E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లి రూంలో కూర్చుని లెక్క పెడుతుంది చిత్ర. ఇంతలో అక్కడికి మనోహరి వచ్చి ఓసేయ్‌ నువ్వు మరీ ఇంత అల్పసంతోషివి ఏంటే.. ఈ మాత్రం దానికే అంతలా మురిసిపోవాలా..? అంటుంది. అంటే నేను ఇంత డబ్బును ఎప్పుడూ చూడలేదు మను అంటుంది చిత్ర. ఆ డబ్బును చూసి మురిసిపోవడం కాదు చిత్ర. నువ్వు ఇక్కడి వరకు రావాలన్నా..? ఆ డబ్బు నీకు చేరాలన్నా నా హెల్ప్‌ నీకు ఉంది. దాంతో పాటు నాతో నువ్వు చాలా పనులు చేయించుకున్నావు. కొంచెం నా గురించి కూడా పట్టించుకో.. ఏంటే సైలెంట్‌గా ఉన్నావు.. ఎంత సేపు డబ్బు గురించి నీ గురించే కాదు నా గురించి కూడా కొంచెం ఆలోచించు అంటుంది మనోహరి.

దీంతో చిత్ర కూల్‌గా ఏంటి మను నీ సంగతి నువ్వు బాగానే చూసుకుంటావు కదా..? కోల్‌కతా మీద చంభాను కూడా దించావు. నీ ప్రయత్నం నువ్వు చేసుకో నా మీద ఈ డబ్బ మీద మాత్రం కాంసట్రేషన్‌ చేయకు. అర్థం అయింది అనుకుంటా..? అంటూ చిత్ర వెళ్లిపోతుంటే.. చేయి పట్టుకుని ఆపేసి ఏంటో డబ్బును చూడగానే నీ బుద్ది చూపిస్తున్నావా..? నా పాటికి నన్ను వదిలేసి నీ లైఫ్‌ సెటిల్‌ చేసుకుందాం అనుకుంటున్నావా..? అంటుండగానే.. బయటి నుంచి వినోద్‌ చిత్రను పిలుస్తాడు. అదిగో మా ఆయన పిలుస్తున్నారు వెళ్లకపోతే బాగుండదు అంటూ చిత్ర వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత అందరూ భోజనం చేస్తుంటే వినోద్‌ టెక్సటైల్‌ బిజినెస్‌ పెట్టడానికి షోరూమ్‌ ఎక్కడ దొరికింది అని అమర్‌ అడగ్గానే.. మేయిన్‌ రోడ్డులోనే ఒక షోరూమ్ దొరికింది అన్నయ్య అని చెప్తాడు వినోద్‌. ఇంతలో చిత్ర కలగజేసుకుని బావగారు మంచి సెంటర్‌లోనే షోరూం దొరికింది. పెద్దగా పబ్లిషిటీ ఇవ్వకుండానే కస్టమర్స్‌ వచ్చేస్తారు అని చెప్తుంది. దీంతో అమర్‌ కొత్తగా బిజినెస్‌ పెడుతున్నారు కాస్త వెనకా ముందు చూసుకోండి.. ఎక్సీపీరియన్స్‌ ఉన్న స్టాప్‌ను తీసుకోండి అని చెప్తాడు. అయ్యో బావగారు ఈ బిజినెస్‌లో బొటిక్ విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది అని చిత్ర చెప్పగానే.. ఇది చాలా ఓవర్‌ చేస్తుంది చెప్తా అని మను మనసులో అనుకుంటుంది. నీకు మరీ అవసరం అయితే భాగీ నీకు తోడుగా ఉంటుంది. తన హెల్ప్‌ తీసుకో.. అంటాడు.

దీంతో చిత్ర అయ్యో బావగారు మళ్లీ తనకెందుకు బావగారు శ్రమ మేము చూసుకుంటాము కదా..? అంటుంది. దీంతో అమర్‌ పర్వాలేదు తను ఫ్రీగానే ఉంటుంది అని చెప్తాడు. అయ్యో బావగారు తనకు ఫ్రీ టైం ఎక్కడుంది చెప్పండి మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడంలోనే టైం సరిపోతుంది కదా అంటుంది. చిత్ర. మీకోసం తను ఫ్రీ టైం చూసుకుంటుంది చిత్ర అని అమర్‌ చెప్పగానే.. వద్దులేండి బావగారు అంటుంది చిత్ర. ఇంతలో మిస్సమ్మ ఏవండి వద్దులేండి.. చిత్రకు అనుభవం ఉంది అంటుంది కదా తను చూసుకుంటుంది అని చెప్పగానే.. మనోహరి కల్పించుకుని అమర్‌ అంతగా కావాలంటే చిత్రకు నేను హెల్ఫ్‌ గా ఉంటాను ఏమంటావు చిత్ర అని అడగ్గానే..

Advertisement

అయ్యో మను నువ్వు మాత్రం ఎందుకు చెప్పు.. వేరే పనుల్లో బిజీగా ఉంటావు కదా..? అంటుంది. దీంతో మను కోపంగా దీనికి బాగా పొగరెక్కింది డబ్బులు చేతిలో పడగానే నన్నే అవైడ్‌ చేస్తుంది అని మనసులో అనుకుంటుంది మను. సరే అయితే బిజినెస్‌ జాగ్రత్తగా చూసుకోండి అంటూ అమర్‌ చెప్తాడు. దీంతో చిత్ర లేదు బావగారు మీరిచ్చిన డబ్బుకు నేను హడ్రెండ్‌ పర్సెంట్‌ న్యాయం చేస్తాను. మీరు చూస్తూ ఉండండి ఒక్క షోరూంతో స్టార్ట్‌ చేసి సిటీ అంతా బ్రాంచెస్‌ ఓపెన్‌ చేస్తాను అని చెప్తుంది.

తర్వాత చంభా పంపిన కాలా పాము అమర్‌ ఇంట్లోకి వెళ్లడం చూసిన ఆరు, గుప్త షాక్‌ అవుతారు. పామును ఆరు రూంలోకి వెళ్లేలా చేస్తుంది మనోహరి. దీంతో ఆరు.. గుప్తతో మీరు ఇచ్చిన శక్తిని ఇప్పుడు నేను ఉపయోగించుకుంటాను. అది పాము రూపంలో నా రూంలోకి వెళ్లి పూలు తీయబోతుంది. నేను ముంగిస రూపంలో వెళ్లి ఆ పాము భరతం పడతాను అంటూ చెప్పి వెంటనే ముంగిసలా మారిపోయి రూంలోకి వెళ్తుంది ఆరు. చంభా  పంపిన కాలాతో ఫైట్‌ చేస్తుంది. అంతా కిటికీలోంచి తొంగి చూస్తుంటాడు గుప్త. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×