E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : అమర్‌, మిస్సమ్మల మధ్య రొమాన్స్‌  

Nindu Noorella Saavasam Serial Today Episode April 22nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ : అమర్‌, మిస్సమ్మల మధ్య రొమాన్స్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలందరూ చదువుతూ ఉంటే రాథోడ్‌ వెళ్తాడు. కమాన్‌ సోల్జర్స్‌ ఎగ్జామ్స్‌కు టైం తక్కువగా ఉంది కాబట్టి మీరు తొందరగా ప్రిపేర్ కావాలి. కింద సారుకు మాటిచ్చొచ్చాను. మీరందరూ ఫస్ట్‌ వచ్చేలా చదివిస్తానని.. సో మీరు అందరూ నా మాట నిలబెట్టాలి అని చెప్పగానే.. బుజ్జమ్మ, ఆకాష్‌, ఆనంద్‌ ష్యూర్‌ రాథోడ్‌ అంకుల్‌ నీ మాట నిలబెడతాము అంటారు. అంజు మాత్రం పలకకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రాథోడ్‌ అనుమానంగా చూస్తూ.. అంజు పాప ఏంటి ఇంత శ్రద్దగా చదువుతుంది అనుకుంటూ దగ్గరకు వెళ్లి చూస్తాడు. అంజు డ్రాయింగ్‌ గీస్తుంటుంది. బొమ్మలేస్తుందా..? ఇంకా చదువుతుందేమో అనుకున్నాను. అనుకుని అంజు పాప అని పిలవగానే.. ఏంటి రాథోడ్‌ అనగానే..

జస్ట్‌ ఫర్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోసం అడుగుతున్నాను. రేపు ఎగ్జామ్‌లో కూడా ఇలా బొమ్మలేస్తావా..? అని అడగ్గానే.. అంజు ఊరుకో రాథోడ్‌ ఎగ్జామ్‌లో ఎవరైనా బొమ్మలు వేస్తారా..? అడిగిన క్వశ్చన్స్‌కు ఆన్సర్‌ రాస్తారు అని చెప్పగానే.. రాథోడ్‌ మరి అడిగిన ప్రశ్నలకు జవాబు రాయాలి అంటే అందుట్లో చదవటం అనే ఆప్షన్‌ ఉంటుంది అనుకుంటాను అనగానే.. అంజు యావరేజ్‌ స్టూడెంట్స్‌ అయితే చదవాలి రాథోడ్‌. ఇంటలిజెంట్స్‌ అయితే పెద్దగా చదవాల్సిన అవసరం లేదు అని చెప్పగానే.. రాథోడ్‌ అంజలి పాప నాకు తెలియక అడుగుతున్నాను. ఎగ్జామ్స్‌ లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అని అడగ్గానే.. అంజు సీరియస్‌గా ఏంటి కామెడీ చేస్తున్నావా..? అనగానే.. రాథోడ్‌ మరి స్టార్ట్‌ చేసింది ఎవరు..? అనగానే.. అంజు కోపంగా అంటే నేను కామెడీ చేశానా..? నేను.. కామెడీ చేశానా..? అనగానే.. రాథోడ్‌ వెటకారంగా ఇంటలిజెంట్‌ అని నీకు నువ్వు చెప్పుకోవడం కామెడీ కాదా..? అనగానే.. ఇంటలిజెంట్‌ అంటే నేను ఇంటలిజెంట్‌ అని కాదు రాథోడ్‌.. ఎగ్జామ్‌లో నా ముందు కూర్చునే అమ్మాయి క్లాస్‌ ఫస్ట్‌. తనకంటే ఇంటలిజెంట్‌ ఎవరుంటారు చెప్పు అనగానే..

Advertisement

రాథోడ్‌ ఆశ్చర్యంగా అంటే రేపు ఎగ్జామ్‌లో అటూ సైగ చేయగానే.. అంజు నువ్వు గెస్‌ చేసింది కరెక్టే.. మొత్తం అక్కడ చూసి ఇక్కడ ఫ్రింట్‌ దించేస్తా… అనగానే.. రాథోడ్‌ నవ్వుకుని కొంచమైనా భయము, భక్తి, శ్రద్ద ఆసక్తి ఏమైనా ఉన్నాయా..? అనగానే.. ఏయ్‌ రాథోడ్‌ మన డిక్షనరీలో లేని వర్డ్స్‌ వాడొద్దు పాత సినిమా డైలాగులు కొట్టకుండా ఫస్ట్‌ ఇక్కడి నుంచి వెళ్లు అనగానే.. రాథోడ్ కోపంగా డ్రాయింగ్‌ బుక్‌ లాక్కుంటూ నిన్ను చదివించకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు అంటాడు. దీంతో అంజు కోపంగా మర్యాదగా ఆ డ్రాయింగ్‌ బుక్‌ ఇవ్వు రాథోడ్‌.. నేను చదవడం నీకు ఈ నేచర్‌కు అంత మంచిది కాదు అని చెప్పగానే.. ఏం పర్వాలేదు. ప్రళయం వచ్చినా ఇవాళ నిన్ను చదివించకుండా నేను వెళ్లను..నాలుగు రోజుల నుంచి సైన్స్‌ చదువుతున్నానని పెద్ద బిల్డప్‌ ఇచ్చావు కదా..? ఈ సైన్స్‌ నుంచి ఒక్కటే ఒక్క క్వశ్చన్‌ అడుగుతా ఆన్సర్‌ చెప్పు అంటూ రాథోడ్‌ క్వశ్చన్‌ అడగ్గానే.. అంజు విచిత్రంగా చూస్తూ.. ఏంటి..? ఆ క్వశ్చన్‌ సైన్స్‌లో ఉందా..? అది సోషల్‌  కాదా..? అంటుంది. అందరూ నవ్వుకుంటారు.

దీంతో ఆకాష్‌ సోషల్‌ ఏంటి అంజు ఏం మాట్లాడుతున్నావు అనగానే.. ఆకాష్‌ కూడా ఫోటో సింథసిస్‌ అంటే సైన్స్‌కు సంబంధించింది అంజు అని చెప్పగానే.. అంజు వెటకారంగా నవ్వుతూ ఓ ఆ వర్డ్‌ ఇప్పుడు సోషల్‌ నుంచి సైన్స్‌కు షిఫ్ట్‌  చేశారా..?అంటే ఆ వర్డ్‌ మా సైన్స్‌ టీచర్‌ పలికినట్టు గుర్తు లేదు రాథోడ్‌ అని చెప్పగానే.. రాథోడ్‌ ఓకే నెక్స్ట్‌ క్వశ్చన్‌ గ్రావిటీని కనుగొన్నది ఎవరు…? అని అడగ్గానే.. అంజు ఐన్‌స్టీన్‌ అని చెప్తుంది. దీంతో అందరూ మరోసారి నవ్వుకుంటారు. ఆనంద్‌ కోపంగా రోజూ యాపిల్‌ తింటావు కదే న్యూటన్‌ గుర్తు లేదా..? అనగానే.. అంజు అంటే నాకు ఐన్‌స్టీన్‌ బాగా గుర్తు అని చెప్పగానే.. రాథోడ్‌ అయితే ఐన్‌స్టీన్‌ థియరీ పేరేంటో చెప్పు అనగానే.. ఐన్‌స్టీన్‌ థియరీ అంటుంది అంజు. దీంతో రాథోడ్‌ నువ్వేమీ చదవలేదని నాకు చాలా బాగా అర్తం అయింది. ఫైనల్‌గా ఒక్క క్వశ్చన్‌ అడుగుతాను.. దానికైనా కరెక్టుగా సమాధానం చెప్తావా..? అంజు పాప అనగానే..

Advertisement

అంజు అడుగు రాథోడ్‌ చెప్తాను అంటుంది. దీంతో రాథోడ్‌ సైన్స్‌కు స్పెల్లింగ్‌ తెలుసా..? నీకు అనగానే.. అంజు వాట్‌యూడూ రాథోడ్‌ అనగానే.. మీనింగ్‌ కాదమ్మా నేను అడిగేది స్పెల్లింగ్‌ చెప్పు అంటాడు. దీంతో అంజు మళ్లీ తెలుసుకోవడం ఎందుకు ఎలాగూ ఆ క్వశ్చన్‌ పేపర్‌ మీద ఉంటుంది కదా అని తెలుసుకోలేదు అని చెప్పగానే.. రాథోడ్‌ తల పట్టుకోగానే.. ఏం రాథోడ్‌ సైన్స్‌ ఎగ్జామ్‌ రాయాలంటే సైన్స్‌ స్పెల్లింగ్‌ తెలియాలా..? అంటూ ప్రశ్నించగానే.. రాథోడ్‌ అయ్యో నేను ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా పిచ్చెక్కిపోతుంది. నేను మిమ్మల్ని చదివించలేను అంటూ అక్కడి నుంచి వెల్లిపోతాడు రాథోడ్‌.

మరోవైపు తమ బెడ్‌రూంలో కప్‌బోర్డు పైన ఉన్న సూట్‌కేస్‌ కిందకు తీయడానికి ఇబ్బంది పడుతున్న మిస్సమ్మ.. అక్కడే ఉన్న అమర్‌ను హలో నా పిల్లలకు తండ్రి గారు కొంచెం ఇటు వస్తారా..? అంటూ పిలవగానే.. అమర్‌ వచ్చి తిడుతూ.. నన్ను ఎందుకు పిలిచావు అంటాడు. దీంతో మిస్సమ్మ సూట్‌కేసు గురించి చెప్తుంది. దీంతో అమర్‌ సూట్‌కేసు తీయబోతూ కిందపడబోతుటే.. మిస్సమ్మ పట్టుకుంటుంది. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్‌ క్రియేట్‌ అవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×