E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today April 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌కు నిజం చెప్పిన అమర్‌ – అసలు కోల్‌కతాలో ఏం జరిగిందంటే  

Nindu Noorella Saavasam Serial Today April 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌కు నిజం చెప్పిన అమర్‌ – అసలు కోల్‌కతాలో ఏం జరిగిందంటే  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్‌ ఫ్యామిలీతో అమ్మ అనాథ శరణాలయానికి వస్తారు. కారు దిగి లోపలికి వెళ్తుంటే.. మనోహరి అమర్‌ను మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అడుగుతుంది. చెప్తాను లోపలికి రా అంటూ వెళ్తాడు అమర్‌. ఆ పక్కనే ఉన్న శివరాం కూడా ఏంటి అమర్‌ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు అని అడుగుతాడు. దీంతో అమర్‌.. ఆరు చనిపోయినప్పటి నుంచి ప్రతినెల తను చనిపోయిన రోజు ఆశ్రమంలో భోజనాలు పెట్టిస్తున్నాను నాన్నా.. వార్డెన్‌ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న ఆరు ఫ్రెండ్స్‌ అందరూ ఇవాళ ఇక్కడికి వస్తామని చెప్పారు. అందుకే మీరు కూడా ఉంటే బాగుంటుందని ఇక్కడికి రమ్మని చెప్పాను అంటాడు.

దీంతో నిర్మల ఇవాళ ఆ అమ్మాయే బతికి ఉంటే తన స్నేహితులు అందరినీ చూసి ఎంత సంతోషించేదో..? అంటుంది. దీంతో శివరాం ఒక్క సంతోషమేనా.. మొత్తం హడావిడి అంతా అమ్మాయిదే ఉండేది అంటాడు. ఇంతలో అనామిక కోపంగా మనోహరి వైపు చూస్తుంది. ఇదేంటి నన్ను ఇంత కోపంగా చూస్తుంది. ఇక్కడికి వచ్చాక అనామికలో ఉన్న అరుంధతి జ్ఞాపకాలు బయటపడ్డాయా..? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటుంది. అనామిక కూల్‌గా ఏమో అండి అరుంధతి గారు ఇప్పటికి కూడా మీ మధ్యలోనే ఉండొచ్చు. మీతోనే ఉంటూ ఉండొచ్చు అంటుంది. దీంతో శివరాం.. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా.. అప్పుడప్పుడు అమ్మాయి నిజంగా మా మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి కోడలిని పోగొట్టుకోవాలని మా తలరాతలో ఉందేమో అంటాడు.

Advertisement

ఇంతలో నిర్మల సరే సరే ఇలా మాట్లాడుతూ పోతే ఇక్కడే సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండిపోతాం. అమర్‌ ఒకసారి భాగీ ఫోన్‌ చేసి ఎంత వరకు వచ్చిందో కనుక్కో అని చెప్తుంది. అమర్‌, మిస్సమ్మకు ఫోన్‌ చేయగానే.. ఇప్పుడే స్టార్ట్‌ అయ్యాను వచ్చేస్తున్నాను అని చెప్తుంది. అమ్మా ఇప్పుడే స్టార్ట్‌ అయ్యిందంట వచ్చేస్తుంది. మనం లోపలికి వెళ్దాం. రాథోడ్‌ కారులో ఆరు ఫోటో పూలు ఉన్నాయి. అవి తీసుకురా..? అని చెప్పగానే రాథోడ్‌ అలాగే సార్‌ అంటూ వెళ్తాఉ. అందరూ ఆశ్రమం లోపలకి వెళ్తుంటారు. వెనక మనోహరి, అనామిక నడుస్తుంటారు. ఇక్కడికి వచ్చాక చేసిన తప్పులు కానీ పాపాలు కానీ ఏమైనా గుర్తుకు వచ్చాయా..? అని అడుగుతుంది అనామిక. దీంతో మనోహరి షాక్‌ అవుతుంది. ఏంటి అప్పుడే మర్చిపోయారా..? అరుంధతి గారు పెళ్లి చూపులు, పెళ్లంతా మొదలైంది ఇక్కడే కదా .. అంతా చేసి అప్పుడే ఎలా మర్చిపోయారు అంటుంది. దీంతో మనోహరి ఏంయ్‌ ఏం మాట్లాడుతున్నావు అంటుంది.

దీంతో అనామిక ఇలా అడుగుతున్నారేంటి మనోహరిగారు అరుంధతి గారు మీరు కలిసింది పెరిగింది అంతా ఇక్కడే అంట కదా..? దాని గురించే అడుగుతున్నాను అని చెప్తుంది. దీంతో మనోహరి అవును కానీ తప్పులు అన్నావు.. అనగానే.. అనామిక అదా ఇంత మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. టీనేజ్‌ లో వార్డెన్‌కు తెలియకుండా సినిమాలకు వెళ్లడాలు, కాలేజీలో వచ్చిన ప్రేమలేఖలు చదువుకోవడాలు చేసి ఉంటారు కదా వాటి గురించి అడిగాను అంటుంది. దీంతో మనోహరి అలా అన్నావా.. అంటూ లోపలికి వెల్లిపోతుంది. లేని ప్రేమను నటించి నన్ను చంపేశావు. నేను ఇప్పుడు నీలాగే మొదలుపెట్టాను. నీ నిజ స్వరూపం బయట పెట్టించే వరకు ఇక్కడి నుంచి పోను అని మనసులో అనుకుంటుంది. ఇంతలో వెనక నుంచి రాథోడ్‌ వచ్చి అనామిక ఎందుకు ఇక్కడ నిలబడ్డావు పద లోపలికి అని లోపలికి వెళ్తారు.

Advertisement

లోపల తన ఫ్రెండ్స్‌ ను చూసి అనామికలో ఉన్న ఆరు  ఎమోషనల్ అవుతుంది. మీరు ఎదురుగా ఉన్నా కలవలేకపోతున్నాను.. మాట్లాడలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది. ఫ్రెండ్స్‌ అందరూ అమర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతారు. అందరూ కలిసి ఆరు ఫోటోకు దండ వేసి దీపం వెలిగించి నివాళులు అర్పిస్తారు. అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే అమర్‌ మాత్రం ఒక్కడు బాల్కనీలోకి వెళ్లి ఆలోచిస్తుంటాడు. ఇంతలో రాథోడ్‌ వచ్చి సార్‌ ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దీంతో అమర్‌ కోపంగా భాగీకి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు.

అప్పుడే అటుగా వెళ్తున్న మనోహరి చాటుకు వెళ్లి అమర్‌ మాటలు వింటుంది. రాథోడ్‌ భయంగా మేడంకు ప్రమాదం ఉందా..?అని అడుగుతాడు. దీంతో అమర్‌, భాగీ కోల్‌కతా వెళ్లినప్పుడు  తన మీద అటాక్‌ జరిగింది. ఎవరో ఒక అమ్మాయి వచ్చి తనను కాపాడింది. ఆరును చంపిన వాళ్లే భాగీని చంపాలనుకుంటున్నారు.కానీ ఈసారి ఆ ప్రమాదం భాగీ దగ్గరకు రావాలంటే నన్నుదాటి రావాలి. నా కుంటుంబాన్ని బాధపెట్టాలని చూస్తుంది ఎవరో నాకు తెలియదు కానీ వాళ్లను మాత్రం వదిలిపెట్టను అంటూ అమర్‌ చెప్పడంతో మనోహరి భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×