E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శ్రీధర్ ను సీఈవో గా తప్పించిన శివనారాయణ

Karthika Deepam 2 Serial Today Episode May 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శ్రీధర్ ను సీఈవో గా తప్పించిన శివనారాయణ
Advertisement

Karthika Deepam 2  serial today Episode: హాస్పిటల్‌లో ఉన్న శ్రీధర్‌కు ఆఫీసు నుంచి కంటిన్యూగా ఫోన్లు వస్తుంటే.. కాంచన కోప్పడుతుంది. ఫోన్‌ తీసుకుని కట్‌ చేయమని చెప్తుంది. అలాగే కాంచన కోపంగా స్వప్నకు వార్నింగ్‌ ఇస్తుంది. అలాగే ఇంట్లో ప్రశాంతంగా ఉండే ఆయన్ని తీసుకెళ్లి రెస్టారెంట్‌ సీఈవోను చేశారు. అందుకోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.. అంటూ అందరినీ కాంచన తిడుతుంటే.. శ్రీధర్‌ కాంచన పిల్లలకు అన్ని తెలుసు అంటుంటే.. కాంచన కోపంగా తిడుతూ.. శ్రీధర్‌ను మా నాన్న దగ్గరకు తీసుకెళ్దాం పదండి అంటూ స్వప్నను ఇంటికి తీసుకెళ్లి మీరిద్దరూ ఆలోచించుకోండి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించుకోండి అంటూ చెప్పి శ్రీధర్‌ ను తీసుకుని శివనారాయణ ఇంటికి వెళ్తారు.

ఎదురుగా వచ్చిన జ్యోత్స్న ఏంటి బావ అమ్మానాన్నలను తీసుకుని వచ్చావు పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికా అంటుంది. దీంతో కాంచన కోపంగా జ్యోత్స్నను తిడుతుంది. ఇంతలో అక్కడికి అందరూ వస్తారు. దశరథ ఏమైంది కార్తీక్‌ బావ నీరసంగా ఉన్నారు అని అడగ్గానే.. హార్ట్‌ స్ట్రోక్‌ వచ్చింది అని కార్తీక్‌ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ కోపంగా మరి ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనగానే.. కార్తీక్‌ ఆఫీసు విషయం గురించి మాట్లాడటానికి అని చెప్పగానే.. శివనారాయణ కోపంగా ఆఫీసు లేదు ఏం లేదు అంటూ తిడుతూ ఏం దీప నువ్వెందుకు చెప్పలేదు అనగానే.. దీప చెప్పబోతుంటే.. జ్యోత్స్న అడ్డుపడింది అంటూ పారిజాతం కోప్పడుతుంది. ఇంతలో జ్యోత్స్న కోపంగా పారిజాతాన్ని తిడుతుంది. దీంతో అందరూ జ్యోత్స్నను తిడతారు. అయితే మామయ్య సీఈవో పోస్ట్‌కు రిజైన్‌ చేస్తాడట.. ఆ పోస్ట్ బావకు ఇచ్చేయండి అదే కదా అత్త అడిగేది అంటూ జ్యోత్స్న చెప్పగానే..

Advertisement

ఒసేయ్‌ నేను ఇంకా పూర్తిగా అడగలేదే.. మా ఆయనకే కాదు కార్తీక్‌ కూడా రెస్ట్‌ కావాలి. ఆ అగ్రిమెంట్‌ మొత్తం క్యాన్సిల్ చేసేయండి.. ఇవాళ వాళ్ల నాన్నకు జరిగిందే రేపు కార్తీక్‌కు జరుగుతుంది. ఈ టెన్షన్స్‌ అన్ని అలా ఉన్నాయి అంటూ కాంచన ఎమోషనల్ అవుతుంటే అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న అడ్డుపడితే కాంచన కోపంగా తిడుతుంది. ఇక మీరే చెప్పాలి నాన్న నా కొడుకును మా ఆయనను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలా..? చెప్పండి అని అడగ్గానే.. పారిజాతం కోపంగా తీసుకెళ్లిపో కాంచన అంటుంది. దీంతో జ్యోత్స్న గ్రానీ ఏం మాట్లాడుతున్నావు అంటూ తిడుతుంది. కాంచన మాత్రం కోపంగా మీరు చెప్పండి నాన్న అని అడుగుతుంది. దీంతో శివనారాయన శ్రీధర్‌ విషయంలో నేను ఏమైనా చేయగలను కానీ కార్తీక్‌ విషయంలో నేనేమీ చేయలేనని అది జ్యోత్స్న చేతిలో ఉందని అలాగని కార్తీక్‌కు నేను పది కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కానీ నీ కొడుకు తీసుకుంటాడా..? అంటూ చెప్పగానే.. అందరూ ఆలోచనలో పడిపోతారు.

ఇంటికి వెళ్లిన కాశీ, స్వప్నను కన్వీన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాశీ ఎంత చెప్పినా స్వప్న వినదు. నేను ఎప్పటికీ నీతో కలవను. అంటూ స్వప్నకు చెప్పగానే.. అయితే కనీసం మామయ్య కోసమైనా మనం కలిపిపోయినట్టు నటిద్దాం. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు ఆయన కూల్‌గా ఉంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు.. నువ్వు నటించేది నీ తండ్రి ప్రాణాలు కాపాడేందుకే అన్న విషయం గుర్తు పెట్టుకుని ఆలోచించు అంటూ చెప్పి కాశీ వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు నీ పెళ్లికి, అగ్రిమెంట్‌కు సంబంధం ఏంటి..? అంటూ పారిజాతం అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా నా పెళ్లి బాధ్యత తీసుకున్నాడు కాబట్టి నా పెళ్లి కాగానే అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ అవుతుంది అని చెప్పగానే.. కాంచన కోపంగా తిడుతుంది. కార్తీక్‌ మాత్రం నేను మాట తప్పను.. జ్యోత్స్న మెడలో మూడుముళ్లు పడేంతవరకు నేను నా భార్య దీప ఇక్కడే ఉంటాం అని కార్తీక్‌ చెప్పగానే.. కాంచన షాక్‌ అవుతుంది. శివనారాయణ మాత్రం కాంచనను ఓదారుస్తాడు. కార్తీక్‌ విషయంలో నేనేమీ చేయలేను. శ్రీధర్‌ను అయితే ఈ క్షణమే సీఈవో బాధ్యతల నుంచి తీసేస్తున్నాను. తను ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కంపెనీ చూసుకుంటుంది. అని చెప్పగానే.. కాంచన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×