E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మాటలు విన్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today August 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మాటలు విన్న అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చంభా కోపంగా అటూ ఇటూ తిరుగుతూ కాసేపట్లో ‌హోమం మొదలవుతుంది రణవీర్‌. మనం చెప్పింది చిత్ర చేస్తుంది కదా అంటుంది. కచ్చితంగా చేస్తుంది చంభా మనోహరి దగ్గరుండి చిత్రతో చేయిస్తుంది అని చెప్తాడు. ఎలాగైనా హోమం ఆగాలి లేదంటే ఆత్మ మన చేయి దాటిపోతుంది అంటూ హెచ్చరిస్తుంది. ఇక మిస్సమ్మ పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది.  ఆ హారతి దూరం నుంచి చూస్తున్న ఆరు మిస్టర్ గుప్త ఫ్లీజ్‌ నన్ను అక్కడికి తీసుకెళ్లరా..? హారతి తీసుకుంటాను అని అడుగుతుంది. దీంతో బాలిక నువ్వే ఆ హారతి అంత ఉంటివి. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లి హారతి పక్కన నిలబెట్టితిని అనుకో అగ్నిపర్వతం పక్కన నిలబడినట్టు ఉంటుంది. దహించుకుపోయేదవు అంటాడు చిత్రగుప్త.

మరోవైపు మిస్సమ్మ దండ తీసి అమర్‌కు ఇస్తూ ఏవండి ఈ దండ అక్క ఫోటోకు వేయండి అని చెప్తుంది. దీంతో అమర్‌ నా రూంలో కీస్‌ ఉన్నాయి తీసుకురాపో అని చెప్తాడు. సరే అంటూ మిస్సమ్మ పైకి వెళ్తుంది. మిస్సమ్మ ఆరు ఫోటో చూస్తుందేమోనని మనోహరి కంగారుగా భాగీ ఆరు ఫోటో చూసేస్తుందేమో చిత్ర అంటుంది. ఆరు కూడా కంగారుగా మిస్టర్‌ గుప్త అని పిలుస్తుంది. మళ్లీ ఏమైంది బాలిక అంటూ అడుగుతాడు. దీంతో భాగీ నా రూంకు వెళ్లకుండా ఏమైనా చేయండి. తను ఆ గదిలోకి వెళితే నా ఫోటో చూసేస్తుంది అని చెప్పగానే.. మమ్ములను ఏమి చేయమందువు బాలిక అంటాడు గుప్త. భాగీని ఆపండి ఎలాగైనా ఫ్లీజ్‌ అని చెప్తుంది. మనోహరి కూడా ఇప్పుడు ఎలా ఆపాలి అని మనసులో అనుకుంటుంది. ఇక అమర్‌ రాథోడ్‌ను పిలిచి పంతులు గారికి ఫోన్‌ చేశావా అని అడగ్గానే.. చేశాను సార్‌ హోమం టైంకి వచ్చేస్తానన్నారు అని రాథోడ్‌ చెప్తాడు. దీంతో దండ తీసుకుని అమర్‌ కూడా పైకి వెళ్తాడు.

Advertisement

మిస్టర్‌ గుప్త ఎలాగైనా ఆపండి అని ఆరు చెప్పగానే.. ఆ కార్యక్రమం నేను చేయరాదు బాలిక.. నీ స్నేహితురాళ్లు ఉన్నారు కదా..? వాళ్లే చేసేదరు అని గుప్త చెప్తాడు. వాళ్లెందుకు చేస్తారు మిస్టర్‌ గుప్త. అని ఆరు అడుగుతుంది. మనోహరి మాత్రం ఆరు ఫోటో చూడకుండా భాగీని ఎలా ఆపాలి అని ఆలోచిస్తుంది. బయట ఆరు మాత్రం అయ్యో మిస్టర్‌ గుప్త వాళ్లు ఏం చేయట్లేదు. మీరే ఏదో ఒకటి చేసేయండి అంటుంది ఆరు. కాస్త వేచి ఉండుము బాలిక అంటాడు గుప్త. అమర్‌ పూల దండ తీసుకుని రూం దగ్గరకు వెళ్లి నిలబడతాడు. ఇంతలో మనోహరి చిత్ర వెంటనే వెళ్లి ఆ దేవుడి ముందు ఉన్న దీపాన్ని కొడెక్కించు అని చెప్తుంది. చిత్ర ఎందుకు అని అడుగుతుంది. చెప్పింది చేయ్‌ చిత్ర వెళ్లు అంటూ మనోహరి భాగీ అని పిలుస్తూ పైకి వెళ్తుంది. చిత్ర దేవుడి దగ్గరకు వెళ్లి దీపాన్ని ఆర్పేస్తుంది.

మరోవైపు మిస్సమ్మ రూం తాళం తీసుకెళ్లి ఏవండి ఇదిగోండి కీస్‌ అని ఇస్తుంది. అమర్‌ రూం లాక్‌ తీసి లోపలికి వెళ్తారు. మిస్సమ్మ  వెళ్లబోతుంటే మనోహరి వచ్చి ఆపేసి భాగీ నువ్వు ఇందాక దేవుడి ఫోటోల ముందు పెట్టిన దీపాలు కొండెక్కుతున్నాయి భాగీ అని చెప్తుంది. ఇప్పుడే కదా వెలిగించి వచ్చాను అప్పుడే కొండెక్కుతున్నాయా..? అంటుంది మిస్సమ్మ.. వెళ్లు త్వరగా వెల్లు దీపాలు ఆరిపోతే అరిష్టం అంటుంది మనోహరి. నువ్వెళ్లి చూడు మనోహరి నేను అక్క ఫోటోకు దండం పెట్టుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్లబోతుంటే.. చేయి పట్టుకుని ఆపి భాగీ దీపాలు ఎవరు వెలిగించారో వాళ్లే కొండెక్కకుండా చూడాలి భాగీ. ఆ మాత్రమ తెలియదా నీకు వెళ్లు త్వరగా వెళ్లు అని చెప్పగానే.. మిస్సమ్మ కిందకు దేవుడి దగ్గరకు వెళ్లి దీపాలు చూసి గాలి కూడా రావడం లేదే అప్పుడే దీపాలు కొండెక్కాయి అనుకుంటూ మళ్లీ వెళిగిస్తుంది. తర్వాత హోమం విజయవతంగా పూర్తి చేస్తారు. చిత్ర ఎంత ట్రై చేసినా ఆపలేకపోతుంది.

Advertisement

తర్వాత అమర్‌, మిస్సమ్మ, పిల్లలు అందరూ కారులో బయటకు వెళ్తుంటే.. గార్డెన్‌లోంచి చూస్తున్న ఆరు నేను కూడా వారితో పాటు కారులో వెళ్లాలని ఉంది గుప్త అని అడగ్గానే… నువ్వు ఇంత ఉన్నావు ఆ కారులో ఎలా ఎక్కుతావు అంటాడు గుప్త. ఆరు వెంటనే భ్రమరమా..? అని పిలవగానే.. తూనీగ రూపంలో ఉన్న గుప్త వస్తాడు. ఆరును తన మీద ఎక్కించుకుని కారు దగ్గరకు తీసుకెళ్తాడు. కారు దగ్గరకు వెళ్లగానే.. ఆరు ఏవండి నేను రెడీ వచ్చేశాను అంటుంది. దీంతో అమర్‌ ఎమోషనల్‌ గా గార్డెన్‌ వైపు చూస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×