E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 9th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: రక్తపాతానికి సిద్దమన్న జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today march 9th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: రక్తపాతానికి సిద్దమన్న జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

కాంచన, శౌర్యకు అన్నం తినిపిస్తుండగా అమ్మానాన్న ఎక్కడున్నారని అడుగుతుంది శౌర్య. కాంచన కోప్పడటంతో శౌర్య బాధపడుతుంది. నాకు చెల్లి పుడితే నన్ను హాస్టల్‌లో వేస్తారట నన్ను ఇంట్లోంచి పంపిచేస్తారా..? నాకు నువ్వంటే చాలా ఇష్టం.. నువ్వు కోప్పడితే నేను బాధపడతాను అంటూ చెప్పగానే.. కాంచన ఎమోషనల్‌ అవుతుంది. ఎంతమంది వచ్చినా నువ్వే నాకు ఫస్ట్ నీకు చెల్లి వచ్చినా నీ తర్వాతే అని చెప్తుంది. అంతా వింటున్న కార్తీక్‌ బాధపడతాడు. ఇక కార్తీక్‌ రావడం చూసిన శౌర్య వెళ్లి హగ్‌ చేసుకుని దీపను అడుగుతుంది. దీంతో అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదని అమ్మ అక్కడే ఉండిపోయిందని చెప్తాడు కార్తీక్‌. మరి అమ్మ ఎప్పుడు వస్తుందని శౌర్య అడగ్గానే.. అమ్మమ్మకి ఆరోగ్యం బాగయ్యాక వస్తుందని చెప్తాడు. ఇక కాంచన దీప గురించి అడుగుతుంది హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయ్యారా..? డాక్టర్‌ ఏం చెప్పారు అని అడిగినా కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు.

సుమిత్ర, దీప గురించి దశరథను అడుగుతుంది. హాస్పిటల్‌ లో అడ్మిట్‌ అయిందా తన గురించే మీరు ఆలోచిస్తున్నారా..? అని అడగ్గానే.. తన గురించి ఆలోచించచడానికి ఏముంది అక్కడ కార్తీక్‌ ఉన్నాడు కదా అంటాడు. అయితే ఆడ పిల్లలకు  ఈ సమయంలో కన్నతల్లి పక్కన ఉండాలని భర్తకు చెబితేనే తెలుస్తుందని అదే కన్నతల్లి అయితే ముందే ఏం కావాలో అర్థం చేసుకుంటుందని చెప్తుంది. అయితే కొంతమంది కూతుళ్లు కూడా తల్లికి ఏం కావాలో అడగకుండానే అర్థం చేసుకుంటారు అని దశరథ చెప్పగానే.. అవునండి మన జ్యోత్స్న ను చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అది నా కోసం ఆపరేషన్‌ కు ఒప్పుకుంది అనగానే… మన కూతురు జోత్స్న కాదు దీప అని మనసులో అనుకుంటాడు దశరథ. జ్యోత్న్సను తిట్టి దీపను మెచ్చుకోగానే.. ఎంతైనా కన్నకూతురు తనను పరాయిదానిలా మాట్లాడకండి అంటూ సుమిత్ర కోప్పడుతుంది. దీంతో కార్తీక్‌, దీప ఎంత త్యాగం చేస్తున్నారో నీకేం తెలుసు అని మనసులోనే బాధపడతాడు దశరథ.

Advertisement

ఇక కార్తీక్‌ మౌనంగా ఉండిపోవడంతో కాంచన కోపంగా తిడుతుంది. నీకొక కూతురు పుట్టినా కూడా శౌర్య నాకు పెద్ద మనవరాలే, దానిని తక్కువగా చూడను. అది నా మనవరాలే, దానికి నేను నానమ్మనే అంటూ.. నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను.. బిడ్డని క్షేమంగా నా చేతుల్లో పెడతానని దీప మాటిచ్చింది.. నన్ను వెర్రిదానిని చేయడం కాకపోతే నిలబెట్టుకోలేని మాటివ్వడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్‌ ఏడుస్తూ.. కాంచన కాళ్ల మీద పడిపోతాడు. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నాను అంటూ బాధపడతాడు. ఇంతో శ్రీధర్‌ వచ్చి ఎవరి కోసమో మన ఆశల్ని చంపుకోవాల్సిన అవసరం లేదని.. మన సంకల్పం బలంగా ఉంటే అదే నిజమవుతుందని చెప్తాడు.

ఇక జ్యోత్స్న దాస్‌ను కలిసి నిజం తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం దాస్‌ను తిడుతుంది. జ్యోత్స్న ఎంత ప్రయత్నించినా దాస్ నిజం చెప్పడు.. అయితే జ్యోత్స్న కోపంగా నేను ఏది అంత తేలికగా వదిలిపెట్టను. పుట్టిన దగ్గరి నుంచి పెంచుకున్న ఆశలు.. మీరంతా కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి దీపని యువరాణిని చేయాలనుకుంటే అది జరగదు.. శివన్నారాయణ గారి ఆస్తికి ఏకైక వారసురాలిని నేనే.. ఒకరాజు సింహాసనం ఎక్కేటప్పుడు రక్తపాతం జరుగుతుంది. అయినాసరే వదిలిపెట్టను అంటుంది జ్యోత్స్న. నీకు రాసిపెట్టున్నది మాత్రమే నీకు దక్కుతుందని చెప్పి దాస్ వెళ్లిపోతాడు. మరోవైపు శ్రీధర్‌ కాంచనతో ఈరోజు నుంచి నేను ఇక్కడే ఉంటానని చెప్తాడు. కాంచన అవసరం లేదని చెప్పినా వినడు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×