E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రావును వెళ్లిపోమ్మన్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today August 15th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రావును వెళ్లిపోమ్మన్న అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  షాపు ఓపెనింగ్‌కు వచ్చిన చిత్ర పెంచిన తండ్రి రావును పక్కకు తీసుకెళ్లి చిత్ర బెదిరిస్తుంది. నా గురించి ఎవరికైనా చెప్తే నిన్ను చంపడానికైనా నేను వెనకాడను అంటుంది. దీంతో నేను చావనైనా చస్తానుకానీ ఇవాళ అందరికీ నిజం చెప్తాను అంటాడు రావు. దీంతో చిత్ర కోపంగా చూస్తుంటే.. ఇప్పడే అందరికీ చెప్పేస్తా నీ బండారం మొత్తం బయట పెడతా అంటూ వెళ్లిపోతాడు. చిత్ర వెంటనే మను ఆ ముసలాడు వెళ్లిపోతున్నాడు మను. వినోద్‌కు నిజం చెప్పేస్తే నా లైఫ్‌ మొత్తం తలకిందులై పోతుంది మను నువ్వు ఏదైనా చేయ్‌ మను.. నన్ను కాపాడు మను  అంటూ చేతులు పట్టుకుంటుంది. దీంతో మను చాలా బాగుంది చిత్ర అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నమాట. ఏది ఏమైనా నీ పెంపుడు తండ్రి నీ గురించి నిజమే చెప్పారు అంటుంది.

మను నువ్వు కూడా ఏంటి మను ఇలా నా గురించి నీకు తెలియదా..? అంటుంది చిత్ర. ఎందుకు తెలియదు.. ఒడ్డుకు చేరాక తెప్ప తగులబెట్టే రకం నువ్వు. నీ అవసరం ఉంటే ఏమైనా చేస్తావు నువ్వు అవసరం తీరాక పడేస్తావు.. నిన్ను అమర్‌ పిలిచి డబ్బులు ఇవ్వగానే.. ఎంత ఓవర్‌ యాక్టింగ్ చేశావే.. ఇప్పుడు ఏం  చేయాలి అనేది నీకు నువ్వే ఆలోచించుకో అంటుంది మనోహరి. దూరం నుంచి అంతా చూస్తున్న అమర్‌ ఆయన వినోద్‌కు నిజం చెప్పడానికి వెళ్తున్నాడు మనమే వెళ్లి ఆయన్ని ఆపేద్దాం పదండి అంటూ వెళ్లిపోతారు. మరోవైపు మను తాను ఏమీ చేయలేనని చెప్పగానే అయితే తానే ఏదో ఒకటి చేస్తాను అంటూ వెళ్తుంది చిత్ర. ఏం చేస్తావు అని మను అడగ్గానే.. చంపేస్తాను అంటూ వెళ్లిపోతుంది. రావు లిఫ్ట్‌లో పైకి వెళ్తుంటాడు. చిత్ర వెళ్లి లిఫ్ట్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తుంది. అమర్‌, రాథోడ్‌ లిఫ్ట్‌ ఆగిపోవడం చూస్తారు. రాథోడ్‌  వెళ్లి స్విచ్‌ ఆన్‌ చేస్తారు. రావు పైకి వినోద్‌ దగ్గరకు వెళ్తాడు.

Advertisement

రావును చూసిన వినోద్‌ చెప్పండి అంకుల్‌ అంటాడు. ఏంటో చెప్పండి అంకుల్‌.. చిత్రను పిలపించమంటారా..? అంటాడు వినోద్‌. వద్దు బాబు చిత్ర గురించే మాట్లాడాలి బాబు. తన గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి.  ఏ విషయాలు అంకుల్‌.. అంటే బాబు అది ఎలా చెప్పాలో అర్థం కావడ లేదు.. అంటాడు రావు. పర్వాలేదు అంకుల్‌ చెప్పండి.. చిత్ర గురించి మీతో పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను అంటూ రావు చెప్తుండగానే.. అందరూ పైకి వస్తారు. మిస్సమ్మ రావును బాబాయ్‌ గారు నేను చెప్పేది వినండి.. అంటుంది. అంకుల్‌ ఏదో విషయం చెప్తా అన్నారు. మాట్లాడటం లేదు అంటాడు వినోద్‌.  దీంతో అంటే బాబు అది నన్ను ఈ షాప్‌ ఓపెనింగ్‌కు ఎవ్వరూ పిలవలేదు బాబు అని చెప్తాడు. ఏంటి అంకుల్‌ చిత్ర మిమ్మల్ని పిలవలేదా..? అని వినోద్‌ అడగ్గానే.. లేదు బాబు నా అంతట నేనే వచ్చాను. మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. నా భార్య హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉంది బాబు. వెంటనే తనకు ఆపరేషన్‌ చేయాలి అని రావు చెప్పగానే..

వినోద్‌ కగారుగా అయ్యో ఆంటీకి ఏమైంది అంకుల్‌.. చిత్ర ఆంటీకి హెల్‌ బాగా లేదని నాకెందుకు చెప్పలేదు  అంటూ కోపంగా అడుగుతాడు. దీంతో తను ఎందుకు చెప్తుంది బాబు అందుకే నేను చెప్పడానికి  వచ్చాను. తను ఎలాంటిదో మీకు అసలు తెలుసా బాబు.. తను ఏం చేసిందో మీకు అసలు తెలుసా బాబు..? అంటుంటే.. అయ్యో నాన్న ఇక చాలు నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్నా అంటూ అడ్డు పడతుంది. అంకుల్‌ ఏం  చెప్తారో చెప్పనివ్వు చిత్ర అంటూ వినోద్‌ కోపంగా చిత్రను తిడతాడు. దీంతో అది కాదు వినోద్‌.. ఆయన ఏం చెప్తారో నాకు తెలుసు నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటుంది చిత్ర. తర్వాత కాదు బాబు ఇపుడే మీకు అన్ని విషయాలు తెలియాలి అనగానే వినోద్‌ చెప్పండి అంకుల్‌ అంటాడు. ఇంతలో అమర్‌ వినోద్‌ ఆ విషయాలు ఇక్కడెందుకు ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం. నువ్వు కిందకు వెళ్లు అని చెప్తాడు. వినోద్‌ కిందకు వెల్లిపోతాడు. అమర్‌ రావును కూడా వెళ్లిపోమ్మని చెప్తాడు. రావు వెళ్లిపోతాడు.

Advertisement

ఇంటికి వచ్చిన అమర్‌ ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంటే వెనక నుంచి మిస్సమ్మ వెళ్తుంది. అమర్‌ను చూసి మౌనంగా వెళ్లిపోతంటే.. అమర్‌ చేయి పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య రొమాన్స్‌ మొదలవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×