E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దాస్ ద్వారా పారిజాతానికి నిజం తెలిసేలా చేసిన జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode May 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దాస్ ద్వారా పారిజాతానికి నిజం తెలిసేలా చేసిన జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: దక్షిణ మూర్తి గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకూడదని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు శివనారాయణ. వెంటనే జ్యోత్స్న, పారీజాతాన్ని కోపంగా తిడుతుంది. నేను అడిగానా..? అంటూ నిలదీస్తుంది. దీంతో పారిజాతం, జ్యోత్స్నకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో నాతో రా నీ కళ్లు తెరిపిస్తాను అంటూ తనతో తీసుకెళ్తుంది జ్యోత్స్న.

డాక్టర్‌ ఇంటికి వచ్చి సుమిత్రను పరీక్షించి ఆపరేషన్‌ జరిగింది కదా… ఆమె కోలుకోవడానికి ఇంకో ఆరు నెలలు పడుతుంది. ఈలోపు ఎదైనా ఒత్తిడి ఆమెకు వచ్చినా ఇలాగే అవుతుంది టాబ్లెట్స్‌ అవే కంటిన్యూ చేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో శివనారాయణ కోపంగా అందరినీ తిడతాడు. సుమిత్ర నీ మనసుకు కష్టపెట్టే పనులు ఏవీ ఇంట్లో జరగవు నేను నీకు మాటిస్తున్నాను అంటూ అందరినీ వెళ్లమని చెప్తాడు శివనారాయణ. అందరూ వెళ్లిపోయాక దశరథ, సుమిత్ర పక్కన కూర్చుని ఓదారుస్తాడు. నాకు నువ్వు క్షేమంగా ఉండటం ముఖ్యం అంటూ ఎమోషనల్ అవుతాడు.

Advertisement

తర్వాత జ్యోత్స్న, దాస్‌ను పిలిచి తాను దాస్‌తో మాట్లాడేది పారిజాతాను చాటుగా వినమని చెప్తుంది. దీంతో పారిజాతం చాటు నుంచి వింటుంటే.. దాస్ తో జ్యోత్స్న నాకు భయంగా ఉంది నాన్న బతకాలని లేదు అంటూ ఎమోషనల్ అవుతుంటే.. దాస్‌ కూడా నువ్వు నా కూతురువి నిన్ను ఇలా చూడలేను అమ్మ అంటూ దాస్‌ చెప్తుంటే.. పారిజాతం విని షాక్‌ అవుతుంది. ప్లాన్ ప్రకారం జ్యోత్స్న, దాస్‌ నుంచి నిజం చెప్పిస్తుంది. పారిజాతం అంతా విని ప్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. ఎంత పని చేశావురా దాసు అంటూ ఎమోషనల్ అవుతుంది. దాసు వెళ్లిపోతాడు. వెంటనే జ్యోత్స్న పారిజాతాన్ని పిలుస్తుంది. పారిజాతం ఏడుస్తూ.. జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. జ్యోత్స్న మూసుకుపోయిన కళ్లు తెరిపిస్తానని చెప్పాను కదా తెరిపించాను..అనగానే.. పారిజాతం ఎమోషనల్‌ అవుతూ మనవరాలా..? అంటూ పట్టుకోబోతుంటే.. జ్యోత్స్న కోపంగా పారిజాతాన్ని తిట్టి వెల్లిపోతుంది.

మరోవైపు ఇంట్లో జరిగిన గొడవ గురించి సుమిత్ర గురించి కిచెన్‌లో ఉన్న దీప ఆలోచిస్తుంది. ఇంతలో కిచెన్ లోకి వచ్చిన కార్తీక్‌తో మనకు తెలియని కథ మన కుటుంబంలోనే ఒకటి ఉంది మనం తెలుసుకోవాలి అని చెప్పగానే.. కార్తీక్‌ నేను తెలుసుకుంటాను కానీ ఈ పుడ్డు తిను అంటూ దీపకు భోజనం తినిపిస్తుంటాడు. వెనక నుంచి జ్యోత్స్న, పారిజాతం వచ్చి చూస్తుంటారు. వాళ్లను గమనించిన కార్తీక్‌ జ్యోత్స్న ను తిడతాడు. పనోళ్లకు ప్రైవసీ ఉండదా…? అంటూ నిలదీస్తాడు. నువ్వేమీ అనవా పారు అని అడగ్గానే.. పారిజాతం నేనేమీ అనను.. నా ముఖానికి అన్ని దెబ్బలు తగులుతుంటాయి అంటూ అయోమయంగా మాట్లాడుతుంది. దీంతో కార్తీక్‌ అయ్యబాబోయ్‌ దీప పారుకు ఏదో పోయే కాలం వచ్చినట్టు ఉంది. పట్టపగలే ఏదో పరాగ్గ మాట్లాడుతుంది అనగానే..

Advertisement

పారిజాతం కూడా అవున్రా ఇది పోయే కాలమే.. వచ్చే కాలమే.. మొత్తానికి నా కళ్లు తెరిపించే కాలం అంటూ మాట్లాడుతుంటే.. కార్తీక్ నో డౌట్‌ ఇది వడదెబ్బే చాలా గట్టిగా తగిలినట్టు ఉంది. పారు నువ్వు ఇలా కూర్చో అంటూ చెప్తే.. నాకు అంతా అయోమయంగా ఉంది నేను పోతా… అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కార్తీక్‌ మాత్రం దీపను నువ్వు భోజనం చేయ్‌ అని అన్నం తినిపిస్తుంటే.. జ్యోత్స్న కోపంగా ఏం నువ్వు తినిపిస్తే కానీ దీప తినదా..? అనగానే.. కార్తీక్‌ జ్యోత్స్నను తిట్టి నువ్వు పెళ్లి చేసుకో అప్పుడు తెలుస్తుంది అంటాడు. దీంతో దీప, జ్యోత్స్న మధ్య దక్షిణమూర్తి గురించి గొడవ జరుగుతుంది.   దీంతో జ్యోత్స్న  అక్కడి నుంచి జ్యూస్‌ తీసుకుని పారిజాతం దగ్గరకు వెళ్తుంది. పారిజాతం బాధగా జ్యోత్స్నకు సారీ చెప్తుంది. జ్యోత్స్న పారిజాతాన్ని తిడుతుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×