E-Paper
Advertisement

వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!
Advertisement

Bihar Crocodile: బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఒక వరి పొలంలో కనిపించిన ముసలిని ఓ యువకుడు తన భుజంపై వేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ ఘటన భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్‌పూర్ వార్డ్ 14లో శుక్రవారం చోటుచేసుకుంది. అక్కడ ముసలి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వెంటనే ఎలాంటి స్పందన రాకపోవడంతో, స్థానికులు ఆ ముసలి నోటిని తాడుతో కట్టేసి సురక్షితంగా బంధించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ ముసలిని పరీక్షించి, అది ఆరోగ్యంగానే ఉందని నిర్ధారించుకున్నాక కోసి నదిలో విడిచిపెట్టారు.

Advertisement

వర్షాకాలంలో నదిలో నీటి మట్టం పెరగడం వల్ల ముసళ్ళు తరచూ పొలాలు, జనావాసాల్లోకి వస్తుంటాయని అధికారులు తెలిపారు. ఇలాంటి సమయాల్లో అడవి జంతువులను సొంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×