E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today April 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలో మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఆరు –  మనోహరికి షాక్‌ ఇచ్చిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today April 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలో మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఆరు –  మనోహరికి షాక్‌ ఇచ్చిన అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : గార్డెన్‌లోకి వెళ్లిన అమర్‌..అనామికను నువ్వెందుకో నీలా అనిపించలేదు అని చెప్తాడు. దీంతో అనామిక నాలా అనిపించలేదు అంటే ఏంటి సార్‌ అర్థం కాలేదు అని అడుగుతుంది. దీంతో అమర్‌ కొత్తగా అనిపించావు చెప్పాలంటే ఆరులా అనిపించావు అంటాడు. అనామిక కంగారుగా మేడం లాగా నేనెందుకు అనిపిస్తాను సార్‌. ఫస్ట్‌ టైం ఆకాష్‌ కు అలా అంత బ్రీతింగ్‌ ప్రాబ్లమ్‌ చూశాను అందుకే అంత కంగారు పడ్డాను అంటే  సార్‌ నేను వెళ్లి మెడిసిన్స్‌ తీసుకుని వస్తాను. అని అనామిక వెళ్లబోతుంటే అమర్‌ ఆగు.. అంతే అయితే.. నాకు ఆరుకు మాత్రమే ఎక్కడుందో తెలిసిన ఎక్స్‌ట్రా మెడిసిన్‌  గురించి నువ్వెలా చెప్పగలిగావు. చెప్పు అనామిక ఆ ఎక్స్‌ట్రా మెడిసిన్‌ నా రూంలో రైట్‌ సైడ్‌ కప్‌బోర్డులో ఉన్నాయని అంత క్లియర్‌గా ఎలా చెప్పగలిగావు.. అని అడగ్గానే.. అనామిక అది పిల్లలు ఎవరో చెప్పినట్టు ఉన్నారు సార్‌ అంటుంది.

దీంతో మెడిసిన్స్‌ అక్కడ ఉన్నాయని పిల్లలకు కూడా తెలియదు. తెలియని విషయం గురించి వాళ్లు ఎలా నీకు చెప్తారు అని అమర్‌ అడగ్గానే.. ఆ గుర్తుకు వచ్చింది సార్‌ లాస్ట్‌ వీక్‌ భాగీ గారు మీ రూం క్లీన్‌ చేస్తుంటే హెల్ప్‌ చేశాను. అప్పుడు మెడిసిన్‌ అక్కడ ఉండటం చూశాను. అది గుర్తుకు వచ్చి చెప్పాను. ఏమైంది సార్‌ ఎందుకు అలా అడుగుతున్నారు అని అనామిక అడగ్గానే.. ఆరు అస్థికలు గంగలో కలపకపోవడం వల్ల ఇక్కడే ఉందని స్వామిజీ చెప్పారు. తను నీలో ప్రవేశించిందేమోనని డౌటు వచ్చి అడిగాను. నీ మాట, కంగారు అన్ని అచ్చం ఆరులా ఉంటే.. ఆరు వచ్చిందేమో అనుకున్నాను అంటాడు. దీంతో అనామిక అవునా సారీ సార్‌ నేను కొంచెం ఓవర్‌ గా రియాక్ట్ అయ్యాను మరోసారి అలా కాకుండా జాగ్రత్త పడతాను అంటుంది. దీంతో అమర్‌ పర్వాలేదు అనామిక ఇందులో నీ తప్పేం లేదు కదా అంటూ లోపలికి వెళ్లిపోతాడు.

Advertisement

అంతా దూరం నుంచి విన్న మనోహరి.. లోపలికి వెళ్లి అసలు ఇది అరుందతియా..? అనామికనా..? అర్థం కావడం లేదు. క్లారిటీ వచ్చే లోపే కన్పీజ్‌ చేస్తుంది. స్వామిజీకి ఫోన్‌ చేస్తుంది. నమస్కారం స్వామిజీ నాకొక సాయం కావాలి. అని అడుగుతుంది. స్వామిజీ చెప్పు మనోహరి అనగానే.. మా ఇంట్లో కేర్ టేకర్‌ గా ఉంది అనామికనో.. లేక అరుంధతినో కనుక్కునే మార్గం కావాలి అది అనామికలా వచ్చిన అరుంధతి అయితే మాత్రం నా నిజస్వరూపం బయట పెట్టడానికి పెద్ద ప్లానే వేసినట్టు ఉంది పంతులు గారు. అందుకే అది అనామికనో తెలుసుకోవడం నాకు ముఖ్యం అని అడుగుతుంది. దీంతో స్వామిజీ ముందు నీ జీవితంలోకి పెను తుఫాను అడుగుపెట్టబోతుంది. ఒక పెద్ద గండం నీకు ఎదురు అవ్వబోతుంది. నిన్ను మించిన మోసం నిన్ను నిలువునా ముంచేయడానికి నీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. అంటూ హెచ్చిరిస్తాడు.

మరోవైపు కొత్త అమ్మాయి  క్యారెక్టర్‌ ఎంట్రీ ఇస్తుంది. బస్టాండ్‌ లో ఒక మహిళ మెడలో ఉన్న గోల్డ్‌ చైన్‌ కొట్టేస్తుంది. చైన్‌ పోయిన మహిళ అరుస్తుంటే.. మళ్లీ తనే హడావిడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతుంది. తర్వాత అమర్ అందరినీ తీసుకుని ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమాన్ని చూసిన ఆరు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఇంతలో శివరాం వచ్చి ఏంటి అమర్‌ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు అని అడుగుతాడు. దీంతో అమర్‌ తాను ఆరు చనిపోయినప్పటి నుంచి ప్రతి నెల చనిపోయిన తారీఖున ఆశ్రమంలో అందరికీ భోజనం పెట్టిస్తున్నాను నాన్నా  అని చెప్తాడు. వార్డెన్‌ మేడం నుంచి ఈ విషయం తెలుసుకున్న ఆరు ప్రెండ్స్‌ అందరూ ఇవాళ ఇక్కడకు వస్తాము అని చెప్పారు. అని అమర్ చెప్తుండగానే.. అందరూ వచ్చేస్తారు.

Advertisement

అందరూ కలిసి ఆరు ఫోటోకు దండ వేసి నివాళులు అర్పిస్తారు. తర్వాత అందరూ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆరుతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుని ఎమోషనల్‌ అవుతారు. ఇంతలో ఒక ఫ్రెండ్‌ వచ్చి మనోహరికి నీకోసం ఒక స్పెషల్‌ ఫర్సన్‌ వచ్చారు అని చెప్తుంది. మనోహరి అనుమానంగా ఎవరు..? అని అడుగుతుంది. ఇంతలో నేనే అనుకుంటూ బస్టాండులో గోల్డ్‌ చైన్‌ కొట్టేసిన అమ్మాయి వస్తుంది. ఆమెను చూడగానే మను షాక్‌ అవుతుంది. ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×