E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 2nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ప్రమాదంలో ఆరు ఆత్మ

Nindu Noorella Saavasam Serial Today August 2nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ప్రమాదంలో ఆరు ఆత్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరు ఆత్మను బంధించడానికి ఘోరాను మించిన శక్తిని దించుతానని రణవీర్‌ చెప్పగానే.. మనోహరి ఆశ్చర్యపోతుంది. ఘోరాను మించిన శక్తా..? ఎవరు రణవీర్‌ అని అడుగుతుంది. దీంతో చంబా అని చెప్తాడు రణవీర్‌. చంబానా ఎవరు..? ఎక్కడ ఉంటుంది అని మనోహరి అడగ్గానే.. అదుపు తప్పిన ఆత్మలను అదుపులో పెట్టి ఆనంత శూన్యాలకు విసిరేసే అతీతమైన తాంత్రిక శక్తి గల వ్యక్తి. ఒక ఆడదాన్ని కొట్టాలంటే ఇంకో ఆడదానికే సాధ్యం అంటాడు రణవీర్‌. ఇంతకీ ఆ చంభా ఎక్కడ ఉంటుంది అని అడగ్గానే.. కోల్‌కతాలో అక్కడ అందరూ చంబాను కోల్‌కతా కాళీ అంటారు. ఇప్పటి వరకు చంభా ఎప్పుడు ఇలాంటి కేసులు ఫెయిల్ అవ్వలేదు. లాయరు వెంటనే చంభాని కాంటాక్ట్ చేయ్‌.. హైదరాబాద్ కు టికెట్‌ వేయ్‌.. ఈ సాయంత్రానికల్లా చంభా ఇక్కడ ఉండాలి అని చెప్పగానే.. లాయరు ఒకే రణవీర్‌ అంటూ వెళ్లిపోతాడు.

మరోవైపు గార్డెన్‌లో గుప్త కూర్చుని ఉండగా ఆరు అటూ ఇటూ తిరుగుతుంది. దీంతో గుప్త బాలిక నీకు సమస్య ఉన్నచో నేను అటూ ఇటూ తిరుగవలెను నువ్వు కూర్చోవలెను కానీ నువ్వేంటి అటూ ఇటూ తిరుగుతున్నావు. నీ సమస్య ఏంటో చెప్పుము మేము పరిష్కరించెదము అంటాడు. అది కాదు గుప్త గారు అసలు ఆ మనోహరి ఏంటి నోరు తెలిస్తే అబద్దాలు మనోహరి ఫైట్‌ ‌చేసిందట.. నా పిల్లలను కాపాడిందట.. అనాథ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా అంతే ప్రతి దానికి అబద్దాలు అడుతూనే ఉండేది. చివరికి దాని బతుకే అబద్దం బతుకు అయిపోయింది. అరే అంజు తన కూతురే తనను కాపాడుతుందన్న విషయం తనకు తెలియడం లేదు అనగానే.. గుప్త కోపంగా చూస్తూ అనినా.. నీ పిల్ల పిచ్చుకే తన సుపుత్రిక అని తనకు తెలియలేదని నువ్వు నిరాశ చెందుతుంటివా..? అని అడుగుతాడు.

Advertisement

ఏయ్‌ అలా అనుకోవడం లేదు గుప్త గారు. మనోహరి చెప్పిన దానికి కోపం వస్తుంది నాకు అంటుంది ఆరు. ఆ అయినచో ఇప్పుడు నీ స్నేహితురాలి పతిదేవుడిని నువ్వు చెయ్యి చేసుకున్న విషయం నీ స్నేహితురాలు నీ పతిదేవునకు చెప్పలేదని నువ్వు చింతించుచుంటివా..? ఒక విధంగా చెప్పవలెను అన్నా నీ స్నేహితురాలు ఆ నలుగురు దుండగులను మట్టి కరిపించింది. ఆ సమయమున తమరు ఇచ్చట ఉండి గానములు ఆలపించుచూ.. కుప్పి గంతులు వేయుచూ.. నీ పతి దేవుడు అప్పగించిన బాధ్యతను ఆ మనోహరి నిలబెట్టునని నమ్మకముగా ఉంటివి.. అటు పిమ్మట నీ పతి దేవుడిని పొందుటకు తన పతి దేవుడినే ఎదురించినది చివరకు అతగాడు ఆయుధం చూపించినచో కాస్త జంకినది కానీ లేచినో అతగాడిని కూడా మట్టి కరిపించినను ఆశ్చర్యము లేకుండును ఇచ్చట నువ్వు నీ గురించి నీ స్నేహితురాలు చెప్పలేదని ఊగిపోవుతుంటివి అనగానే..

ఏహెయ్‌ మనోహరి నా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు గుప్త గారు అంటుంది ఆరు. మరి ఎందులకు నీకు ఆవేదన మాకు ఈ వేదన అంటాడు గుప్త.   ఆవేదన లేదు.. నివేదన లేదు కానీ అసలు మను నిజం ఎందుకు చెప్పలేదు. అయినా మను అబద్దం చెప్తే నాకేంటి..? నా పిల్లు బాగుంటే చాలు అంటుంది ఆరు. ఇంతలో గుప్త ఎమోషనల్‌గా మా సోదరి సమానురాలివైన నువ్వు బాగున్నచో అదిచే మాకు చాలు అంటాడు. దీంతో నాకేమైంది బాగానే ఉన్నాను కదా గుప్త గారు.. పైగా ఏ కష్టం వచ్చినా కాపాడుకోవడానికి శక్తులు కూడా ఉన్నాయి కదా..? అంటుంది. దీంతో గుప్త భయంగా ఆ శక్తులను మించిన శక్తి వచ్చి నిన్ను శక్తి హీనురాలిని చేయునేమోనని మా మనసు కీడును శంకించుచున్నది అనగానే.. ఆరు దగ్గరకు వచ్చి అర్థం కాలేదు గుప్త గారు ఇప్పుడు నా శత్రువు ఆ మనోహరే కదా..? ఇంకెవరు ఉన్నారు అని అడుగుతంది. దీంతో గుప్త ఇప్పటి వరకు నీ శత్రువు నీ స్నేహితురాలే బాలిక. ఇప్పుడు తన పతిదేవుడు కూడా తోడయ్యాడు.

Advertisement

నిన్ను నీ కున్న శక్తలను కళ్లారా చూశాడు. ఇప్పుడు నీకున్న శక్తులను ఎటుల నిర్వీర్యం చేయవలెనో అని తాంత్రికులతో మాంత్రికులతో సంప్రదించాడు. నీకున్న గడువు కాలము సమీపించుచున్నది..నీ భవిష్యత్తు అగమ్యగోచరంగా అగుపించుచున్నది అని గుప్త చెప్పగానే.. ఆరు నవ్వుతుంది. ఆ రణవీర్‌ నన్నేం చేయడు. మీరు ఉండగా నాకేం కాదు అంటుంది. ఇంతలో అమర్‌ ఇంటి గేటు తెరుచుని చంభా ఇంట్లోకి వస్తుంది. గార్డెణ్‌లో ఉన్న ఆరును చూసి కోపంగా నువ్వేనా అది అని అడుగుతుంది. నువ్వెవరు అని ఆరు అడుగుతుంది. నా పేరు చంభా నేను నిన్ను అంతం చేయడానికే వచ్చాను అని చెప్తుంది. అది నీ వల్ల కాదు అంటుంది ఆరు. నా శక్తి ఏంటో నీకు తెలియదు.. నా శక్తి చూస్తావా..? అంటూ మంత్రం చదివి ఆరు మీదకు శక్తిని విసురుతుంది. అంతా టెర్రస్‌ లోంచి చూస్తున్న మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×