E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తికి షాక్ ఇచ్చిన ఊరి జనం 

Nindu Noorella Saavasam Serial Today December 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తికి షాక్ ఇచ్చిన ఊరి జనం 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ సీమంతం రోజు రామ్మూర్తి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది.  అందరూ అతిథులు వస్తుంటారు.. మనోహరి, చంభా మాత్రం మిస్సమ్మను చంపేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. రామ్మూర్తి గేటు దగ్గర నిలబడి ఇంటికి వస్తున్న చుట్టాలను బంధువులను పలకరిస్తుంటాడు. ఇంతలో కొంత మంది ఆడవాళ్లు రాగానే రామ్మూర్తి నవ్వుతూ…ఏం కాంతమ్మా ఈశ్వరమ్మా మీరు కూడా ఇంత లేటుగా వస్తే ఎలా చెప్పండి..? మొత్తానికి వచ్చారు చాలా సంతోషంగా ఉందమ్మా అని రామ్మూర్తి అనగానే..

ఈశ్వరమ్మ నవ్వుతూ.. నిన్న అమ్మాయి ఇంటికి వచ్చి అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటామండి..? అంటుంది. దూరం నుంచి చూస్తున్న మనోహరి, చంభా షాక్‌ అవుతారు. ఇంతలో కాంతమ్మ కూడా మేమే కాదు ఊరు ఊరంతా కదిలి వస్తుంది అని చెప్పగానే.. రామ్మూర్తి అనుమానంగా మనోహరి వైపు చూసి వీళ్లు చెప్తుంది మనోహరి గురించేనా..? అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కాంతమ్మ అంత బాగా పిలిచింది అమ్మాయి అంటుంది. ఈశ్వరమ్మ కూడా పిలుపంటే అలా ఉండాలి. అంత పద్దతి గల అమ్మాయిని మేము ఎప్పుడూ చూడలేదు.. అనగానే.. రామ్మూర్తి అనుమానంగా మీరు చెప్తుంది నిన్న ఇంటికి వచ్చి పిలిచిన అమ్మాయి గురించేనా అని అడుగుతాడు. దీంతో ఈశ్వరమ్మ ఆ అమ్మాయి గురించే అండి.. నువ్వు ఎవరమ్మా అని అడిగితే నీ పెద్ద కూతురు లాంటి దాన్ని అని చెప్పింది అనగానే..

Advertisement

రామ్మూర్తి అనుమానంగా మనోహరిని చూస్తూ.. మనోహరికి ఇంత మంచి బుద్ది ఎలా వచ్చిందబ్బా.. అని మనసులో అనుకుంటాడు. సరే సరే వెళ్లండమ్మా వెళ్లి లోపల కూర్చోండి.. సీమంతం మొదలవుతుంది అని చెప్పగానే వాళ్లు లోపలికి వెళ్లిపోతారు. రామ్మూర్తి మంగళను పిలుస్తాడు. మంగళ ఏంటండి అనుకుంటూ దగ్గరకు వస్తుంది. అక్కడేం చేస్తున్నావు..లోపలికి వెళ్లి వచ్చిన వాళ్లకు ఏం కావాలో చూడు.. అని చెప్పగానే.. అదే పనిలో ఉన్నాను..అంటుంది మంగళ.. అయితే వెళ్లు అని చెప్తాడు రామ్మూర్తి ఇక ఫంక్షన్‌కు వస్తున్న వాళ్లకు అక్కడే నిలబడి స్వాగతం పలుకుతుంటాడు… ఈశ్వరమ్మ మాటలు గుర్తు చేసుకుంటాడు. వెంటనే మనోహరి దగ్గరకు వెళ్తాడు రామ్మూర్తి.. ఏమ్మా మనోహరి నీ పిలుపు బాగుందని ఊరంతా తెగ మెచ్చుకుంటున్నారు.. అంత బాగా పిలిచావా ఏంటి..? అని అడగ్గానే..

వెటకారంగా నవ్వుతూ మరి ఏమనుకుంటున్నారు బాబాయ్‌ గారు నా మంచితనం మీ ఊరందరికీ అర్థం అయిపోయింది. ఒక్క మీకు తప్ప.. అనగానే.. బలే దానివే.. నీ సంగతి నాకు తెలియదా..? నటించడంలో నీ తర్వాతే ఎవరైనా నీ నటనకు మా అరుంధతే పడిపోయిందట.. మా ఊరి వాళ్లు ఇంకెంత..? మొత్తానికి మా అల్లుడి గారిని కూడా మాయ చేసేస్తున్నావు.. అనగానే.. నిన్న నన్ను పిలుపుతకు వెళ్లమని చెప్పింది మీరే..ఇప్పుడు మీరే నన్ను దెప్పిపొడుస్తున్నారా.?అంటుంది మనోహరి.. దీంతో నిజం ఒప్పుకోవాలి కదమ్మా.. ఏ మాటకు ఆ మాట నీ పిలుపుతో మా ఊరి వాళ్లందరినీ మెప్పించి ఇంత మందిని సీమంతానికి రప్పించావు అంటే నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే అయ్యుంటుంది అమ్మ.. సీమంతం అయ్యాక నీకొక మంచి చీర పెడతా.. అని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

రామ్మూర్తి వెళ్లిపోగానే.. చంభా కోపంగా ముసలోడు ఏంటి..? చాలా వెటకారాలు ఆడుతున్నాడు నీ గురించి బాగా అర్తం చేసుకున్నట్టు ఉన్నాడు అనగానే.. మనోహరి కోపంగా ఈ వెటకారాలు అన్ని కాసేపటి వరకే ఆ తర్వాత అందరూ పీసు పీసు అయి కాలి బూదిదై పోతారు అని చెప్పగానే.. చంభా బాధగా మళ్లీ చెప్తున్నాను మనోహరి ఒక్క భాగీ కోసం ఇంత మందిని చంపడం అవసరమా..? అంటుంది. దీంతో మనోహరి నాకు కావాల్సింది అమర్‌ మాత్రమే.. మిగతా వాళ్లు ఎలా చచ్చినా నాకు అనవసరం.. అంతా చచ్చి పైన అరుంధతి దగ్గరకు వెళ్లి ముచ్చట్లు పెట్టుకుంటారు.. అని చెప్పగానే.. అరుంధతి పైన లేదు కిందే  ఉంది. నిన్న ఊరందరినీ పిలిచింది తనైతే పొగడ్తలేమో నీకు వచ్చాయి..  అంటూ చంభా చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఆరు ఇక్కడికి వచ్చిందంటావా..? అంటూ చంభాను అడుగుతుంది. దీంతో చంభా ఒక్క నిమిషం ఆగు చెప్తాను అంటూ మంత్రం చదువుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×