ఏదో పలవరిస్తుంటే.. మనోహరి దగ్గరకు వెళ్లి అమర్‌ ఎలా ఉంది అని అడుగుతుంది. అమర్‌ మాత్రం మిస్సమ్మ అంటాడు. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి అమర్‌ చేయి పట్టుకుంటుంది. అమర్‌ కళ్లు తెరచి అందరినీ చూస్తాడు. బయట నుంచి తొంగి చూస్తున్న ఆరు గుప్తను కోపంగా ఇంకా నేనెప్పుడు మా ఆయన్ని ఎప్పుడూ చూడాలి అంటుంది. లోపల అమర్, పిల్లలకు ఏం కాలేదు కదా..? అని అడుగుతాడు. ఏం కాలేదని చెప్తారు.

ఇంతలో మనోహరి సారీ అమర్‌ ఇదంతా జరగడానికి ఒకరకంగా నేను కారణం అయ్యాను అంటుంది. దీంతో రామ్మూర్తి ఒక రకంగా కాదు మనోహరి గారు. ఈ మొత్తానికి కారణం మీరే. చూడమ్మా మనోహరి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు నా కూతురు వద్దంటున్నా వినకుండా పిల్లలను ఎక్స్‌ కర్షన్‌కు పంపించకుండా ఉండాల్సింది అని రామ్మూర్తి అనడంతో అమర్‌ పర్వాలేదండి ఇక ఏమీ కాలేదు కదా..? అంటాడు అమర్‌. ఇంతలో సిస్టర్‌ వచ్చి పేషెంట్ దగ్గర ఎవరో ఒక్కరే ఉండండి అని చెప్పగానే మిస్సమ్మ మాత్రమే ఉంటుంది. అందరూ వెళ్లిపోతారు.

పిల్లలు నలుగురు గార్డెన్‌లో కూర్చోవడం చూసిన మనోహరి ఎలాగైనా పిల్లల దగ్గర ఎలాగైనా మార్కులు కొట్టేయాలని రేపు ఆ మిస్సమ్మ రాగానే మళ్లీ దాని మీదకు అందరినీ రెచ్చగొట్టాలని మనసులో అనుకుని పిల్లల దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే.. పిల్లలందరూ కలిసి మనోహరిని తిట్టి వెళ్లిపోమ్మని పంపిస్తారు. లోపలికి వెళ్లిన మనోహరిని శివరాం, నిర్మల మందలిస్తారు. నువ్విక పిల్లల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని చెప్పి వెళ్లిపోతారు. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌ ఫీలవుతుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×