E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today August 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు రాఖీ కట్టిన మిస్సమ్మ  

Nindu Noorella Saavasam Serial Today August 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు రాఖీ కట్టిన మిస్సమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  స్కూల్‌లో లీడర్‌ గా అమ్ము పోటీ చేస్తుంది. అమ్ముకు పోటీగా బంటి పోటీ చేస్తాడు. అమ్ము కోసం ఆనంద్‌ ప్రచారం చేస్తుంటాడు. ఇంతలో ఆనంద్‌కు ఎదురుగా బంటి వస్తాడు. మీ అక్క వల్ల కాక నువ్వు దిగవా అని అడుగుతాడు. మా అక్క వల్ల కాక కాదు నీలాంటి వాడు లీడర్‌ కాకూడదని నేను దిగాను అంటాడు ఆనంద్‌. చిన్న పిల్ల మాట విని చాలా పెద్ద డిసీజన్‌ తీసుకున్నావు నీకు ఓటమి రుచి చూపిస్తాను అంటాడు బంటి.. హలో ఎలక్షన్‌ అయ్యాక నీకు ఎన్ని ఓట్లు పడ్డాయో వేళ్ల మీద లెక్కపెట్టి చూపించు అంటుంది అంజు. దీంతో బంటి మీ అక్క ఓటు ఆకాష్‌ ఓటు కూడా నీకు పడదు అంటాడు బంటి..

ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయో ఎలక్షన్స్‌ అయ్యాక చూద్దాం అంటూ ఆనంద్‌ అందరినీ తీసుకుని ప్రిన్సిపల్‌ రూంలోకి వెళ్తారు. బంటి కూడా ప్రిన్సిపాల్‌ రూంలోకి వెళ్తాడు. అందరినీ చూసి ఏంటి అందరూ ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. మేడం నామినేషన్‌ వేయడానికి వచ్చాం అని బంటి చెప్తాడు. ఇంతలో ఆనంద్‌ కూడా ఇది నా నామినేషన్‌ మేడం అని చెప్తాడు. అదేంటి ఆనంద్‌ మీ అక్క పోటీ చేయనని చెప్పింది కదా అని అడుగుతుంది. దీంతో మా అక్క కాదు మేడం నేను పోటీ చేస్తున్నాను అని చెప్తాడు ఆనంద్‌. ఈసారి యునానమస్‌గా లీడర్‌ను సెలెక్ట్‌ చేద్దామని అనుకున్నాను. ఎలక్షన్స్‌ తప్పవు అన్నమాట అంటుంది ప్రన్సిపాల్‌.. తప్పుడు వాళ్లు లీడర్‌ అవ్వకూడదంటే ఎలక్షన్స్‌ ఉండాల్సిందే మేడం అంటాడు ఆనంద్‌. ప్రిన్సిపాల్‌ కోపంగా ఏమిటి ఏదో ఎంపీలు, ఎమ్మెల్యేలులాగా ఎక్స్‌ట్రాలు మాట్లాడుతున్నావు.. అంటుంది.

Advertisement

ఇంతలో అంజలి మెల్లగా ఎవరు ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో స్కూల్లో అందరికీ తెలుసు అనుకుంటుంది. ప్రిన్సిపాల్‌ ఏంటి అంజలి ఏదో అంటున్నావు అంటూ కోపంగా అడుగుతుంది. ఏం లేదు మేడం నామినేషన్‌ పేపర్స్‌ తీసుకోండి అని అంజు చెప్తుంది. పేపర్స్‌ తీసుకున్న ప్రన్సిపాల్‌ ఎలక్షన్స్‌ ఎప్పుడు అనేది తొందరలోనే అనౌన్స్‌ చేస్తాను. అప్పటి వరకు మీరు ప్రచారం చేసుకోవచ్చు. కానీ క్లాసెస్‌ డిస్టర్బ్‌ అవ్వకూడదు. క్యాంపస్‌లో గొడవలు జరగకూడదు. గొడల మీద ఎలాంటి రాతలు రాయకూడదు. బయటి పిల్లలను లోపలికి తీసుకురాకూడదు అని చెప్పగానే అందరూ ఓకే మేడం అంటూ వెళ్లిపోతారు.

ప్రిన్సిపాల్‌ ఇరిటేటింగ్గా యునానమస్‌గా బంటీని గెలిపిద్దామనుకుంటే.. ఈ అంజలి ఆనంద్‌ని నిలబెట్టింది చీ… అని ఫీలవుతుంది. బయటకు వచ్చిన బంటి తన ఫ్రెండ్స్‌తో అరేయ్‌ బస్తాల కొద్దీ చాక్లెట్స్‌ దింపండి.. బండిల్స్‌ కొద్ది బిస్కట్స్‌ దింపండి. . కిలోల కొద్ది ఐస్‌క్రీమ్‌ దింపండి.. నోట్స్‌ పెన్సిల్స్‌, పెన్నులు అన్నీ దింపండి.. స్కూల్‌లో అన్ని ఓట్లు నాకే పడాలి. అని చెప్తాడు. అదంతా విన్న ఆనంద్‌ చూశావా అంజు బంటీ గాడు అన్ని పంచుతున్నాడు మన దగ్గర ఏమీ లేవు కదా ఎలా అంటాడు. వాడి దగ్గర అవన్నీ ఉంటే మన దగ్గర అందరితో బాండింగ్‌ ఉంది. అదే మనకు పెద్ద ఓటు బ్యాంకు అని చెప్తుంది అంజు.

Advertisement

మరోవైపు మిస్సమ్మ రాఖీ తీసుకుని గార్డెన్‌ లోని ఆరు దగ్గరకు వెళ్తుంది. అన్నీ చూసిన ఆరు మిస్సమ్మ ఏంటి ఇవన్నీ అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఈరోజు రాఖీ పౌర్ణమి కదా అక్కా నా చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చాక నువ్వు పరిచయం అయ్యావు అక్క నాకు అక్కవైన అన్నవైన నువ్వే కాబట్టి  నీ చేతికి రాఖీ కట్టాలనుకుంటున్నాను అక్క. కట్టనా అక్కా.. అని మిస్సమ్మ అడగ్గానే.. ఆరు కట్టు అని అడుగుతుంది. మిస్సమ్మ, ఆరుకు రాఖీ కడుతంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×