E-Paper
Advertisement

Kissik Talks Show Naresh: కట్నం తీసుకోను.. ఎదురు కట్నం ఇస్తా.. కాబోయే భార్యకు నరేష్‌ బంపరాఫర్‌!

Kissik Talks Show Naresh: కట్నం తీసుకోను.. ఎదురు కట్నం ఇస్తా.. కాబోయే భార్యకు నరేష్‌ బంపరాఫర్‌!
Advertisement

Kissik Talks Show Naresh: ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు నాటి నరేష్‌. ఈ షో ద్వారా బుల్లితెర మన్మథుడు అంటూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తనదైన కామెడీ పంచ్‌లతో ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే ఈ మధ్య నరేష్‌ ఎక్కువగా వార్తలు నిలుస్తున్నాడు. నరేష్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ గట్టిగా వార్తలు వినిపించాయి. దీనికి కారణం శ్రీదేవి డ్రామా. ఈ షోలో నరేష్‌ పెళ్లి ప్రొమో చూపించారు. నవ్వ అనే అమ్మాయితో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడని, శ్రీ దేవి డ్రామా కంపెనీ షోతో తన పెళ్లి కబురు చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే నరేష్ పెళ్లి..

ఇది చూసి అంత నిజమే అనుకున్నారు. నిజంగానే నరేష్‌ ఈ ఏడాది ఓ ఇంటివాడు అవుతున్నాడంటూ ఫ్యాన్స్‌ అంత సంబరపడిపోయారు. అంతేకాదు మీడియా, సోషల్‌ మీడియా మొత్తం నరేష్‌ పెళ్లే హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే తాజాగా ఈ పెళ్లి వార్తలపై, కాబోయే భార్య గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు నరేష్‌. ఇటీవల నరేష్‌ బిగ్ టీవీ కిస్సిక్‌ టాక్స్‌ షోకు అతిథిగా వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో నరేష్‌ మాట్లాడుతూ.. పెళ్లి కొడుకు అంటూ యాంకర్‌ వర్ష నరేష్‌ని ఆటపట్టింది. ఈ మధ్య గ్లామర్ బాగా పెంచేశావ్‌ అనగానే పెళ్లీడు వచ్చిందంటూ సరదగా మాట్లాడాడు. పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్నాడు.

నేనే ఎదురు కట్నం ఇస్తా..

Advertisement

శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి ఇప్పటికే పెళ్లి సెట్‌ అయ్యిందంటూ అంతా ఎవేవో రాస్తున్నారు. కానీ, అది నిజం కాదు. స్కిట్‌ భాగంగానే భాగంగా జరిగింది. నిజం పెళ్లి కాదు. నాకు ఇంకా వధువు దొరకలేదు. ఇంట్లో ఇంకా సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి కట్నంపై పెద్దగా ఆశలు లేవు. చెప్పాలంటే అసలు కట్నం తీసుకోవాలిం. ఒకవేళ అమ్మాయి కావాలంటే తనకే తిరిగి ఎదురుకట్నం ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నాను” అంటూ కాబోయే భార్యకు బంపరాఫర్‌ ప్రకటించాడు. కాగా నరేష్‌ పెళ్లి వార్తలు రావడం ఇదేం మొదటి సారి కాదు. గతంలోనూ ఎన్నో సార్లు నరేష్‌ పెళ్లిపై విపరీతంగా వార్తలు వచ్చాయి. అలాగే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నరేష్‌కు నవ్య అనే అమ్మాయితో పెళ్లి చేస్తున్నట్టు చూపించారు.

తొమ్మిదే చదివా..

Advertisement

అంతేకాదు ఈ ఈవెంట్‌లో నరేష్‌ ఫ్యామిలీ కూడా ఉంది. నరేష్‌ తండ్రి, తల్లి పట్టువస్త్రాలతో హాజరయ్యారు. దీంతో నిజంగా నరేష్‌ పెళ్లి చేసుకోబోతున్నాడని, ఈసారి నిజంగానే అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు చూశానని చెప్పాడు. తన చదువుపై మాట్లాడుతూ.. తాను తొమ్మిదో తరగతి వరకే చదివాను. ఇంట్లో కష్టాల వల్ల చదువు కొనసాగించలేకపోయాను. అలాగే నా హైట్‌ పై కూడా అంత ట్రోల్‌ చేసేవాళ్లు. నన్ను హేళన చేస్తూ మాట్లాడేవారు. ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించేవి. అలాగే మా నాన్న కూడా నా విషయంలో చాలా బాధపడేవారు. నా జీవితం ఏమౌతుందోనని అమ్మానాన్న ఒత్తిడికి గురయ్యేవారంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

Also Read: Ram Gopal Varma: దేవుడిపై రాజమౌళి కామెంట్స్.. ఆర్జీవీ సంచలన ట్వీట్‌

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×