E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చంభా కోసం ఆరు రూం అమర్‌ చేత ఓపెన్ చేయించాలని మనోహరి ప్లాన్‌ చేస్తుంది. అందుకోసం ఆరును ఒకసారి చూడాలని ఉంది అంటూ అమర్‌కు దగ్గరకు వెళ్లి చెప్తుంది. సరే అంటూ అమర్‌, మనోహరిని తీసుకుని రూమ్‌ ఓపెన్‌ చేస్తాడు. లోపలికి వెళ్లాక.. ఆరు గురించి ఎమోషనల్‌ అవుతాడు అమర్‌. తన ప్రేమ ఒక సముద్రం. తనతో ఉంటే అదొక ప్రపంచం. ఆ ప్రపంచం చాలా అందంగా ఉండేది. నువ్వు ఆరును చూడాలి అనగానే నీ ఫోన్లో మీరు దిగిన ఫోటోలు ఉంటాయి కదా..? చూడొచ్చు కదా అనొచ్చు. కానీ నేను ఆరు విషయంలో ఎంత కేరింగ్‌ గా ఉంటానో నీకు తెలియాలనే ఈ డోర్‌ ఓపెన్‌ చేశాను. ఇది ఆరు గది మాత్రమే కాదు ఈ ఇంటి దేవాలయం కూడా నేను ఎక్కడ ఉన్నా నా ఆలోచన నా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఆరు ముందు ఉన్న ఈ దీపాన్ని ఆరిపోనివ్వను.. ఈ పువ్వులను వాడిపోనివ్వను.. అంటూ చెప్తుంటాడు అమర్‌.

కింద నుంచి అంతా వింటుంటారు రాథోడ్‌. మిస్సమ్మ. దీంతో మిస్సమ్మ కూడా అమర్‌ మాటలకు ఎమోషనల్‌ అవుతుంది. రాథోడ్‌ మనోహరి ఇంటెన్సన్‌ ఏంటో మనకు తెలుసు. ఆరు అక్క గురించి ఆయన ఇంత చెప్పినా కూడా మనులో మార్పు రాకపోతే ఇంక మను అసలు మనిషే కాదు అంటుంది. రాథోడ్‌ కూడా అవును మిస్సమ్మ అంటాడు. పైన  రూంలో అమర్‌ మాట్లాడుతూ మనోహరి నేను ఆరుకు సంబంధించిన జ్ఞాపకాలను ఈ గదిలో బంధించాలనుకుంటాను. అసలు ఆ జ్ఞాపకాలు మమ్మల్ని వదిలి వెళ్తేనే కదా..? బంధించడం అనేది జరుగుతుంది. అవి జ్ఞాపకాలు కాదు మనోహరి. మధురమైన క్షణాలు ఎప్పటికీ చెరిగిపోవు అని చెప్తుంటాడు. మనోహరి మాత్రం అమర్‌ నువ్వు ఆరు గురించి ఆరుతో గడిపిన జీవితం గురించి చెప్తుంటే నాకు ఆరు మీద ఇంకా  ఇంకా కోపం పెరిగిపోతుంది. నాకు రావాల్సిన జీవితాన్ని నాకు దక్కాల్సిన జీవితాన్ని అది లాక్కుంది. అది చచ్చి బతికిపోయింది కానీ అది ఇక్కడ ఉంటే మళ్లీ మళ్లీ చంపేసేదాన్ని అని మనసులో అనుకుంటుంది.

Advertisement

సారీ అమర్‌ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ థాంక్యూ సోమచ్‌ నేను అడగ్గానే ఇలా ఆరును నాకు చూపించినందుకు అని చెప్తుంది. కింద ఉన్న మిస్సమ్మ అక్క ఫోటో ఇమ్మిడియెట్‌గా నేను అక్క ఫోటో చూడాలి అని మిస్సమ్మ పైకి వెళ్తుంది. ఆరు , గుప్త  కిటికీ దగ్గర నిలబడి అంతా చూస్తుంటారు. ఏమిటి బాలిక నీ పతి దేవుడు నిన్ను అంతలా ప్రేమగా ప్రశంసిస్తుంటే.. నీవు ఆనందింపగా ఏలా చింతించుచుంటివి.. అని గుప్త అడుగుతాడు. దీంతో ఆరు కంగారుగా  నా మీద ఆయనకున్న ప్రేమ కాదనలేను గుప్త గారు.. కానీ  నా ఫోటోను భాగీ ఎక్కడ చూసేస్తుందోనని టెన్షన్‌గా ఉంది అంటూ కంగారు పడుతుంది ఆరు. ఇంతలో అమర్‌, మను రూంలోకి బయటకు వస్తారు. అమర్‌ లాక్‌ వేస్తుంటే మిస్సమ్మ, రాథోడ్‌ అక్కడకు వస్తారు. లాక్‌ చేసిన తర్వాత మనోహరి ఇంకెప్పుడు ఈ రూం గురించి ఎక్కువ ఆలోచించకు ఈ రూం నాకు బాధ్యత అని చెప్పి వెళ్లిపోతాడు. ఆరు హమ్మయ్యా భాగీ నన్ను చూడలేదు. అని ఊపిరి పీల్చుకుంటుంది.

మరోవైపు ఆరు కోసం రణవీర్‌ ఇంట్లో పూజలు చేస్తున్న చంభా గట్టిగా నవ్వుతుంది. దీంతో రణవీర్‌ కంగారుగా ఏమైంది చంభా ఎందుకు అలా నవ్వుతున్నావు ఏదైనా అని అడుగుతాడు. ఏం లేదు రణవీర్‌.. అమావాస్య గడియలు మొదలయ్యాయి.. ఆ ఆత్మను డైరెక్టుగా బంధించవచ్చు నువ్వు ఆ మనోహరికి ఫోన్‌ చేసి నేను ఆ ఇంట్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేయమను అంటుంది చంభా. రణవీర్‌ సరే అని మనోహరికి కాల్‌ చేసి విషయం చెప్తాడు. తర్వాత రాత్రికి అందరూ పడుకున్నాక మనోహరి, చంభాను ఇంట్లోకి తీసుకెళ్తుంది. చంభా ఇంట్లోకి వెళ్లి ఆరు ఆత్మ కోసం వెతుకుతుంది. ఆరు ఒక రూంలోకి వెళ్లి దాక్కుంటుంది. ఆత్మను ఉన్న ప్లేస్‌ను కనిపెడుతుంది చంభా. చంభాను చూసిన ఆరు భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×