E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను కిడ్నాప్ చేయనున్న రణవీర్ 

Nindu Noorella Saavasam Serial Today Episode April 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆకాష్ ను కిడ్నాప్ చేయనున్న రణవీర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ వార్నింగ్‌ ఇవ్వడంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన రణవీర్‌ పుల్లుగా తాగుతూ ఉంటే.. అప్పుడే అక్కడికి మనోహరి వెళ్తుంది. కోపంగా రణవీర్‌ నిన్ను ఇంటికి వెళ్లిపోమ్మని చెబితే ఎందుకు హాస్పిటల్‌ దగ్గరకు వచ్చావు.. అమర్ తో గొడవ ఎందుకు పెట్టుకున్నావు.. ఏం చేసినా ఆవేశంతో కాదు ఆలోచనతో చేయాలని చెప్పాను కదా..? ఆ మాత్రం బుద్ది, జ్ఞానం కూడా లేవా నీకు ఇలా తాగడానికి తప్ప దేనికి పనికిరావు.. అంటూ తిడుతుంటే.. ఆపవే ఇదంతా వచ్చింది నీవల్లే కోల్‌కతలో  షేర్‌లా బతికేవాడిని ఏ రోజైతే నిన్ను రోడ్డు మీద చూసి ఇష్టపడ్డానో ఆరోజే నా బతుకు రోడ్డు మీద పడిపోయింది. వంద కోట్ల ఆస్థి పెట్టుకుని కూడా అనుభవించలేక ఇలా రోడ్ల మీద పడి ఊరూరా తిరుగుతు బతుకుతున్నాను. ఈ నా దుస్తితికి కారణం నువ్వే.. అంటూ రణవీర్‌ కోప్పడగానే..

మనోహరి కూడా కోపంగా నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావేంటి.. అనగానే.. అవునే నిన్ను పెళల్ఇ చేసుకుని పెద్ద తప్పు చేశాను. నీ వల్ల నా కూతురు దూరమైంది. ఆస్థి దూరమైంది.. నా మనఃశాంతి దూరమైంది. ఆఖరికి ఆ అమరేంద్ర చేతుల్లో తిట్లు  మిగిలాయి నాకు  నన్ను చంపేస్తానని బెదిరించాడు అనగానే.. మనోహరి కోపంగా నువ్వు ఇలా చేస్తే అమర్‌ అలాగే చేస్తాడు అంటుంది. దీంతో రణవీర్‌ ఏం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు నేను ఆల్‌రెడీ డిసైడ్‌ అయిపోయాను. నాకు నా కూతురు కావాలి ఆస్థి కావాలి దాని కోసం అందరినీ చంపేస్తాను.. నీతోనే ఆ చావు మొలుపెడతాను.. అంటూ మనోహరి పీక పట్టుకుని చంపేయబోతుంటే.. మనోహరి విదిల్చుకుని రణవీర్ ను పక్కకు తోసేస్తుంది. రణవీర్‌ నన్ను అమర్‌ను చంపేస్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందా..? నీ ఆస్థి నీకు దక్కుతుందా..? అంటూ ప్రశ్నించగానే..

Advertisement

మరేం చేయమంటావు.. కొద్ది రోజుల్లో నా బెయిల్‌ అయిపోతుంది. నేను మళ్లీ జైలుకు వెళ్లాలి. అదే జరిగితే నా ఆస్థి నాకు ఎప్పటికీ దక్కదు. ఆ జైళ్లోనే నేను మగ్గిపోతాను.. అంటూ కోప్పడుతుంటే.. మనోహరి అవసరం లేదు నీ కూతురుని నీ చేతుల్లో పెట్టి నిన్ను కలకత్తా  పంపిస్తానని నీకు కాశ్మీర్‌లో మాటిచ్చాను కదా..? అని చెప్పగానే.. రణవీర్‌ కోపంగా ఇవ్వవే నా కూతురుని నా చేతుల్లో పెట్టు నేను కలకత్తా వెళ్లిపోతాను అనగానే.. ఆ పిల్లను ఇవ్వాల్సింది నేను కాదు అమరేంద్ర అని మనోహరి చెప్పగానే.. రణవీర్‌ కోపంగా మరెందుకే మాటిచ్చావు వాడు నా కూతురిని నాకు ఇవ్వడు అనగానే..

మనోహరి ఇస్తాడు ఇచ్చేలా నేను చేస్తాను.. అనగానే.. ఎలా చేస్తావే.. నువ్వు అడగ్గానే.. నా కూతరురిని ఇచ్చేస్తాడా..? అనగానే.. ఇస్తాడు.. అమరేంద్ర కొడుకు ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. నువ్వు వెళ్లి వాణ్‌ని కిడ్నాప్‌ చేసి నీ కూతురును ఇస్తే వాణ్‌ని ఇస్తానని అమరేంద్రతో బేరం ఆడు అంటూ తన ప్లాన్‌ చెప్తుంది మనోహరి. రణవీర్‌ సరే అంటాడు. తర్వాత రణీవీర్‌ను డాక్టర్‌ డ్రెస్‌ వేసుకుని హాస్పిటల్‌లో ఉన్న ఆకాష్‌ కోసం వెల్తాడు. అప్పుడే అక్కడికి అమర్‌ వస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×