E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర సూసైడ్ ప్రయత్నం  

Karthika Deepam 2 Serial Today Episode May 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్ర సూసైడ్ ప్రయత్నం  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: శివనారాయణ కోసం వచ్చిన దక్షిణమూర్తి గేటు ముందు నిలబడి చూస్తుంటే.. అప్పుడే కార్తీక్‌, దీప వస్తారు. ఎవరు మీరు ఎవరి కోసం వచ్చారు అని కార్తీక్‌ అడగ్గానే.. శివనారాయణ కోసం వచ్చానని చెప్తాడు. అయితే మీరు ఆయన చిన్నప్పటి ఫ్రెండ్‌ అయ్యుంటారు అంటూ కార్తీక్‌ ఆయనను లోపలికి తీసుకెళ్తుంటే.. పై నుంచి చూసిన పారిజాతం షాక్‌ అవుతుంది. వీడేంటి దక్షిణమూర్తిని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు.. ఆయనకు తెలిసిందంటే ఇంకేమైనా ఉంటుందా..? అనుకుంటూ బయటకు పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడే శివనారాయణ అడ్డగా వస్తాడు. పారిజాతాన్ని తిడతాడు. ఇంతలో కార్తీక్‌ ఇంట్లోకి వచ్చి తాత ఇవాళ నీకో సర్‌ఫ్రైజ్‌ తీసుకొచ్చాను అని చెప్పగానే… శివనారాయణ ఏంట్రా అది అంటాడు..

పారిజాతం మాత్రం భయపడుతుంది. ఇంతలో కార్తీక్‌ పెద్దాయన అక్కడే ఆగిపోయారేంటి.. లోపలికి రావొచ్చు కదా అంటూ దక్షిణమూర్తిని పిలుస్తాడు.  పారిజాతం మాత్రం వద్దురా అంటుంది. కార్తీక్‌ నువ్వాగు పారు.. మీరు రండి అంటూ పిలుస్తాడు. దక్షిణ మూర్తి లోపలికి వెళ్తాడు. దక్షిణమూర్తిని చూసిన శివనారాయణ షాక్‌ అవుతాడు. పారిజాతం భయపడుతుంది. కార్తీక్‌ మాత్రం ఏం తాత నీ చిన్నప్పటి స్నేహితుడిని చూసి షాక్‌ అయ్యావా.? అని అడగ్గానే.. శివనారాయణ కోపంగా ఇతను నా స్నేహితుడు కాదురా నా శత్రువు.. ఎందుకు వచ్చావు ఇంటికి.. అంటూ తిట్టగానే.. జ్యోత్స్న ఎవరు తాత ఇతను  అని అడుగుతుంది. దీంతో శివనారాయణ కోపంగా పరిచయం చేయడానికి కూడా పనికిరాని బంధువు.. ఇంకా నట్టింట్లో నిలబడ్డావేం బయటకు వెళ్లు.. అనగానే.. కార్తీక్‌ ఏమైంది తాత అంటాడు.

Advertisement

శివనారాయణ కోపంగా నువ్వు మాట్లాడకురా ఇంకా నిలబడి చూస్తావేం.. పో బయటకు అంటాడు. దీంతో దక్షిణమూర్తి నేను వచ్చింది నీ కోసం కాదు.. అనగానే.. శివనారాయణ మరి ఎవరి కోసం నీకు సంబంధించిన వాళ్లు ఎవరూ ఈ ఇంట్లో ఎవరూ లేరు అనగానే.. దక్షిణమూర్తి ఉన్నారు అంటాడు. దీప, కార్తీక్‌తో ఎవరో ఏంటో తెలియకుండా ఇంట్లోకి తీసుకొచ్చావు.. ఈ పెద్దాయనకు తాతయ్యకు గొడవులు ఉన్నట్టున్నాయి.. అంటూ చెప్తుండగానే.. సుమిత్ర వచ్చి ఏమైంది మామయ్యగారు అంటూ అడగ్గానే.. శివనారాయణ కోపంగా ఎవరొచ్చారో చూడు అంటాడు. దక్షిణమూర్తిని చూసిన సుమిత్ర షాక్‌ అవుతుంది. దక్షిణమూర్తి, సుమిత్ర దగ్గరకు వెళ్లి బాగున్నావా అమ్మా అని అడుగుతాడు. దీంతో సుమిత్ర కోపంగా బాగున్నావా..? అని కాదు.. బతికున్నావా..? అని అడుగు అంటూ సుమిత్ర ఎమోషనల్‌ అవుతుంది. దీంతో దక్షిణమూర్తి బాధగా సుమిత్రతో మాట్లాడుతుంటే.. శివనారాయణ కోపంగా తిడతాడు. దీంతో దక్షిణమూర్తి సుమిత్రను నేను మీ నాన్న అన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పగానే.. కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు.

శివనారాయణ కోపంగా దక్షిణమూర్తి మీద శివాలెత్తుతాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దీంతో దక్షిణమూర్తి నేను నా కూతరు కోసం వచ్చానని చెప్తాడు. దీంతో నువ్వు వెళ్లి నీ కూతురు కోసం మన ఊరి స్మశానంలో కట్టించిన సమాధిలో ఉంది చూసుకో అంటూ చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. సుమిత్ర కోపంగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ తిడుతుంది. నువ్వు వెళ్లకపోతే నేను ఇప్పుడే తల బాదుకుని చనిపోతాను అంటూ తల గోడకేసి బాదుకుని స్పృహతప్పి పడిపోతుంది. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీక్‌, డాక్టర్‌కు ఫోన్‌ చేసి ఇంటికి  రమ్మంటాడు. దశరథ, పారిజాతం దీప కలిసి సుమిత్రను లోపలికి తీసుకెళ్తారు. శివనారాయణ కోపంగా ఇక్కడి నుంచి వెళ్లిపో దక్షిణమూర్తి అనగానే.. నేను వెళ్లిపోతాను.. కానీ మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారు.. కచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు అంటూ దక్షిణమూర్తి వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత దక్షిణమూర్తి గురించి తెలుసుకోవాలని కార్తీక్‌, దీప అనుకుంటారు. పారిజాతం దగ్గరకు వెళ్లి దక్షిణమూర్తి గురించి అడుగుతారు. దీంతో పారిజాతం అదే పెద్ద కథరా తెలుసుకోకపోతేనే మంచిది అంటుంది. దీంతో కార్తీక్ పారిజాతాన్ని కన్వీన్స్‌ చేసి నిజం తెలుసుకోవాలని చూస్తాడు. పారిజాతం నిజం చెప్పబోతుంటే.. అప్పుడే శివనారాయణ వచ్చి కోపంగా వాళ్ల గురించి నీ నుంచి ఒక్కమాట వచ్చినా వాళ్లకు వేసిన శిక్షే నీకు వేస్తాను.. అయినా వాళ్ల గురించి చెప్పమని నిన్ను ఎవరు అడిగారు అంటూ నిలదీయగానే.. పారిజాతం వెంటనే జ్యోత్స్న అడిగింది అంటుంది. జ్యోత్స్న షాక్‌ అవుతుంది.  శివనారాయణ కోపంగా తిడుతూ అసలు దక్షిణమూర్తిని ఎవరు తీసుకొచ్చారు అని అడగ్గానే.. బావ తీసుకొచ్చాడంట.. నాకు గ్రానీ చెప్పింది అంటూ జ్యోత్స్న చెప్పగానే.. పారిజాతం, కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×