E-Paper
Advertisement

Madhu Babu – Priyanka Naidu: మళ్ళీ కలిసిపోయిన బుల్లితెర జంట…విబేధాలు తొలిగినట్టేనా?

Madhu Babu – Priyanka Naidu: మళ్ళీ కలిసిపోయిన బుల్లితెర జంట…విబేధాలు తొలిగినట్టేనా?
Advertisement

Madhu Babu – Priyanka Naidu: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడాకుల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఇలాంటి సంస్కృతి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య అధికమైంది. అదే విధంగా బుల్లితెరపై కూడా ఎంతోమంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని అనంతరం కొద్ది రోజులకే విడాకులు (Divorce) తీసుకొని విడిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక బుల్లితెరపై నటీనటులుగా కొనసాగుతున్న వారిలో మధుబాబు (Madhu Babu)ప్రియాంక నాయుడు(Priyanka Naidu) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒక్కటైనా ప్రియాంక, మధుబాబు..

వీరిద్దరూ బుల్లితెర నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇలా పాప పుట్టిన తర్వాత కూడా వీరిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు కానీ ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని కూడా వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ప్రియాంక, మధు ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవటం, వీరి పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని అంతా భావించారు.

హ్యాపీ యానివర్సరీ మై డియర్ వైఫ్…

Advertisement

వీరి విడాకుల గురించి ఎక్కడ అధికారక ప్రకటన వెల్లడించకపోయినా ఇదే నిజమని అనుకున్నారు. తాజాగా మధు బాబు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రియాంక మధు బాబు వివాహ వార్షికోత్సవం కావడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటోని మధుబాబు షేర్ చేస్తూ.. “మనిద్దరం సోల్మెంట్స్, ఈ యూనివర్స్ మనిద్దరిని ఒకచోటకు తీసుకువచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. జీవితాంతం ఇలాగే కలిసి ఉందాం హ్యాపీ అనివర్సరీ మై డియర్ వైఫ్” అంటూ ఈయన ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

విడాకుల రూమర్లు వస్తున్న నేపథ్యంలో మధుబాబు తన పెళ్లి ఫోటోని షేర్ చేస్తూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి అంటూ చేసిన పోస్ట్ వైరల్ గా మారడంతో అభిమానులు ఈ పోస్ట్ చూసాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ ఉండటం సహజం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండండి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా వీరిద్దరూ అభిప్రాయ బేధాలతో విడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒకటి కావడంతో వీరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని స్పష్టమవుతుంది.

Also Read: Prakash Raj: టికెట్ ధరలు భారం అంటే.. సినిమాలు చూడకండి.. ప్రకాష్ రాజ్ సంచనల కామెంట్

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×