E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today April 24th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి పోలీసులు – భయంతో వణికిపోయిన మను

Nindu Noorella Saavasam Serial Today April 24th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి పోలీసులు – భయంతో వణికిపోయిన మను
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ పిల్లల దగ్గరకు వెళ్లి ఆరు ఇక్కడ ఏం అంటే ఇష్టం అని అడుగుతుంది. దీంతో పిల్లలు చెప్పడం కాదు చూపిస్తాం రా అంటూ డాబా మీదకు తీసుకెళ్తారు. గాలిపటం తీసుకొచ్చి  ఎగురవేస్తారు. ఇదే అమ్మకు చాలా ఇష్టం అని చెప్తారు. ఇంతలో ఇంకో గాలిపటం కనిపిస్తుంది. అది ఎవరిది అని మిస్సమ్మ అడగ్గానే.. నాదే అనుకుంటూ మనోహరి వస్తుంది. మనోహరిని చూసి అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో మనోహరి ఏంటి మీ అమ్మను ఎవ్వరూ ఓడించలేరని తెగ మురిసిపోతున్నారు. చిన్నప్పటి నుంచి మీ అమ్మను ఈ గాలిపటం ఆటలో ఎన్నిసార్లు ఓడించానో తెలుసా..? అంటుంది. దీంతో అంజు అబద్దం మా మమ్మీ మీ మీద ఎన్నిసార్లు గెలిచిందో మాకు చెప్పింది అంటుంది. దీంతో మిస్సమ్మ.. నిజం చెప్పడానికి అక్క లేదని మీరు మీకు నచ్చిన అబద్దం చెప్పి అదే  నిజమని నమ్మించాలని చూస్తున్నారా..? మనోహరి గారు అంటుంది.

ఇంతలో రాథోడ్‌ కూడా వెటకారంగా అదేంటో మేడం అబద్దం చెప్పడం వెంటనే దొరికిపోవడం అది మీకే సాధ్యం అంటాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు. మనోహరి కోపంగా చూస్తుంటారు. ఇంతలో అనామిక మీరు అరుంధతి గారి ముందు  ఎప్పుడూ గెలవలేదు మనోహరి గారు. ఇదే నిజం. అంటుంది. దీంతో మనోహరి కరెక్టే.. ఆరుతో పోటీ పడిన ప్రతిసారి నేను ఓడిపోయాను. అసలు గెలిచే చాన్స్‌ కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఉన్నదంతా పణంగా పెట్టి ఒక్క ఆట ఆడాను గెలిచాను. అది ఈ అన్ని ఓటములను మరిపించింది అంటుంది మనోహరి. దీంతో అనామిక నీ ఆట కట్టించి నిన్ను ఓడించడానికే మళ్లీ వచ్చాను మను అని మనసులో అనుకుంటుంది. మనోహరి కూడా నువ్వు ఎన్నిసార్లు ఎన్ని అవతారాలు ఎత్తి వచ్చినా నా చేతిలో ఓడిపోవడం తప్పా వేరే ఆఫ్షన్‌ లేదు ఆరు అని మనసులో అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ అసలు మీరు ఇద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది.

Advertisement

రాథోడ్‌ కూడా మాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్తం అవుతుందా..? అని అడుగుతాడు. దీంతో అనామిక పిల్లలతో  పోటీ పడి గెలవమని చెప్తున్నాను రాథోడ్‌ అంటుంది. మనోహరి వెటకారంగా పిల్లలతో ఎందుకు నీతో ఆడి గెలుస్తాను రమ్మని చెప్తున్నాను.. ఏ అనామిక ఈసారి గెలుపు ఎవరిదో చూద్దామా.? అంటుంది. దీంతో అనామిక నీతో గెలవడానికి నేనెందు ఆడాలి మనోహరి గారు పిల్లలతో ఆడించి గెలిపిస్తాను అంటుంది. మనోహరి వెటకారంగా వీళ్లతో ఆడాలా..? పిల్లలతో అంటుంది. ఇంతలో అంజు మనోహరి ఆంటీ మాతో గెలవలేరని  మీరు భయపడుతున్నారా..? అంటుంది.

అమ్ము కూడా భయపడకండి ఆంటీ మరీ అంత ఫాస్ట్‌గా గెలవము.. కాసేపు మిమ్మల్ని ఆడించి అప్పుడు మీ గాలిపటాన్ని కట్‌ చేస్తాం అని చెప్పగానే మిస్సమ్మ.. మనోహరిగారిని చూస్తుంటే పాపం భయపడుతున్నట్టు ఉన్నారు పిల్లలు. మనం ఎందుకు ఆమెను భయపెట్టడం మనం ఆడుకుందా పదండి అంటుంది. దీంతో మనోహరి సరే ఆడుదాం.. అంటుంది. అందరూ ఆడుతుంటారు. అనామిక అమ్ము దగ్గరకు వెళ్లి గాలిపటాన్ని కాస్త లూస్‌ చేసి కిందకు లాగి మనోహరి గాలిపటం రైట్‌కు వెళ్లు .. కంగారు పడకు కాస్త మెల్లగా లాగు అంటూ అనామిక, అమ్ముకు సజెషన్స్‌ ఇస్తుంది. అమ్ము ఆడి మనోహరి గాలిపటాన్ని కట్‌ చేస్తుంది. దీంతో పిల్లలందరూ హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి ఇరిటేటింగ్‌ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

 కొడైకెనాల్‌ వచ్చినప్పుడు ఇక్కడ ఆరు అక్కకు ఎక్కువ ఇష్టం ఏది అని భాగీ పిల్లలను అడుగుతుంది. పిల్లలు అమ్మకు ఇక్కడ డాబా మీదకు వెళ్లి గాలిపటం ఎగురవేయడం అంటే చాలా ఇష్టం అని చెప్తారు. అయితే మనం కూడా ఇప్పుడు గాలిపటాలు ఎగురవేద్దామా అంటూ పిల్లలను తీసుకుని పైకి వెళ్తారు. అందరూ కలిసి గాలిపటం ఎగురవేస్తుంటే ఇంతలో మనోహరి గాలిపటం ఎగురవేస్తుంది.

తర్వాత అమర్‌ ఇంటికి కొడైకెనాల్‌ పోలీసులు వస్తారు. వాళ్లను రాథోడ్‌ ఇంట్లోకి తీసుకొస్తాడు. ఇంట్లో పోలీసులను చూసిన మనోహరి భయపడుతుంది. రాథోడ్‌ పోలీసులను తీసుకొచ్చాడేంటి..? అమర్‌కు నిజం తెలిసిపోయిందా ఏంటి నన్ను అరెస్ట్‌ చేయించడానికి తీసుకొచ్చారా..? అని మనసులో అనుకుని భయంతో వణికిపోతుంది. ఇంతలో కేసుకు సంబంధించిన ఫైల్‌ను అమర్‌కు ఇస్తాడు పోలీస్‌. మీరు అడిగిన మేడం గారి మర్డర్‌ ఫైల్‌ అని చెప్తాడు. ఆరోజు మీ ఇంట్లో వాళ్లు కాకుండా మేడం గారి ఫ్రెండ్‌ ఎవరో మీతో ఉన్నారని స్టేట్‌మెంట్‌ లో ఉంది అని పోలీస్‌ అడగ్గానే.. అమర్‌ తనే మనోహరి అని చూపిస్తాడు. దీంతో పోలీస్‌ సార్‌ తనని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా అనగానే అమర్‌ అడగండి అని చెప్తాడు. పోలీస్‌ వెళ్లి మనోహరిని ప్రశ్నిస్తుంటాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×