E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుయే మనోహరి కూతురు అన్న యాదమ్మ  

Nindu Noorella Saavasam Serial Today Episode April 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజుయే మనోహరి కూతురు అన్న యాదమ్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి టెన్షన్‌గా గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతుంటే.. యాదమ్మ వస్తుంది. ఏంటి మనోహరి రాత్రి నుంచి ఇంత టెన్షన్‌ పడుతున్నావు.. ఫోన్‌ చేయమని రణవీర్‌కు చెప్పావు కదా..? ఇంకా టెన్షన్‌ దేనికి అని అడగ్గానే.. మనోహరి కోపంగా వాడు చెప్పిన పని కరెక్టుగా చేసేవాడే అయితే నాకు ఇంత టెన్షన్‌ ఎందుకు ఉంటుంది. వాడు కరెక్టుగా వినేవాడే అయితే ఈ పాటికి నాకు ఫోన్‌ చేసేవాడు. ఇంకో రెండు గంటల్లో ఆకాష్‌కు ఇంజక్షన్‌ చేయాలి. లేదంటే చనిపోతాడు అని చెప్పగానే.. యాదమ్మ భయంగా అమ్మో అదే కనక జరిగితే అమరేంద్ర ఎవ్వరినీ వదిలిపెట్టడు. రణవీర్‌తో మొదలుపెట్టి నీదాకా వచ్చి అందరినీ చంపేస్తాడు అనగానే..

మనోహరి కూడా అదే కదా నా భయం కూడా కనీసం వాడు అమరేంద్రకైనా ఫోన్‌ చేసి చెప్పాడో లేదో తెలియదు అంటుండగానే.. మనోహరికి కొత్త నెంబర్‌ నుంచి రణవీర్‌ కాల్‌ చేస్తాడు. కాల్‌ లిఫ్ట చేసిన మనోహరి హలో ఎవరు అని అడగుతుంది. రణవీర్‌ ఇంకెవరు నేనే.. అంటాడు. హలో రణవీర్‌ ఫోన్‌ చేయడానికి ఇంత సేపు ఏంటి..? నిన్ను ఎప్పుడు చేయమన్నాను ఎప్పుడు చేస్తున్నావు.. అని అడగ్గానే.. రణవీర్‌ నవ్వుతూ నా కోసం అమరేంద్ర పిచ్చి కుక్కలా రోడ్ల మీద తిరుగుతున్నాడు కదా..? వాణ్ని బాగా టెన్షన్‌ పెడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పగానే.. మనోహరి కోపంగా ఇది గర్వ పడే టైం కాదు. ఆకాష్‌కు ఇంకో రెండు గంటల్లో ఇంజక్షన్‌ చేయాలి అని చెప్పగానే.. రణవీర్‌ నాకు గుర్తుంది మనోహరి. నువ్వు చెప్పావు కదా..? ఇంజక్షన్‌ ఇవ్వకపోతే వీడు పోతాడు అని కూడా చెప్పావు.. అనగానే.. మనోహరి వెంటనే అమరేంద్రకు కాల్‌ చేయ్‌ మర్యాదగా మన కూతురుని అప్పగించమని చెప్పు అనగానే రణవీర్‌ అలాగే ఇప్పుడే కాల్‌ చేస్తాను అంటాడు.

Advertisement

దీంతో మనోహరి ఇంకో రెండు గంటల్లో ఆకాష్‌కు ఇంజక్షన్‌ ఇవ్వకపోతే చనిపోతాడన్న విషయం నీకు తెలుసన్న విషయం అమర్‌తో చెప్పు.. అప్పుడే ప్రెషర్‌ పెరిగి మన కూతురును అప్పగిస్తాడు. అర్థం అయిందా అని మనోహరి అడగ్గానే.. రణవీర్‌ అర్థం కాకపోవడానికి నేనేమైనా చిన్న పిల్లాడినా మనోహరి అనగానే.. అమర్‌కు ఫోన్‌ చేసి గంటల కొద్ది సోది చెప్పకు..  నీ ఫోన్‌ ట్రాప్‌ చేసి నువ్వు ఎక్కడున్నది తెలుసుకుని నిన్ను పట్టుకుంటాడు అని చెప్పగానే.. నాకు తెలుసే నా మాజీ భార్యామణి నువ్విలా స్పూన్‌ ఫ్రీడింగ్‌ ఇస్తే నాకు చిరాకు వస్తుంది అంటాడు. దీతో మనోహరి సరే అంతా కరెక్టుగా చేయ్‌ ఉంటాను అంటూ కాల్‌ కట్‌ చేసి పక్కకు చూసి మనోహరి షాక్‌ అవుతుంది. పక్కనే అంజు చూస్తూ ఉంటుంది. వెంటనే మనోహరి భయంగా మెల్లగా యాదమ్మ చెవిలో ఇది ఎప్పుడు వచ్చింది.. అని అడగ్గానే.. ఏమో తెలియదు అని యాదమ్మ చెప్తుంది. అంతా వినేసింది అంటావా..? అనగానే.. ఏమో తెలియదు మనోహరి అంటుంది యాదమ్మ.

దగ్గరకు వెళ్లిన అంజు మీరేం చేస్తున్నారు ఆంటీ ఏదో కాల్‌ ట్రేసింగ్‌ అంటున్నారు. ఎవరి ఫోన్‌ టాప్‌ చేస్తున్నారు అంటూ అంజు అడగ్గానే.. యాదమ్మ మనోహరి చెవిలో విన్నావా మనోహరి ఆ పిల్ల ఏమీ వినలేదు అంటుంది. అంజు మాత్రం చెప్పండి ఆంటీ ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారు అని అడగ్గానే.. మనోహరి కూల్‌గా నేను ఆన్‌లైన్‌లో ఒక ఆర్డర్‌ పెట్టాను అంజు.. అది మిస్‌ అయింది. ఆ కంపెనీ వాళ్లకు ఫోన్‌ చేసి ఆర్డర్‌ ట్రేస్‌ చేయమని చెప్తున్నాను అనగానే.. అంజు ఏం ఆర్డర్‌ పెట్టారు అని అడుగుతుంది. దీంతో మనోహరి కోపంగా అవన్నీ నీకెందుకు పెద్ద ఆరిందలాగా అన్ని అడుగుతున్నావు.. అనగానే.. నేను తెలుసుకోకూడదా ఆంటీ..? అనగానే.. మనోహరి కోపంగా అవన్నీ నీకు అవసరం లేదు.. అంటుంది. దీంతో అంజు నేను తెలుసుకోకూడదా ఆంటీ..? ఆకాష్‌ ఏమో హాస్పిటల్‌ లో ఉన్నాడు. తనకు ఎలా ఉందో తెలియదు. రాత్రి రాథోడ్‌ ఎవరినో కిడ్నాప్‌ చేశారని వెళ్లాడు. ఇంత వరకు రాలేదు. మీరేమో ట్యాపింగ్‌ ట్రేసింగ్‌ అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు అనగానే..

Advertisement

మనోహరి కోపంగా చిన్న పిల్లవి చిన్నపిల్లలాగా ఉండు.. పెద్ద వాళ్ల విషయాల్లో వేలు దూర్చకు పైకి వెళ్లి చదువుకో.. వెళ్లు అనగానే.. అంజు వెళ్లిపోతుంది. మనోహరి కోపంగా ఇంత లేదు ఎన్ని క్వశ్చన్స్‌ వేస్తుందో.. అనగానే.. యాదమ్మ తనను చూస్తే నాకు అచ్చం నిన్ను చూసినట్టే అనిపిస్తుంది.. అనగానే.. మనోహరి నా కూతురు ఎవరో కాసేపట్లో తెలిసిపోతుంది చంభా స్వయంగా అమరేంద్ర చెప్పబోతున్నాడు అంటుంది మనోహరి.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×