E-Paper
Advertisement

తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్లు.. ఎందుకంటే? – మాధురి దువ్వాడ

తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్లు.. ఎందుకంటే? – మాధురి దువ్వాడ
Advertisement

Madhuri Duvvada: నిజంగా తెలంగాణ ప్రజలు అయితే చాలా మంచోళ్లు.. అని అన్నారు ఫైర్ బ్రాండ్ దువ్వాడ మాధురి (Duvvada Madhuri). తాజాగా ఆమె అటెండ్ అయిన బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో.. తన వ్యాపారం గురించి ఆమె చెప్పుకొచ్చారు. లాస్ట్ ఎలక్షన్స్ టైమ్‌కి ఉన్నదంతా పోయిందని, ఆ తర్వాత ఈ వ్యాపారం మొదలు పెట్టామని ఆమె తెలిపారు. ఇంతకీ ఏమా వ్యాపారం? ఏంటా కథ? అనే వివరాల్లోకి వెళితే..

శారీస్ అంటే ఇష్టమని

వందల మందికి జాబ్ ఇచ్చాను అన్నారు.. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు? అని అడిగితే.. ‘‘మా వకులా సిల్క్స్ అందరికీ తెలుసు. ఎలక్షన్స్ రిజల్ట్ రోజు మైన్స్ ఆపేశారు కదా.. ఆపేసినప్పుడు అప్పటివరకు ఒక 50 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశాం, మొత్తం అలా ఆగిపోయింది. ఎలక్షన్‌లో ఒక 50 క్రోర్స్ ఖర్చు పెట్టేసాం అదీ పోయింది. అప్పటివరకు సార్ పోర్ట్ కాంట్రాక్ట్ వర్క్ చేశారు, అది కూడా పోయింది. ఇంకేమీ లేక రిజల్ట్ తర్వాత ఇద్దరం జీరో స్టేజ్‌లో ఉన్నాం. అప్పుడు ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు నాకు ఈ శారీస్ అంటే ఇష్టమని, ఆయన గమనించి నాతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయించారు.

Advertisement

Also Read- అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపిస్తున్నాడా? ఈసారి వచ్చేది జగనే! – దువ్వాడ మాధురి

వెంకటేశ్వర స్వామి మదర్ పేరు..

వకులా సిల్క్స్ అని పేరు పెట్టడానికి కారణం.. మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. జాతకం ప్రకారం ‘వ’ అనే అక్షరం వచ్చినప్పుడు స్వామి నేమ్ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు స్వామి మదర్ వకులాదేవి కాబట్టి.. వకులాదేవి స్వామి గారి కళ్యాణం దగ్గరుండి చేయించింది. అందుకనే వకులా సిల్క్స్ అనే పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే, కళ్యాణానికి ఆ బట్టలు ఇక్కడి నుంచి వెళ్తే హ్యాపీగా ఉంటుంది కదా అని అలా స్టార్ట్ చేశాం. ఇప్పుడు వన్ ఇయర్ యానివర్సరీ.. వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా తెలంగాణ ప్రజలు అయితే చాలా మంచోళ్లు. మా ఏరియా దగ్గర్లో జూబ్లీహిల్స్‌లో ఉంటారు.. అక్కడ దగ్గర్లో స్టోర్స్ ఉన్నా సరే మాధురి దగ్గర కొనాలి, సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మియాపూర్ కి వచ్చి మరీ శారీస్ తీసుకుని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement

Also Read- అభిమానించే వాళ్ళనే చూశా.. అసహ్యించుకునే వాళ్ళని చూడలేదు- దువ్వాడ మాధురి

ఇటు డబ్బులొస్తే, అటు పంచేస్తుంటారు

కరెక్ట్‌గా మనకున్న నాలెడ్జ్‌పై ఫోకస్ పెడితే అంతా వర్కవుట్ అవుతుంది అన్నట్టు గర్ల్స్ కి ఎలాంటివి నచ్చుతాయో తెలుసు కాబట్టి.. ముందు నుంచి శారీస్ అంటే ఇష్టం కాబట్టి దగ్గరుండి నేనే డిజైన్ చేయించుకుంటాను. పట్టుచీరలు దగ్గరుండి ఓన్ వీవర్స్ మగ్గాలతో వీవింగ్ చేయిస్తాను. సో అందుకనే జనాలకి కూడా డిజైన్స్ బాగా నచ్చాయి. ఆంధ్రా వాళ్ళు వస్తున్నారు, తెలంగాణ వాళ్ళు వస్తున్నారు. వన్ ఇయర్‌లో బాగానే మనీ వచ్చింది. వచ్చినా కానీ, ఆయన సోషల్ యాక్టివిటీస్‌కే అంతా ఖర్చు చేస్తున్నారు. ఇటు డబ్బులొస్తే, అటు పంచేస్తుంటారు. ఆయన ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా దాచుకోరు. నేను మాత్రం గోల్డ్ కొనుక్కుంటాను కానీ, ఆయన మంత్లీ టెక్కలి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారు. అందరికీ ఖర్చు పెట్టేసి మళ్లీ హైదరాబాద్ వచ్చేస్తారు. ఒక రూపాయి దానం చేస్తే, భగవంతుడు రెండు రూపాయలు ఇస్తాడని అంటారు కదా. నాకు బిగ్ బాస్‌కి వచ్చిన రెమ్యునరేషన్ కూడా పంచేశారు. ముఖ్యంగా హెల్త్, విద్య కోసం.. పూర్ పీపుల్ కోసం ఖర్చు పెడతారు. చాలా మందిని ఆయన చదివిస్తున్నారు. బిగ్ బాస్‌కి రెమ్యునరేషన్ కూడా వద్దన్నారు. కానీ, వాళ్లు ఇచ్చారు. అది క్యాన్సర్ పేషెంట్‌లకు ఇచ్చేశారు. నేను వద్దని చెప్పలేను. ఎందుకంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్..’’ అని మాధురి చెప్పుకొచ్చారు.

Also Read- మనీకా? రిలేషన్స్‌కా? దేనికి వేల్యూ ఇస్తారంటే? దువ్వాడ మాధురి ఆన్సర్ ఇదే!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×