E-Paper
Advertisement

Keerthi bhat: ఆ రోజే చనిపోదాం అనుకున్నా.. కార్తీక్ గురించి చెబుతూ సీరియల్ నటి కీర్తిభట్ కన్నీళ్లు

Keerthi bhat: ఆ రోజే చనిపోదాం అనుకున్నా.. కార్తీక్ గురించి చెబుతూ సీరియల్ నటి కీర్తిభట్ కన్నీళ్లు
Advertisement

Keerthi bhat: బుల్లితెర ప్రేక్షకులకు ‘కార్తీకదీపం’ సీరియల్ ద్వారా ఎంతో దగ్గరైన నటి కీర్తి భట్ జీవితం పూలబాట ఏమీ కాదు. తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, విషాదాలు ఎదుర్కొన్న ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. ఒకానొక దశలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్లామర్ ప్రపంచంలో నవ్వుతూ కనిపించే తారల వెనుక ఎంతటి వేదన ఉంటుందో ఆమె మాటలు వింటుంటే అర్థమవుతుంది. ఆమె చెప్పిన మాటలు చూస్తే ..

ఆ ఒక్క ఫోన్ కాల్ ప్రాణం పోసింది:

తన జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితుల గురించి కీర్తి మాట్లాడుతూ.. “ఎంగేజ్మెంట్ తర్వాత పని పరంగా, వ్యక్తిగతంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో కలిగిన తీవ్ర నిరాశ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, అంతా సిద్ధం చేసుకున్నాను. సరిగ్గా అదే క్షణంలో నా కాబోయే భర్త విజయ్ కార్తీక్ నుండి ఫోన్ వచ్చింది..ఫోన్ స్క్రీన్‌పై అతని ఫోటో చూడగానే ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. ఆ క్షణంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకుంటే అతని కుటుంబానికి, గౌరవానికి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు” ఎమోషనల్ అయ్యారు.

సోషల్ మీడియా నెగిటివిటీపై ఆగ్రహం:

Advertisement

కీర్తి తన ఆవేదనకు ప్రధాన కారణం సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు నెగిటివ్ కామెంట్స్ అని పేర్కొన్నారు. తాను కార్తీక్‌తో బ్రేకప్ చేసుకున్నానని, వారి మధ్య గొడవలు ఉన్నాయని వచ్చే థంబ్ నెయిల్స్ చూసి నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేసేవారని, అవి తనను మానసికంగా ఎంతో కృంగదీశాయని చెప్పారు. తాను బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా బయట కొందరు కావాలని తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేశారని ఆమె ఆరోపించారు. జనాలు కంటెంట్ చూడకుండా కేవలం థంబ్ నెయిల్స్ చూసి తీర్పులు ఇవ్వడం వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ:Vishwaksen: ఫరియా హైట్‌ పై హీరో విశ్వక్‌సేన్ షాకింగ్ కామెంట్స్.. ఏంటి భయ్యా అలా అన్నావ్!

రోల్ మోడల్‌గా నిలవాలనే తపన:

Advertisement

ఎన్ని కష్టాలు ఎదురైనా ఇప్పుడు తాను ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నానని కీర్తి గర్వంగా చెప్పారు. తన జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తోందని, ముఖ్యంగా భర్తలు వదిలేసిన వారు, పేరెంట్స్ లేని వారు తనను రోల్ మోడల్‌గా చూస్తున్నారని మెయిల్‌లు రావడం తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ఫేమ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన బిగ్గెస్ట్ చేంజ్ మరింత స్ట్రాంగ్ అవ్వడమేనని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ తనకు ఇన్విజిబుల్ అయ్యే పవర్ వస్తే, సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు కారణమైన వారిని శిక్షించాలని, తనపై నెగిటివ్ ప్రచారం చేసే వారికి బుద్ధి చెప్పాలని ఉందని తన కోపాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అమ్మాయిలు ఫోన్ చేసి నన్ను వాళ్ళ లైఫ్ లో ఇన్స్పిరేషన్ గా గా తీసుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాము అని చెప్పటం తనకు పెద్ద అవార్డు అని ఆమె తెలిపారు.

కీర్తి భట్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. ఆత్మహత్యే శరణ్యం అనుకున్న స్థాయి నుండి నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం వరకు ఆమె పడ్డ శ్రమ సామాన్యం కాదు. తన భాగస్వామి కార్తీక్ ఇచ్చిన సపోర్ట్‌తో ఆమె నేడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×