E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుమిత్రకు దగ్గరైన దీప  

Karthika Deepam 2 Serial Today Episode May 23rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుమిత్రకు దగ్గరైన దీప  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: శివనారాయణ అందరిని భోజనానికి పిలుస్తుంటే.. జ్యోత్స్న ఏంటి తాత అందరిని పిలుస్తున్నావు అని అడగ్గానే.. భోజనం చేద్దామని పిలుస్తున్నాను అనగానే.. మనం తిందాం పద తాత వాళ్లు తర్వాత తింటారు అనగానే.. తర్వాత ఏంటి అందరం కలిసే తిందాం అనగానే.. బావ, దీప కలిసి భోజనం చేయోద్దు అంటుంది జ్యోత్స్న. దీంతో శివనారాయణ కోపంగా తిడతాడు. ఏదైనా ఆఫీసులో ఉంటే చూసుకోండి.. ఇంట్లో అలాంటివేం లేదు అందరం కలిసే తిందాం పదండి అంటూ వెళ్లి అందరూ భోజనం చేస్తుంటారు.

దీప, శౌర్యకు రసం వేసుకోమని చెప్పగానే.. సుమిత్ర కూర ఉంది కదా దీప కూర వేయమని చెప్తుంది. అప్పుడే  జ్యోత్స్న కలగజేసుకుని రోజూ రసం తినడం అలవాటైంది కదా మమ్మీ అందుకే ఇవాళ కూడా రసమే వేస్తుంది దీప అంటూ వెటకారంగా మాట్లాడితే కాంచన కోపంగా జ్యోత్స్నను తిడుతుంది. మాకు ఇంట్లో కూరలు వండుకోవడం చేతకాదు మొత్తం రసమే తింటాము అంటుంది. కార్తీక్‌ అయితే రసం గురించి పెద్ద కథనే చెప్తాడు. అన్నింటి కన్నా నైట్‌ రసం తినడమే హెల్తీ అంటూ చెప్పగానే.. జ్యోత్స్న మీ సంగతి చెప్తాను ఉండు అనుకుంటూ శౌర్యను రెచ్చగొట్టి కార్తీక్‌ రూంలో ఎవ్వరూ పడుకోకూడదని వార్నింగ్‌ ఇస్తుంది. పోటీలో నిబంధనల ప్రకారం మీరు కలిసి పడుకోకూడదు అని చెప్పగానే.. దశరథ అయితే శౌర్య, సుమిత్ర రూంలో పడుకుంటుంది అని చెప్పగానే.. సుమిత్ర నాకు ఓకే దీపను కూడా పడుకోమనండి అని చెప్పగానే.. జ్యోత్స్న, పారిజాతం షాక్‌ అవుతారు.

Advertisement

స్వప్న నవ్వుతూ కాశీ దగ్గరకు వెళ్లి వెనక నుంచి హగ్ చేసుకుని మనం ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటూ అడగుతుంది. దేనికి అంటూ కాశీ అడగ్గానే.. హనీమూన్ వెళ్లడం గురించి అడుగుతున్నాను అంటుంది స్వప్న. అయితే కాశీ ఈ పరిస్థితుల్లో వెళ్లకపోవడమే మంచిదని శ్రీధర్‌ ఆరోగ్యం గురించి తాము హనీమూన్‌కు వెళ్తే వచ్చే ప్రాబ్లమ్‌ గురించి చెప్తాడు కాశీ. దీంతో స్వప్న కన్వీన్స్‌ అవుతుంది. నువ్వు ఇలా మాట్లాడకు.. మాట్లాడితే మళ్లీ నీతో ప్రేమలో పడిపోతానేమోనని భయంగా ఉంది అంటుంది. కాశీ నవ్వుతూ స్వప్నను హగ్‌ చేసుకుంటాడు.

భోజనం మధ్యలోంచి ఇరిటేటింగ్‌గా వెల్లిపోతున్న జ్యోత్న్స వెనకాలే కార్తీక్‌, దీప వెళ్తారు. వెటకారంగా జ్యోత్స్న వల్లే మనం ఈ ఇంటికి వచ్చాము. ఈవిడ వల్లే అందరం కలిసి సంతోషంగా భోజనం చేశాము.. ఈవిడ అగ్రిమెంట్‌ మీద సంతకం చేయించుకోకపోతే మనం ఈ ఇంటికి వచ్చే వాళ్లమే కాదు కదా అంటాడు కార్తీక్‌. దీప అంతే  కాకుండా ఐదో తరగతి చదివిన నేను కూడా సీఈవో కుర్చీ కోసం పోటీ పడుతున్నాను అంటే అంతా ఈవిడ వల్లే అందులో కూడా ఒక రూల్‌ పెట్టి నన్ను నిన్ను విడగొట్టాలని చూసింది కానీ ఏం జరిగింది నా కూతురు నేను తాత ఇంటికి వచ్చాము.

Advertisement

మీ అమ్మ నువ్వు మీ పుట్టింటికి వచ్చారు. చిన్న మరదలు పుణ్యమా అని కుటుంబం మొత్తం కలిశాము. అందుకే ఇద్దరం కలిసి గట్టిగా థాంక్స్‌ చెప్పాలి అంటూ ఇద్దరూ చెరో చెంప గిల్లుతూ థాంక్స్‌ చెప్తారు. జ్యోత్స్న అబ్బా అంటూ అరుస్తుంటే.. మండినట్టు ఉంది చాన్స్‌ దొరికింది కదాని గట్టిగా గిల్లడం తప్పు బావ అంటుంది దీప. నేనేం గట్టిగా గిల్లలేదు.. నేను జస్ట్‌ ఇలా గిల్లానంతే.. అంటూ దీపను గిల్లి చూపిస్తాడు. మరీ ఇంత చిన్నగా గిల్లావేంటి..? మరీ అంత ప్రేమనా..? అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే.. జ్యోత్స్న కోపంగా మరీ ఇంత సంబరపడకండి అంటూ తిడుతూ వెళ్లిపోతుంది.

సుమిత్ర రూంలోకి వెళ్లిన దీప కింద పడుకోబోతుంటే.. నువ్వు కింద పడుకుంటే కడుపులో బేబీ బాధపడదా..? అంటూ శౌర్య చెప్పగానే.. సుమిత్ర నేను చెప్పాల్సిన మాటలు నీ కూతురు చెప్తుంది. వచ్చి ఇక్కడే పడుకో అని చెప్పగానే.. దీప ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఏమైందని సుమిత్ర అడుగుతుంది. దీప ఏం లేదని చెప్పగానే.. నేను అడదాన్నే నీలాంటి సిచ్యుయేషన్‌ దాటి వచ్చాను అంటూ చెప్పగానే.. దీప మరింత ఎమోషనల్ అవుతుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×