E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతానికి నిజం చెప్పిన జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode May 13th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతానికి నిజం చెప్పిన జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్నే తన అసలైన మనవరాలు అని తెలుసుకున్న పారిజాతం దగ్గరకు జ్యూస్‌ తీసుకెళ్లి ఇస్తుంది జ్యోత్స్న. జ్యూస్‌ తాగుతూ ఇదంతా ఆ కార్తీక్‌ గాడు దాస్‌ గాడు కలిసి ఆడిన నాటకం అని నాకు అనిపిస్తుంది అంటూ అవును నువ్వు అసలైన వారసురాలివి కాకపోతే సుమిత్రకు ఆపరేషన్‌ ఎలా జరిగింది అంటూ అనుమానపడుతుంది పారిజాతం. నీ బ్లడ్‌ శాంపిల్‌ సుమిత్రకు ఎలా మ్యాచ్‌ అయ్యాయి. అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటుంది. అసలు నువ్వు దాసు కూతురువా..? సుమిత్ర కూతురువా..? అంటూ కన్ఫీజ్‌ అవుతుంది. జ్యోత్స్న మాత్రం అన్ని నిజాలే అని చెప్పగానే.. పారిజాతం మరి సుమిత్ర ఎలా బతికింది అని అడగ్గానే.. కన్నకూతురే ఇచ్చింది అని జ్యోత్స్న చెప్పగానే.. అయితే ఆ కన్నకూతురు ఎవరే చెప్పు.. అని పారిజాతం అడగ్గానే.. జ్యోత్స్న తెలుసుకుని ఏం చేస్తావు అనగానే.. పారిజాతం కోపంగా చూస్తూ.. చంపేస్తాను అంటుంది.

అప్పుడే కిచెన్‌లో నీళ్లు తాగుతున్న దీప ఉలిక్కిపడుతుంది. కార్తీక్‌ వచ్చి ఏమైంది ఎందుకు పొలమారింది అని అడగ్గానే.. నాకెందుకో ఆ పారిజాతం మీద డౌటుగా ఉందని తనకు నిజం తెలిసిందేమోనని అంటుంది దీప. తెలిసే చాన్సే లేదంటాడు కార్తీక్‌. మరవైపు రూంలో ఉన్న పారిజాతానికి సుమిత్ర అసలైన కూతురు దీప అని జ్యోత్స్న చెప్పగానే.. పారిజాతం షాక్‌ అవుతుంది. దీప కాదేమోనని అనుమానిస్తే.. దీప డీఎన్‌ఏ రిపోర్ట్ చూపిస్తుంది జ్యోత్స్న. దీంతో పారిజాతం కోపంగా రగిలిపోతుంది. దీపే నా మనవరాలు అని ఆ కార్తీక్‌ గాడు దాస్‌ గాడితో చెప్పించాడన్నమాట అంటూ తాను జ్యోత్స్నను తిట్టింది మొత్తం గుర్తు చేసుకుంటుంది. తనను తాను తిట్టుకుంటూ కొట్టుకుంటుంది.. ఇన్నాళ్లు వాళ్లు నాతో ఆడుకున్నారు.. ఇక మీదట నేను వాళ్లతో కబడ్డీ ఆడుకుంటాను.. అంటూ చెప్పగానే.. అయితే మన టార్గెట్‌ దీప ఏం చేస్తావో చేయ్‌.. ఏం తెలియనట్టు సైలెంట్‌గా ఉండు.. నేను వెళ్తాను.. వెనకాలే రా అంటూ చెప్పి జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఓరేయ్‌ కార్తీక్‌ నీ సంగతి చూస్తానురా అంటూ పారిజాతం కోప్పడుతుంది.

Advertisement

శివనారాయణ హాల్లో కూర్చుని ఉండగా గుమస్తా విష్ణు ఫోన్‌ చేసి ఏదో చెప్పగానే.. శివనారాయణ కోపంగా ఫోన్‌లో విష్ణును తిట్టి దశరథను పిలుస్తాడు. ఏం జరిగింది నాన్న అంటూ దశరథ రాగానే.. గుమస్తా విష్ణు ఫోన్‌ చేశాడు. నెల్లూరు బ్రాంచిలో ఏదో ఫ్రాడ్‌ జరిగిందట అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. కార్తీక్‌ వెంటనే వచ్చి ఏం జరిగింది తాతయ్య అని చెప్పగానే.. అక్కడి బ్రాంచిలో నమ్మిన వాడికి అంతా అప్పజెప్పగానే.. ఇలా చేశాడు వెంటనే మనం నెల్లూరు వెళ్లాలి కారు తీయ్‌ అని శివనారాయణ చెప్పగానే.. లేదు నేను వెళ్తాను.. మీరు ఇక్కడే ఉండండి రేపు బోర్డు మీటింగ్‌ ఉంది కదా..? అంటూ దశరథ చెప్పి వెళ్లిపోతాడు. దీప మాత్రం ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం కాదు కదా అని మనసులో అనుకుంటుంది. శివనారాయణ వెళ్లిపోతాడు. పారిజాతం, దీపను విచిత్రంగా చూస్తుంటే ఎందుకు అలా చూస్తున్నావు పారు అని కార్తీక్‌ అడగ్గానే.. మీరిద్దరూ కోత్తగా కనిపిస్తున్నారురా..? అని చెప్తుంది. దీంతో దీప మాత్రం అనుమానిస్తుంది. అదే విషయం కార్తీక్‌ కు చెప్పగానే.. అదేం లేదులే అంటూ ఇద్దరు వెళ్లిపోతారు. నెల్లూరు ప్లాన్‌ తానే చేశానని పారిజాతానికి చెప్తుంది.

ఇంటికి వెళ్లిన కార్తీక్‌, దీప ఇద్దరూ కలిసి కాంచనతో దక్షిణమూర్తి గురించి చెప్పగానే.. కాంచన కోప్పడుతుంది. కార్తీక్‌, దీపలను తిడుతుంది. ఆయన గురించి అడిగితే తాను చనిపోయినంత ఒట్టు అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తుంది. దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×