E-Paper
Advertisement

Lakshmi Nivasam Antara: ‘లక్ష్మీ నివాసం’ యాక్టర్ అంతర కు తెలుగులో ఛాన్స్ అందుకే వచ్చిందా..?

Lakshmi Nivasam Antara: ‘లక్ష్మీ నివాసం’ యాక్టర్ అంతర కు తెలుగులో ఛాన్స్ అందుకే వచ్చిందా..?
Advertisement

Lakshmi Nivasam Antara: బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారమవుతూ ఉంటాయి. అందులో కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్క ఛానల్ మాత్రమే కాదు ప్రతి ఛానల్ కూడా జనాలను ఆకట్టుకునేందుకు కొత్త సీరియల్స్ లను అందిస్తున్నాయి. అయితే ఈ మధ్య తెలుగు వాళ్ళ కన్నా వేరే రాష్ట్రంలోని ముద్దుగుమ్మలే ఈ సీరియల్స్లలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న సీరియల్స్ అన్నిటిలోనూ కన్నడ, తమిళ్, బెంగాలీ యాక్టర్స్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. అయితే ఇప్పటికే తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు అంటూ ఒక వాదన కూడా వినిపిస్తుంది. కానీ కొత్త వాళ్ళ ఎంట్రీ మాత్రం ఉందనే ఉంటుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న లక్ష్మీనివాసం సీరియల్ లోని హీరోయిన్ కూడా బెంగాలి నటి. ఈయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో తనకి తెలుగులో ఎలా అవకాశాలు వచ్చాయో అన్న విషయం పై వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.. మరి తెలుగులో ఈమెకు అవకాశం ఎలా వచ్చింది? ఈమె ఏం చెప్తుంది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

తెలుగులో అవకాశాలు రావడానికి కారణం అదే..?

తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న లక్ష్మీనివాసం సీరియల్ లో ఈ బెంగాలీ ముద్దుగుమ్మ నటిస్తుంది.. అసలు పేరు అంతర స్వర్ణాకర్.. ఈ సీరియల్ లో ఆమె పేరు తులసి.. సంధ్యారాగం, లక్ష్మీ నివాసం సీరియల్ లలో నటించింది. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొదటిగా నటించింది మౌనరాగం సీరియల్. అదే ఆ సమయంలో తెలుగు పెద్దగా రాదట. కానీ ఆమె కట్టు బొట్టు చూసి ఆ సీరియల్ డైరెక్టర్ మేము మ్యారేజ్ చేసుకుంటాం మీరు నటించండి అని అన్నారని చెప్పింది. నాలుగైదు నెలలు భాష అర్థం కాక చాలా ఇబ్బందిపడ్డా. సెట్‌లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలిసేది కాదు. వాళ్ల హావభావాలు చూస్తూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించేదాన్ని.. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతున్నానని ఆమె అన్నారు.. నేను చూడడానికి అచ్చు తెలుగు అమ్మాయిలాగా ఉండడంతోనే నాకు ఈ అవకాశాలు వస్తున్నాయని ఆమె అంటున్నారు..

Advertisement

Also Read :శ్రీవల్లికి షాక్.. మరోసారి బుట్టలోపడ్డ కామాక్షి.. ప్రేమ, ధీరజ్ ల డ్రీమ్..

చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక.. 

అంతే కాదు ప్రతి బుల్లితెరన్నటికీ ఏదో ఒక కోరిక ఉన్నట్లే ఈమె కూడా ఒక కోరిక ఉండేదట.. ఈ విషయం గురించి ఇంటర్వ్యూలో తాజాగా ప్రస్తావించింది.. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనేదాన్ని. మా కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.. డాన్సర్ గా రాణించాలని అనుకున్నాను. ఆ కోరిక ఇప్పటికీ తీరలేదు. ఇక ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని ఆమె అంటున్నారు. తెలుగు, తమిళ్లో వరుసగా సీరియల్స్ చేయడం వల్ల అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉన్నాను అందుకే సినిమాలకు గ్యాప్ ఇవ్వలేకపోతున్నాను అని ఆమె అంటున్నారు. ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకూడదు. కష్టాన్ని నమ్ముకుంటే మనం జీవితంలో పైకొస్తామని ఆమె అన్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×