E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 16th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌

Nindu Noorella Saavasam Serial Today August 16th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి రూంలోకి వెళ్లి ఫోన్‌ చేస్తుంది. చిత్ర వచ్చి ఎవరికి చేస్తున్నావు మను ఫోన్‌ అని అడగ్గానే స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు అని చెప్తుంది. ప్రిన్సిపాల్‌కు ఎందుకు అని చిత్ర అడగ్గానే.. ఆనంద్‌ స్కూల్‌ ల లీడర్‌గా పోటీ చేస్తున్నాడట. రేపే ఎలక్షన్స్‌ ఎలాగైనా ఆనంద్‌ను ఓడించాలని ప్రిన్సిపాల్‌తో చెప్పాలి అంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ఆరు.. కోపంగా చూశారా గుప్త గారు మనోహరి అనుకున్నంత పని చేస్తుంది అంటుంది. దీంతో మేము మీకు ముందుగానే చెప్పితిమి కదా..? మనోహరి బుద్ది వక్రబుద్ది అని అంటాడు గుప్త. ప్రిన్సిపాల్‌ ఫోన్‌ ఎంగేజ్‌ వస్తుంది. ఛ ఫోన్‌ బిజీ వస్తుందేంటి అని మనోహరి ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. దీంతో ఆ చిన్న పిల్లల గొడవలో నువ్వు తల దూర్చడం అవసరమా అని చిత్ర అడుగుతుంది. దీంతో షాపింగ్‌ మాల్‌ లో నీకు జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయావా..? అంటుంది మను.

అది చేసింది భాగీ కదా..? పిల్లలేం చేశారు. భాగీ మీద కోపం ఆ పిల్లల మీద చూపించడం ఎందుకు..? అని చెప్తుంది చిత్ర. అమ్ము వద్దు అంటున్నా.. ఆ భాగీకి ఆనంద్ కు సపోర్ట్‌ చేస్తుంది. రేపు ఎలక్షన్స్‌ లో ఆనంద్‌ ఓడిపోతే డిప్రెస్‌ అవుతాడు. అందుకు కారణం భాగీ అని చెప్పి అమర్‌ను రెచ్చగొట్టి భాగీని బాగా తిట్టించొచ్చు.. తర్వాత వాళ్లిద్దరిని విడగొట్టొచ్చు అని చెప్తుంది మను. బయట అంతా వింటున్న ఆరు చూశారా గుప్త గారు అది ఆనంద్‌ను ఓడించడం కాదు. పిల్లలను అడ్డం పెట్టుకుని ఆయనను భాగీని విడదీయాలని చూస్తుంది అంటూ బాధపడుతుంది. మనోహరి కపట నాటకములు నీకు కొత్త కాదు కదా బాలిక అంటాడు గుప్త. ఇంతలో ప్రిన్సిపాల్‌, మను ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. చెప్పండి మేడం ఈ టైంలో ఫోన్‌ చేశారేంటి అని అడుగుతుంద.

Advertisement

దీంతో చెప్పాల్సింది నువ్వు అసలు మీ స్కూల్‌లో ఏం జరుగుతుంది. అని అడుగుతుంది మను. ఎస్పీఎల్‌ ఎలక్షన్స్‌ కండక్ట్ చేస్తున్నాం. ఈ సారి అమ్ము పాప కాకుండా ఆనంద్‌ పోటీ చేస్తున్నాడు. వాళ్లకు పోటీగా మన బంటి గాడు నిలబడ్డాడు అని చెప్పగానే.. నేను అడిగేంత వరకు నాకు ఈ విషయం చెప్పవా..? అంటూ కోప్పడుతుంది మను. దీంతో రేపటి ఎలక్షన్స్‌ లో ఆనంద్‌ గెలవడు.. వాడికి సొంత ఇంట్లోనే సపోర్టు లేదు.. పైగా బంటిగాడు చాక్లెట్స్‌ తో పిల్లలందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు అని చెప్తుంది. కానీ ఇక్కడ అంజలి ఉంది అది ఏమైనా చేస్తుంది. రేపు స్కూల్‌కు ఆనంద్‌, భాగీ వస్తారు. వారితో పాటు నేను కూడా వస్తాను.  నువ్వేం చేస్తావో నాకు తెలియదు బంటీనే గెలవాలి అని చెప్తుంది మను. రేపు రండి చూసుకుందాం అని చెప్తుంది ప్రిన్సిపాల్‌. సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది మను.

మరోవైపు తనను అనుమానించిన లాయర్‌ను కోపంగా చంభా మాయం చేస్తుంది. వెంటనే లాయర్‌ మాయం అయిపోతాడు. రణవీర్‌ భయంతో అటూ ఇటూ చూస్తుంటాడు. చంభా లాయర్‌ ఎక్కడ..? ఏం చేశావు తనను అని అడుగుతాడు. ఇంతలో లాయర్‌ మరుగుజ్జులాగా తయారవుతాడు. లాయరును చూసిన రణవీర్‌ షాక్ అవుతాడు. చంభా నీ శక్తులు మనోహరి మీదనో.. లాయర్‌ మీదనో కాదు.. ఆ ఆత్మ మీద చూపించు.. అంటాడు. దీంతో ఆ ఆత్మను మరుగుజ్జుగా మార్చబోతున్నాను. అప్పుడు  దాని శక్తులు ఏవీ పని చేయవు.. నా చేతిలో కీలుబొమ్మై నేను ఆడించినట్టల్లా ఆడుతుంది అని చెప్తుంది. దీంతో రణవీర్‌ కోపంగా వెంటనే ఆ పని చేయ్ చంభా.. ఇప్పుడే చేయ్‌..అని చెప్తాడు. వెంటనే చంభా తన మంత్రదండాన్ని తీసుకుని మంత్రాలు చదువుతుంది. మరోవైపు ఆరు కనిపించక గుప్త కంగారుపడుతుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×