E-Paper
Advertisement

దారుణంగా పడిపోయిన జబర్దస్త్ రేటింగ్స్.. రంగంలోకి మెగా జడ్జ్.. పూర్వ వైభవం రానుందా?

దారుణంగా పడిపోయిన జబర్దస్త్ రేటింగ్స్.. రంగంలోకి మెగా జడ్జ్.. పూర్వ వైభవం రానుందా?
Advertisement

Nagababu: నాగబాబు పరిచయం అవసరం లేని పేరు మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమానికి  జడ్జిగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమం మొదట్లో నాగబాబుతో పాటు సినీ నటి రోజా (Roja) జడ్జిగా వ్యవహరించారు. సుదీర్ఘ కాలం పాటు నాగబాబు ఈ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగారు. అయితే మల్లెమాల వారితో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగానే ఈయన ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవడంతో అప్పటినుంచి ఈ కార్యక్రమానికి ఆయన స్థానంలో ఎంతో మంది జడ్జెస్ గా మారుతూ వచ్చారు.

జబర్దస్త్ కు పూర్వ వైభవం..

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కమెడియన్ కృష్ణ భగవాన్ , కుష్బూ వంటి తదితరులు జడ్జెస్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఎంతో మంచి ఆదరణ ఉండేది కానీ ఇటీవల జబర్దస్త్ రేటింగ్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి పూర్వవైభవం తీసుకురావడం కోసం మల్లెమాలవారు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగబాబుని తిరిగి జడ్జిగా రంగంలోకి దింపబోతున్నారు. ఇప్పటికే నాగబాబుకు ఈ కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇచ్చినటువంటి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి .రాబోయే రెండు వారాలలో ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.

రీ ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు..

Advertisement

ఈ విధంగా నవ్వుల రారాజు నాగబాబు తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలోకి వస్తున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఈ కార్యక్రమానికి కేవలం జడ్జిగా మాత్రమే కాకుండా, కమెడియన్లకు ఎంతో అండగా ఉంటూ వారిని ప్రోత్సహించేవారు. ఈ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవడంతో కొంతమంది కమెడియన్లు కూడా ఈ షో నుంచి తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక నాగబాబుతో పాటు ఈ కార్యక్రమానికి ఇంద్రజ జడ్జిగా కొనసాగబోతున్నారు.

జబర్దస్త్ జడ్జిలుగా నాగబాబు ,ఇంద్రజ..

Advertisement

రోజా తరువాత ఈ కార్యక్రమానికి ఇంద్రజ జడ్జిగా వ్యవహరించారు అయితే ఈమె కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకొని శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు జబర్దస్త్ కార్యక్రమానికి నాగబాబుతో కలిసి జడ్జిగా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో నాగబాబు రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా ఒకవైపు ఎమ్మెల్సీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఈయన జబర్దస్త్ జడ్జిగా కూడా కొనసాగబోతున్నారు. నాగబాబు నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే కాకుండా, సీరియల్స్ లో కూడా ఈయన నటించిన సంగతి తెలిసిందే.

Also Read: స్పోర్ట్స్ డ్రామాగా ‘వాలి ‘.. టైటిల్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన డైరెక్టర్ క్రిష్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×