E-Paper
Advertisement

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వంటలక్క కూతురు..ఎన్ని మార్కులొచ్చాయంటే?

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వంటలక్క కూతురు..ఎన్ని మార్కులొచ్చాయంటే?
Advertisement

Karthika Deepam:ఈ మధ్యకాలంలో అటు సినిమాలలో ఇటు సీరియల్స్ లో సందడి చేస్తున్న ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఒకవైపు నటనకు మరొకవైపు విద్యకు సమయాన్ని కేటాయించలేక ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఆ కష్టం ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది.. అయితే సినిమాలలో, సీరియల్స్ లో పడి చదువును నెగ్లెట్ చేస్తున్నారు అనే కామెంట్లకు ఆ చైల్డ్ ఆర్టిస్టులు తమ మార్క్స్ తోనే చెక్ పెడుతున్నారు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అవ్వగా అందులో కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క కూతురిగా శౌర్య పాత్రలో అందరిని మెప్పించిన బేబీ కృతిక సంచలనం సృష్టించింది.. తన ఇంటర్ మార్కుల మెమోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక దీంతో శౌర్య మార్కులు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్మీడియట్ లో సత్తాచాటిన బేబీ కృతిక..

బుల్లితెరపై దాదాపు ఏడేళ్లు సంచలనం సృష్టించిన కార్తీకదీపం సీరియల్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇందులో డాక్టర్ బాబు , వంటలక్క , దీప, హిమా, శౌర్య పేర్లు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోతాయి . అంతలా తమ నటనతో మెప్పించారు.. ఇక ఈ సీరియల్ లో నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది . అందులో వంటలక్క, డాక్టర్ బాబుల గారాల పట్టి శౌర్య పాత్రలో నటించిన బేబీ కృతిక తన అమాయకమైన నటనతో.. చురుకైన మాటలతో తెలుగింటి అమ్మాయిలా అందరికీ దగ్గరయింది.. ఇక ఈ సీరియల్ తర్వాత పలు సినిమాలలో నటించిన ఈమె.. చాలాకాలంగా సినిమాలు, సీరియల్స్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఇప్పుడు చదువులో కూడా తన సత్తా చాటింది.

Advertisement

also read:Ram Pothineni: ఇంటర్ మార్కులే జీవితం కాదు: RAPO ట్వీట్ వైరల్

ఎన్ని మార్కులొచ్చాయంటే?

ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటి సంవత్సరం చదువుతున్న బేబీ కృతిక 470 మార్కులకు గాను 459 మార్కులు సాధించి నటనలోనే కాదు చదువులో కూడా టాపర్ అనిపించుకుంది. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు షూటింగ్లో బిజీలో ఉండి చదువును నిర్లక్ష్యం చేస్తారనే అభిప్రాయాన్ని ఈమె తలకిందులు చేసింది. షూటింగులు, కెమెరాల ముందు ఎంత బిజీగా ఉన్నప్పటికీ చదువుపై ఏమాత్రం శ్రద్ధ తగ్గించకుండా కష్టపడి చదివి మంచి మార్కులు స్కోరు చేసింది.. ఇక ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరపు మార్క్స్ మెమోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్స్ , సీరియల్ అభిమానులు కృతిక పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నువ్వు టాపర్ వై అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏదేమైనా సీరియల్ లో వంటలక్క కూతురిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శౌర్య.. ఇప్పుడు తన మార్క్స్ తో తన టాలెంట్ ను చూపించి అందరిని అబ్బురపరిచింది.

Advertisement

https://www.instagram.com/baby_krithika/p/DXGc9kKDvls/

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×