E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన దీప   

Karthika Deepam 2 Serial Today Episode May 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన దీప   
Advertisement

Karthika Deepam 2  serial today Episode: సూరజ్‌ ఆటో దిగి వెళ్తుంటే.. జ్యోత్స్న తన కారు కీస్‌ మొబైల్ ఇవ్వమని అడుగుతుంది. దీంతో సూరజ్‌ నీ మొబైల్‌, కీస్‌ నా దగ్గర ఎందుకుంటాయి… అసలు నేను తీయడం నువ్వు చూశావా అంటాడు. దీంతో జ్యోత్స్న కోపంగా నువ్వు జెంటిల్‌మేన్‌ అనుకున్నాను కానీ దొంగవి అని అర్థం అయింది అనగానే.. మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్లు మనకు అలాగే కనిపిస్తారట నన్ను మీరు ఎలాగైనా చూడొచ్చు.. అంటూ ఆటో వాలాకు డబ్బులు ఇస్తూ.. మేడంను రోడ్‌ నెంబర్‌ 4లో డ్రాప్‌ చేయ్‌ అని చెప్తాడు. జ్యోత్స్న ఆటో ఎక్కి వెళ్లిపోతుంది. లైఫ్‌లో మళ్లీ దొరుకుతావు.. అప్పుడు చెప్తాను నీ పని అంటూ కోపంగా వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లిన జ్యోత్స్నకు దీప ఫోన్‌ చేస్తుంది. ఇరిటేట్‌గా ఫోన్‌ లిఫ్ట్ చేసిన జ్యోత్స్నను అమ్మాయి గారు ఎక్కడున్నారు అని దీప అడగ్గానే.. ఊరు వదిలి పారిపోయాను అనుకున్నావా..? అంటూ తిడుతుంది జ్యోత్స్న..

నాకు నచ్చినట్టు ఉంటాను.. నీకెందుకు అంటూ అసలు నన్ను అడగడానికి నువ్వెవరు అనగానే.. మీ బావ భార్యను కాబట్టి అంటూ చెప్పగానే.. నువ్వు ఫ్యూచర్‌లో మా బావ  మాజీ భార్యవు అవుతావు.. అంటూ దీపను తిడుతూ లోపలికి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవుతుంది. లోపల అందరి ముందు స్పీకర్ పెట్టి ఫోన్‌ మాట్లాడుతూ ఉంటుంది దీప. అందరూ జ్యోత్స్నను కోపంగా చూస్తుంటారు. లోపలికి రాగానే.. సుమిత్ర, జ్యోత్స్నను తిడుతుంది. ఇప్పుడు నీ మాటలు విన్నాక అర్తం అయింది ఆరోజు దీప మాట్లాడిన మాటలు కరెక్టేనని.. ఇంతకు ముందే నీకోసారి చెప్పాను అయినా నీ బుద్ది మారలేదు మళ్లీ చెప్తున్నాను విను.. కార్తీక్‌ గురించి తప్పుగా మాట్లాడినా నేను నిన్ను క్షమించను.. అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. నేను నీ కన్నా మొండి దాన్ని ఒక్కసారి నేను ఎవరినైనా వద్దనుకున్నాను అంటే రక్తం పంచుకున్న నువ్వైనా  సరే పక్కకు పడేస్తాను అంటూ తిడుతుంది.

Advertisement

ఇంతలో శివనారాయణ అసలు నువ్వెందుకు ఇంత టైం వరకు ఇంటికి రాలేదు.. అంటూ అడగ్గానే.. ఏం చెప్పాలో అర్థం కాక జ్యోత్స్న మౌనంగా ఉండిపోతుంది. దీంతో అందరూ కలిసి జ్యోత్స్నను తిడతారు. దీంతో జ్యోత్స్న అందరికీ సారీ చెప్తుంది. బయటకు వెళ్లడం  నా తప్పే అంటుంది. దీంతో సుమిత్ర కోపంగా బయటకు వెళ్లడం కాదు పద్దతిగా లేకపోవడం కరెక్టు కాదు.. అంటూ తిట్టగానే.. జ్యోత్స్న సారీ చెప్తూ.. మరోసారి ఇది రిపీట్‌ కాదు అంటూ చెప్తుంది. దీంతో దశరథ కార్తీక్‌, దీపను వెళ్లిపోమ్మని చెప్తాడు. జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయాక కార్తీక్‌, దీప వెళ్లబోతుంటే.. జ్యోత్స్న వస్తుంది. దీంతో ఏం కౌంటర్‌ ఇచ్చావు దీప. ఇది నేను గుర్తుపెట్టుకుంటాను.. దీనికి కౌంటర్‌ ఉంటుంది బావ అంటుంది. దీంతో కార్తీక్‌, జ్యోత్స్నను తిట్టి దీపను తీసుకుని వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లిన దీప, కార్తీక్‌లను కాంచన తిడుతుంది. కడుపుతో ఉన్నదానివి ఏ టైంలో బయటకు వెళ్లాలో తెలియదా నీకు అంటూ తిడుతుంటే.. నేనే తీసుకెళ్లాను అమ్మా అంటూ కార్తీక్‌ అడ్డుపడగానే.. కాంచన కోపంగా కార్తీక్‌ను తిడుతుంది. పరిస్థితులు బాగాలేనప్పుడు ఇంటి పట్టునే ఉండాలి కదా… మీరు ఫోన్‌ ఆఫ్‌ చేసి పడుకోండి అంటూ కాంచన తిట్టి వెళ్లిపోతుంది. కాంచన వెళ్లగానే.. జ్యోత్స్న కావాలనే చేసిందా బావ అంటూ దీప అడగ్గానే.. ఎంత చేసినా పారు జ్యోత్స్నకు గట్టిగా చెప్పింది కదా..?అనగానే.. కానీ పారిజాతం గారికి నిజం తెలిస్తే మనతో ఆడుకుంటుంది కదా బావ అంటూ దీప భయపడితే ఇప్పట్లో నిజం తెలియదులే అంటాడు కార్తీక్‌.

Advertisement

బెడ్‌రూంలో కూర్చున్న జ్యోత్స్న కోపంగా సూరజ్‌ ఇచ్చిన వంద రూపాయల నోటు చూస్తూ.. ఉంటుంది. అప్పుడే రూంలోకి వెళ్లిన పారిజాతం ఏంటే ఏం చేస్తున్నావు.. చేతిలో వంద రూపాయల నోటు ఏంటి..? అంటూ అడగ్గానే..దీనికో కథ ఉందిలే అంటూ జ్యోత్స్న చెప్పగానే.. ప్రతిదానికి నీకో కథ ఉంటుందిలే అంటూ తిట్టగానే.. జ్యోత్స్న నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. తానే పారిజాతం మనవరాలు అంటూ చెప్పబోతుంటే.. పారిజాతం తిట్టి ఆపేస్తుంది. నువ్వు సీఈవో అవ్వలేవు.. పెళ్లి చేసుకుని మొగుడితో కాపురం చేసుకో.. నా మనవరాలి కాపురంలో వేలు పెట్టావో కొబ్బరిబొండంతో తల బద్దలుకొడతాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది.

మరుసటి  రోజు కార్తీక్‌, దీప స్కూటీ మీద వెళ్లబోతుంటే.. దీప ఈరోజు రాశిఫలాలు చూశాను.. మనిద్దరం ఇవాళ ఎవరో తెలిసిన వాళ్లను కలుస్తామంటా అంటుంది. అప్పుడే స్కూటీకి ఎదురుగా  సూరజ్‌  కనిపిస్తాడు. దీంతో నువ్వు చెప్పింది నిజమే మరదలా అంటూ కార్తీక్‌, దీపకు సూరజ్‌ గురించి చెప్తాడు. ఇద్దరూ కలిసి సూరజ్‌ దగ్గరకు వెళ్లి థాంక్స్‌ చెప్తారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×