E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రను ఆశీర్వాదం అడిగిన దీప 

Karthika Deepam 2 Serial Today Episode May 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రను ఆశీర్వాదం అడిగిన దీప 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఇంటికి వచ్చిన కాంచన నుంచి నిజం తెలుసుకోవడానికి పారిజాతం ప్రయత్నిస్తుంది. అయితే బయట ఒక బ్యాగు ఉందని అది లోపలికి తీసుకొస్తే నిజం చెప్తానని కాంచన అనగానే.. ఆ ఇప్పుడు నాకు అర్థం అయింది. మా అందరి కోసం మీరు ఏదో తీసుకొచ్చారు. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా..? ఉండండి చిటికెలో పట్టుకొస్తాను అంటూ బయటకు వెళ్లి అతి కష్టం మీద బ్యాగు తీసుకుని లోపలికి వస్తుంది పారిజాతం. బ్యాగు బరువుగానే ఉంది. ఏమున్నాయి ఇందులో అని అడగ్గానే..

బట్టలున్నాయి పిన్ని నా కొడుకు రెండు వారాలు రాడు కదా..? అందుకే ఈ రోజు నుంచి నేను నా కొడలు రెండు వారాలు ఇక్కడే ఉంటాము అని చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. దీనిని నేను ఒప్పుకోను అంటుంది. దీంతో అందరూ నువ్వు ఒప్పుకోవడం ఏంటి..? మేమంతా ఒప్పుకుంటున్నాము అంటారు. ఏం చేయాలో అర్థం కాక జ్యోత్స్న అయోమయంగా చూస్తుంది. దశరథ మాత్రం కాంచన, దీపను లోపలికి తీసుకెళ్లమని చెప్తాడు. కార్తీక్‌ వాళ్లను లోపలికి తీసుకెళ్తాడు. శివనారాయణ హ్యాపీగా దశరథకు థాంక్స్‌ చెప్తాడు. కార్తీక్‌ ఇచ్చిన సలహా ఇలా పని చేస్తుందని అనుకోలేదు.. అనగానే.. ప్రతి సమస్యకు వాడి దగ్గర ఓ పరిష్కారం ఉంటుంది నాన్న అంటూ నవ్వుకుంటాడు దశరథ.

Advertisement

రూంలోకి వెళ్లిన జ్యోత్స్న, పారిజాతాన్ని తిడుతుంది. నీ దరిద్రమే నాకు అంటుకున్నట్టు ఉంది అంటుంది. పారిజాతం కూడా జ్యోత్స్నను తిడుతూ.. మనం ఇలాగే గొడవ పడితే ఆ కార్తీక్‌ గాడు చేసేది చేస్తాడు అంటూ పారిజాతం చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాదు. అనగానే.. తప్పు నీ దగ్గరే జరిగింది. ఇంటికి వెళ్లి మీ అత్తను రెచ్చగొట్టి తప్పు చేశావు.. అనగానే.. అర్జెంట్‌గా దీపను ఇంట్లోంచి తరిమేయాలి అంటే ఏం చేయాలి గ్రానీ అంటూ అడగ్గానే.. నేనేం చేయలేను అంటూ పారిజాతం చేతులెత్తేస్తుంది.

అందరూ ఆఫీసుకు బయలుదేరుతుంటే.. దీప కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్లి సుమిత్రతో ఆశీర్వాదం తీసుకుంటుంది. దీంతో ఏమని ఆశీర్వదించాలో అర్థం కావడం లేదని సుమిత్ర చెప్పగానే.. జ్యోత్స్న నవ్వుతుంది. కార్తీక్‌ మాత్రం పారిజాతంతో నువ్వేదో తేడాగా ప్రవర్తిస్తున్నావు పారు అంటాడు. దీంతో పారిజాతం షాక్‌ అవుతుంది. నేనేం చేశానురా అని అడుగుతుంది. దీంతో నువ్వు జ్యోత్స్నకు కన్ను కొట్టడం నేను చూశాను అని చెప్పగానే.. పారిజాతం షాకింగ్గా మైనంగా ఉండిపోతుంది. కాంచన దీపకు ఆల్ ది బెస్ట్‌ చెప్తుంది. అందరూ ఆఫీసుకు వెళ్లిపోతారు.

Advertisement

జ్యోత్స్న, కార్తీక్‌తో ఆఫీసుకు వెళ్తూ.. సూరజ్‌ మీద  ఫుడ్‌డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్‌ ఇచ్చి ఉంటుంది ఆ డిపార్ట్‌ మెంట్‌ నుంచి ఆఫీసర్లు వచ్చి సూరజ్‌ స్టాల్‌ తీసేస్తుంటారు. అది చూసిన కార్తీక్‌ వెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆఫీసర్లు స్టాల్‌ మొత్తం పీకేసి  వెళ్లిపోతారు. ఇంతలో జ్యోత్స్న, కార్తీక్‌ మరదలని సూరజ్‌కు తెలిసిపోతుంది.   దీంతో సూరజ్‌ మీ మరదలా అంటూ అడగ్గానే.. అవునని మీరు ఇద్దరు ముందే తెలుసా..? అని కార్తీక్‌ అడగ్గానే.. తెలుసని ఇద్దరి మధ్య జరిగిన విషయాలు చెప్తాడు సూరజ్‌  జ్యోత్స్న మాత్రం సూరజ్‌కు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. కార్తీక్‌, సూరజ్‌ను ఓదార్చి హెల్ప్‌ చేస్తాను అనగానే.. పర్వాలేదు మీరు వెళ్లండి అని చెప్తాడు సూరజ్‌. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×