E-Paper
Advertisement

Kathalo Rajakumari Akshay : ‘కథలో రాజకుమారి ‘ అక్షయ్ క్యూట్ లవ్ స్టోరీ.. అసలు నమ్మలేరు..!

Kathalo Rajakumari Akshay : ‘కథలో రాజకుమారి ‘ అక్షయ్ క్యూట్ లవ్ స్టోరీ.. అసలు నమ్మలేరు..!
Advertisement

Kathalo Rajakumari Akshay : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లలో ఒకటి కథలో రాజకుమారి.. టైటిల్ కు తగ్గట్లే సీరియల్ స్టోరీ మొత్తం అలానే ఉంటుంది.. ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ లో అమర ప్రేమికుడు అక్షయ్ పాత్రకు జనాల నుంచి ప్రశంసలు దక్కాయి.. ఇందులో బుల్లితెర నటుడు మధుసూదన్ నటించారు. ఈనా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నటించిన ప్రతి సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మధుసూదన్ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారాడు.. ఈయన సీరియల్స్ గురించి పక్కన పెడితే.. లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం చాలామందికి తెలియదు… మధుసూదన్ లవ్ స్టోరీ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.. అందులో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..

మధుసూదన్ లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే..? 

నటుడు మధుసూదన్ నా పేరు మీనాక్షి, కళ్యాణం కమనీయం, కథలో రాజకుమారి లాంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నిజానికి ఈయన బెంగుళూరు వాసి. అక్కడ ఎవ్వరు లేకపోవడంతో హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువని ఆయన తెలిపారు.నా లైఫ్ బోరింగ్ అని కొత్తగా ఏమీ జరగదని ఇక్కడ కొత్తగా జరగడానికి ఏమీ లేదని అన్నాడు.. అతని చిన్న వయసులో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అప్పుడు తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నానని ఆయన అంటున్నారు. ఒకవైపు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న మధుసూదన్ తన ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.

ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారా..? 

Advertisement

సీరియల్ నటుడు మధుసూదన్ సొట్ట బుగ్గలతో క్యూట్ స్మైల్ తో కనిపిస్తాడు. సీరియల్లలో ఇతని నటనకు జనాలు ఫిదా అవుతుంటారు. అయితే ఈ ఇంటర్వ్యూ వల్ల ఆయనకు పెళ్లయిందని విషయం తెలుసుకుని చాలామంది నిరాశపడుతున్నారు. హీరో మెటీరియల్ అయినా మధుసూదన్ అప్పుడే పెళ్లి చేసుకొని ఎంతోమంది అమ్మాయిల మనసుని మొక్కలు చేశాడు అని సోషల్ మీడియాలో కామెంట్ లో వినిపిస్తున్నాయి. ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో పెళ్లి జరిగిపోవడంతో ప్రస్తుతం ఆయనకు ఇంటర్ చదివే పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మధుసూదన్ కు ఒక పాప బాబు.. పాప ప్రస్తుతం ఇంటర్ చదువుతుందని తెలుస్తుంది. బాబు కూడా స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పటివరకు ఆయనకు పెళ్లి కాలేదని చాలామంది అనుకున్నారు. ఈ వీడియో చూశాక చాలా మంది షాక్ అయ్యారు కూడా.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్లలో ఈయన నటిస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×