E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్న కు పెళ్లి చేసేందుకు కార్తీక్ కొత్త ప్లాన్

Karthika Deepam 2 Serial Today Episode May 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్న కు పెళ్లి చేసేందుకు కార్తీక్ కొత్త ప్లాన్
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్న గురించి దీప, కార్తీక్‌ ఆలోచిస్తుంటారు. జ్యోత్స్న ఏదో పెద్ద ప్లాన్‌ మీదే ఉందని దీప అనగానే.. అయితే అంత త్వరగా ఏదీ చేయదు అంటాడు కార్తీక్‌. దీంతో దీప కోపంగా దాని మనసు చాలా దుర్మార్గమైనది బావ. అది అనుకున్నది చేయడానికి   ఏమైనా చేస్తుంది అంటుండగానే.. కార్తీక్‌ కు జ్యోత్స్న ఫోన్‌ చేసి మీతో మాట్లాడాలి మేడమీద బాల్కనీకి రా బావ అని పిలుస్తుంది. కార్తీక్‌ మాతో అంటే అనగానే.. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్లను కూడా తీసుకునిరా అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. దీంతో కార్తీక్‌ చూశావా జ్యోత్స్న ఎంత ముదురో అంటాడు. దీప అదే భయం కూడా అంటుంది. భయాలేవీ పెట్టుకోకు వెళ్దాం పద ఏం మాట్లాడుతుందో విందాం.. అనగానే.. సీఈవో గురించి అగ్రిమెంట్‌ గురించి మాట్లాడితే అని దీప అడగ్గానే.. ఏం మాట్లాడాలో నాకు తెలుసు కానీ పద అంటూ దీపను తీసుకుని వెళ్తాడు.

మరోవైపు కాంచన ఇట్లో ఉన్న శ్రీధర్‌, జ్యోత్స్న చేస్తుంది హండ్రెడ్‌ పర్సెంట్‌ కరెక్ట్‌ అంటాడు. కాంచన కోపంగా శ్రీధర్‌ను మీరెందుకు జ్యోత్స్నను సపోర్ట్‌ చేస్తున్నారు అంటుంది. మీ మాటలు వింటుంటే నాకు బీపీ పెరుగుతుంది అంటూ కోప్పడుతుంది. దీంతో శ్రీధర్‌ తప్పు కార్తీక్‌ దే అంటాడు. మన కొడుకు చేసిన తప్పుకు ఎవరిని నిందించలేం.. అనగానే.. అవసరానికి కండీషన్లు పెట్టింది ఎవరు జ్యోత్స్న కాదా.. అంటూ కాంచన తిట్టగానే.. శ్రీధర్‌ ఇప్పుడు నీ బాదేంటి అని అడగ్గానే.. మీరు ధర్మం వైపు ఉండి మాట్లాడండి అంటుంది. మీరు జ్యోత్స్నను సపోర్ట్‌ చేయకండి అంటుంది. దీంతో శ్రీధర్‌ నేను జ్యోత్స్ననే సపోర్టు చేస్తాను. ఎందుకంటే బలవంతులు సైలెంట్‌ గా ఉంటే బలహీనులే రాజ్యమేలుతారు. కార్తీక్‌ కావాలనే జ్యోత్స్న మాటలకు కట్టుబడుతున్నాడంటే.. కార్తీక్‌ వెనక దీప ఉంది. అది ఎందుకో ఏంటో తెలుసుకోవాలి. అది నువ్వే తెలుసుకోవాలి అని చెప్పగానే.. కాంచన మీ అనుమానాలకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నాయా..? అని అడగ్గానే.. శ్రీధర్‌ లేవని కానీ ఎలాగైనా తెలుసుకోవాలని చెప్తాడు.

Advertisement

మరోవైపు జ్యోత్న్స తన దగ్గరకు వచ్చిన కార్తీక్‌, దీపలను బెదిరిస్తుంది. తాను చెప్పినట్టు వినకపోతే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో దీప ఏంటి బావ ఇది తెగ రెచ్చిపోతుంది. అనగానే.. జ్యోత్స్న కోపంగా ఏంటే ఇదా..? అంటుంది. అవును అయినా నీ మీద గౌరవం ఎందుకు..? దాపరికాలు ఎందుకు అయినా వచ్చిన దగ్గర నుంచి బాతులా బెకబెక అరుస్తున్నావు అనగానే.. కార్తీక్‌ పోలిక అదిరిపోయింది మరదలా అంటాడు. దీంతో దీప ఏంటే అన్నావు.. మాకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చావా..? అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేస్తావా..? అని అడగ్గానే.. అగ్రిమెంట్‌ ఉన్నంత వరకు బావ నాకు బానిస దీప. నా మెడలో తాళి కడితే రెండు సమస్యలు తీరుతాయి. మొదటిది నువ్వు వారసురాలివి అని అందరికీ తెలియడం. రెండు బావ సీఈవో అవ్వడం. ఈ రెండు జరగాలంటే నా మెడలో తాళి పడాలి. అది బావే కట్టాలి. అనగానే.. దీప కోపంగా చెప్పు తెగిపోతుంది. అసలు నువ్వెవతివే మాకు ఆఫర్లు ఇవ్వడానికి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. నీ గురించి వైరాతో నువ్వు కలిసిపోయిన విషయం అందరికీ చెప్తాను. అంటూ బెదిరిస్తుంది. జ్యోత్స్న షాక్‌ అవుతుంది.

తర్వాత కార్తీక్‌, శివనారాయణ, దశరథలను పిలిచి సీఈవో గురించి జ్యోత్స్న కు కాబోయే భర్త గురించి మాట్లాడాలి అంటాడు. అయితే శివనారాయణ మన బంధువుల్లో ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేయాలి అంటాడు. దీంతో కార్తీక్‌ ఇదేమీ నాకు నచ్చలేదని చెప్తాడు. దీంతో నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు శివనారాయణ. అప్పుడే కార్తీక్‌, ఒక యంగ్‌ అండ్‌ డైనమిక్‌ కుర్రాడిని చూసి మన కంపెనీకి సీఈవోను చేయాలి. ఆ సీఈవోనే జ్యోత్స్నకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పగానే.. పారిజాతం వచ్చి సూపర్ గా ఉంది మనవడా అనుకుంటూ వస్తుంది. శివనారాయన ఈ విషయం నేనే జ్యోత్స్నకు చెప్తానని వెళ్తాడు. దశరథ నీ ప్లాన్ బాగుందిరా అంటూ వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత శివనారాయణ బోర్డు మెంబర్స్‌ను పిలిచి సీఈవో విషయంలో ఒక మీటింగ్‌ పెట్టమని అందరం కలిసి సీఈవో ను ఎంపిక చేద్దామని చెప్తాడు. బోర్డు మెంబర్స్‌ మొత్తం సరే అంటూ వెళ్లిపోతారు. తర్వాత జ్యోత్స్న కార్తీక్‌, దీప దగ్గరకు వెళ్లి జరగబోయే బోర్డ్‌ మీటింగ్‌లో ఏదైనా జరగొచ్చు అని చెప్తుంది. వాళ్లను రప్పించింది నువ్వేనని నాకు బాగా తెలుసు కానీ ఏం చేయాలో నాకు తెలుసు అంటాడు కార్తీక్‌. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×