E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 6th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఆపరేషన్‌కు ఒప్పుకున్న కాంచన

Karthika Deepam 2 Serial Today march 6th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఆపరేషన్‌కు ఒప్పుకున్న కాంచన
Advertisement

Karthika Deepam 2  serial today Episode: నిజం తెలుసుకోవడానికి డాక్టర్‌ హరికను కలుస్తుంది జ్యోత్స్న. సుమిత్రకు జరిగే ఆఫరేషన్‌ గురించి అడుగుతుంది డాక్టర్‌ను అదేం ఒక్క ఇంజక్షన్‌ చేసి తగ్గించే జ్వరం కాదు కదా.. ఒక ప్రొసీజర్‌ ఉంటుంది కదా..? అది ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు అని అడుగుతుంది. ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు అని డాక్టర్‌ అడగ్గానే.. కన్నకూతురిగా మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అంటుంది జ్యోత్స్న.. అయితే మీరు కన్నకూతురినని కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? అంటూ డాక్టర్‌ ప్రశ్నించగానే.. జ్యోత్స్న వెటకారంగా కొందరు తెలివైనవాళ్లు ఏమనుకుంటారో తెలుసా? మనం ఏం చెప్పినా అవతలివాళ్లు నమ్ముతారని అనుకుంటారు.

కానీ అది నిజం కాదు.. అవతలివాళ్లు నమ్మరు కానీ  వింటారని మాత్రం ఎవరికి తెలుసు అంటుంది. దీంతో డాక్టర్‌ కూడా మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఫేక్‌ని క్రియేట్ చేసినా అది ఒరిజినల్ కాలేదు.. ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే అంటుంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం నడుస్తుంది. దీంతో జ్యోత్న్స తన రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం వెనుక ఏదో పెద్ద డ్రామానే జరుగుతుందని మనసులో అనుకుంటుంది. వెంటనే.. కన్నకూతురు కాకుండా బోన్‌మారో ఎవరైనా డొనేట్ చేయొచ్చా..? అని అడగ్గానే.. బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్లే చేయాలని డాక్టర్‌ చెప్తుంది. దీంతో జ్యోత్స్న ప్రెగ్నెన్సీ ఉమెన్ డోనర్‌గా పనికివస్తారా అంటూ అడగ్గానే.. డాక్టర్‌ మౌనంగా ఉంటుంది.

Advertisement

మరోవైపు అందరికీ నిజం చెప్తాడు కార్తీక్‌. బిడ్డకు తల్లికి ఇద్దరికీ సమస్య ఉంది.. ఇద్దరిలో ఒకరే క్షేమంగా ఉండే పరిస్ధితి అని కార్తీక్ చెబుతాడు. దీంతో కాంచన కోప్పడుతుంది. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు అంటుంది. దీని కంతటికీ దీపే కారణం అంటూ దీపను నానామాటలు అంటుంది. నా కొడుక్కి బిడ్డ పుట్టబోతోంది అంటే వాడి తల్లిగా నాకు ఎంత ఆనందం ఉంటుంది. కానీ ఈ దీప నాకు ఆ ఆనందాన్ని కూడా మిగల్చలేదు అంటూ ఏడుస్తుంది కాంచన. అప్పుడే శివనారాయణ దీప బిడ్డను కాపాడేందుకు ఎంత ఖర్చైనా తాను పెడతానంటాడు. కానీ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా లాభం ఉండదని దశరథ చెబుతాడు. నేను కూడా హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్ గారిని అడుగుతానని అంటుంది కాంచన.

అనసూయ కూడా కోపంగా  ఇన్నాళ్లూ మీ అమ్మనాన్న ఎవరో తెలిస్తే బాగుండు అనుకునే దానిని, వాళ్లెవరో ఎప్పటికీ తెలియకూడదని ఇప్పుడు దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్లు నీ జీవితంలోకి వస్తే వాళ్లు ఉండరని.. దేవుడు తీసుకెళ్లిపోతాడని అంటుంది. దీంతో దశరథ కోపంగా అందరూ దీపని తప్పుబట్టేవాళ్లే… ఒక్కరు కూడా అర్ధం చేసుకోరా అంటాడు. మరోవైపు డాక్టర్‌ను గట్టిగా నిలదీస్తుంది జ్యోత్స్న. దీంతో డాక్టర్‌ మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా..? అని అడుగుతుంది. తనకు పెళ్లే కాలేదని.. జ్యోత్స్న డాక్టర్‌ను తిడుతుంది. దీంతో డాక్టర్‌ మీకు ఏమైనా వివరాలు కావాలంటే దశరథ గారినే అడగండి అని సీరియస్‌గా చెప్తుంది. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది.

Advertisement

ఇక దీపను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి కాంచన ఒప్పుకుంటుంది. దశరథ, కార్తీక్‌ కలిసి దీపను తీసుకుని వెళ్తుంటే.. ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను..ఇద్దరిని సేవ్‌ చేయమని డాక్టర్లతో మాట్లాడమని చెప్తాడు శివనారాయణ. ఇక బాధపడుతున్న దశరథ, దీపలను కార్తీక్‌ కన్వీన్స్‌ చేస్తాడు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×