E-Paper
Advertisement

MSG Movie: బుల్లితెరపై కూడా తగ్గని జోరు.. మెగాస్టారా మజాకా?

MSG Movie: బుల్లితెరపై కూడా తగ్గని జోరు.. మెగాస్టారా మజాకా?
Advertisement

MSG Movie:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రాంతీయంగా 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో లేడీ సౌత్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)హీరోయిన్గా నటించగా.. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు.

ఓటీటీలోనే సరికొత్త రికార్డు..

ఇకపోతే ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అటు స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక్క రోజులోనే 200 మిలియన్ మినిట్స్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. అటు థియేటర్లలోనే కాదు ఇటు ఓటీటీలోనే కాదు ఇప్పుడు టీవీల్లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. జీ ఛానెల్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

టీవీల్లో కూడా న్యూ రికార్డ్..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బుల్లితెరపై రికార్డు సృష్టించింది. ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన ఈ సినిమా 14.2 టీఆర్పి రేటింగ్తో సంచలనం రేపింది. అలా మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా అటు థియేటర్లలోనూ ఇటు ఓటీటీలోనూ కూడా టాప్ రేటింగ్ లో నిలిచింది. అలా మొత్తానికి థియేటర్, ఓటీటీ , టీవీ ఇలా మూడు మాధ్యమాలలో కూడా హ్యాట్రిక్ అందుకొని మంచి విజయాన్ని సాధించింది. ఏది ఏమైనా ఇది చూసిన తర్వాత అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా మెగాస్టారా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Monalisa: మోనాలిసా బెదిరించిందా.. పెళ్లిపై విస్తుపోయే నిజాలు బయటపెట్టిన ఆమె బాయ్ ఫ్రెండ్!

చిరంజీవి తదుపరి సినిమాలు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి తో సంచలన విజయం అందుకున్న ఈయన ప్రముఖ యంగ్ డైరెక్టర్ బాబీకి అవకాశం ఇచ్చారు. ఇదివరకే బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మంచి విజయాన్ని అందించింది. అయితే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు రాబోయే చిత్రం బెంగాల్ మాఫియా డాన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇకపోతే ఈ సినిమాను వచ్చే యేడాది అనగా 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సమయానికి వస్తుందో లేదో అనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి చిరంజీవి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×